ఆంధ్రప్రదేశ్‌

నేటి నుంచి పుట్టపర్తి సత్యసాయి జయంతి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి,నవంబర్ 17: పుట్టపర్తి సత్యసాయిబాబా జయంతి వేడుకలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పుట్టపర్తిలో ప్రతిఏటా ఆరు రోజుల పాటు సత్యసాయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 18న వేణుగోపాలస్వామి రథోత్సవం నిర్వహిస్తారు. పురాతన వేణుగోపాలస్వామి దేవాలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించిన వీధుల్లో ఊరేగిస్తారు. 19వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం, 20న సత్యసాయి సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి 25వ వార్షికోత్సవం, 21న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు, 22న సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ 35వ స్నాతకోత్సవం జరుగుతాయి. 23వ తేదీ సత్యసాయి జయంతి వేడుకలు నిర్వహిస్తారు.