శ్రీకాకుళం

నగదులావాదేవీలపై డేగకన్ను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: అక్రమార్జనను వెనకేసుకున్న బడాబాబుల కూసాలు కదిలిపోయేలా ఆదాయపుపన్నుశాఖ (ఐటీ) రంగం సిద్ధం చేస్తోంది! పదులు వందలు కాదు వేల సంఖ్యలో నోటీసులు రెడీ చేసింది. మరికొద్దిరోజుల్లో బ్యాంకుఖాతాల్లో హైయర్ డినామినేషన్లు జమ చేసిన ఖాతాదారులకు తాఖీదులు అందించేందుకు సిద్ధమవుతోంది. కేవలం నల్లధనాన్ని వెలికితీయడం, నకిలీ నోట్లకు చెక్‌పెట్టడంతో ఆగిపోకుండా పాతనోట్ల రద్దుతో పన్ను ఆదాయం పెంచుకునే ప్రయత్నాన్ని ముమ్మరం చేసేందుకు ఐటీ అధికారులు అడుగులు వేస్తున్నారు. నల్లధనం ఉంటే ఐటీశాఖకు లెక్కచెప్పి 30 శాతం పన్ను చెల్లింపుతో బయటపడి ప్రశాంతంగా నిద్రపోండని రెండు నెలల క్రితం ఇన్‌కం డిక్లరేషన్ స్కీమ్ అవకాశాన్ని ఇచ్చిన మోదీ సర్కార్ ఆ సమయంలో స్పందించిని నల్లధనం కుభేరులకు ప్రస్తుతం ఐటీశాఖ నిఘాతో నిద్రలేని రాత్రులూ ఏలా ఉంటాయో చూపెడుతోంది. పెద్దనోట్లు రద్దు ప్రకటించిన తర్వాత ఈ నెల 10వ తేదీ నుంచి డిసెంబర్ 30 వరకూ ఎవరు ఎంత మొత్తంలో బ్యాంకుఖాతాల్లో డిపాజిట్ చేస్తున్నారన్న విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్న ఆదాయపుపన్నుశాఖ...రెండున్నర లక్షల రూపాయలకు మించిన డిపాజిట్ల వివరాలను సేకరించేపనిలో పడింది. వీటిని డిపాజిటర్లు సమర్పించిన ఐటీ రిటర్నులతో పోల్చిచూసి ఆదాయపుపన్నుశాఖకు ఇచ్చిన రిటర్నులో ఉన్న ఆదాయానికి బ్యాంకులో ఉన్న సొమ్ముకి లెక్క సరిపోకపోతే ఈ మొత్తాన్ని పన్ను ఎగవేతగా పరిగణినించేందుకు ఆ శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. జిల్లా అంతటా ఇప్పటి వరకూ 1548 మందికి ఐటీ నోటీసులు ఇచ్చేందుకు ఆ శాఖ ఇన్‌స్పెక్టర్లు, అధికారులు సిద్ధం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇలాంటి మొత్తంపై భారీ పెనాల్టీ ఉంటుందని హెచ్చరించిన కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదాయపుపన్ను చట్టం 270 (ఎ) కింద 200 శాతం పెనాల్టీ విధించేందుకు ఐటీ అధికారులు సన్నద్దం అవుతున్నారు. అంటే - ఉన్నదంతా పోవడంతోపాటు పెనాల్టీ కింద సొంత ఆస్తులను కూడా పోగొట్టుకోవల్సిన పరిస్థితికి ‘ఐటీ’ వ్యూహాం రచించింది. ఇందులోభాగంగానే ఇప్పటి వరకూ శ్రీకాకుళం జిల్లాలో 1548 మందికి నోటీసులు సిద్ధం చేసి, పునఃపరిశీలన చేస్తున్నట్టు సమాచారం. కేవలం బ్యాంకుల్లో డిపాజిట్లనే కాకుండా ప్రస్తుతం నల్లధనాన్ని పరుగులు పెడుతున్న బంగారంపై కూడా ఐటీశాఖ నిఘా పెంచింది. ఆభరణాలు కొనేవారు పాన్ నెంబర్‌ను విధిగా సమర్పించాల్సివుంటుందని హెచ్చరిస్తున్నా కొందమంది బులియన్ వ్యాపారులు ఇటీవల నల్లధనాన్ని అధికంగా తీసుకుని బంగారం బిస్కెట్లు అమ్మకాలు చేసిన శ్రీకాకుళం, నరసన్నపేట, రాజాం, పలాస బంగారం దుకాణాలకు కూడా ఐటీ నోటీసులు రెడీ అయినట్టు విశ్వసనీయ సమాచారం. పెద్దనోట్ల రద్దు వెనుక ఉన్న అసలు ట్విస్టును రోజువారీగా కేంద్రప్రభుత్వం బట్టబయలు చేస్తున్న విషయం తెలిసిందే. ముందు నకిలీ నోట్లు ఏరివేయడానికన్న మోదీ సర్కార్, నల్లధనం కుబేరులను నడిరోడ్డుపైకి లాగాలన్నది మరో అంశం. కాని - తాజాగా పన్నుల ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఈ చర్య అంటూ ఐటీ అధికారులు చెప్పడం మొదలుపెట్టారు. ఒక్క దెబ్బకి మూడు పిట్టల కథను ప్రస్తుతం కేంద్రంలో సర్కార్‌పెద్దలంతా చెప్పుకొస్తున్నారు. ఏదిఏలాగైనా - శ్రీకాకుళం జిల్లాలో మాత్రం 1548 మంది నోటీసులు ఐటీశాఖ సిద్ధం చేయడంతోపాటు, 24 బంగారం వ్యాపార సంస్థలకు కూడా నోటీసులు రెడీ అయినట్టు సమాచారం. గత కొద్దిరోజులుగా రాత్రింబవళ్ళు పనిచేస్తున్న ఆదాయపుపన్నుశాఖ అధికారులు మరికొద్ది రోజుల్లో సిక్కోల్‌లో ఐటీ సర్జకల్ స్ట్రెక్ ఆరంభమైంది! ప్రస్తుతం ఆదాయపుపన్ను మినహాయింపు బ్రాకెట్ రెండున్నర లక్షల రూపాయలు కావడంతో ఏ వ్యక్తి అయినా ఒక ఆర్థిక సంవత్సరంలో రెండున్నర లక్షలు సంపాదిస్తే దానిపై ఆదాయపన్ను ఉండదని, దీంతో ఈ పరిమితి వరకు నగదు డిపాజిట్ చేసినా భయపడాల్సిన అవసరం లేదని, అనుమానస్పద కేసులైతే తప్ప రెండున్నర లక్షల లోపు డిపాజిట్‌దారుల జోలికెళ్లమని ఐటీశాఖ అధికారులు సుస్పష్టం చేస్తున్నారు.

షట్టర్ల కుంభకోణంపై ఆరా
హిరమండలం, నవంబర్ 18: షట్టర్ల కుంభకోణానికి సంబంధించి హిరమండలం వంశధార సబ్‌డివిజనల్ కార్యాలయంలో శుక్రవారం సిఐడి అధికారులు తనిఖీలు చేశారు. ఈ మేరకు అధికారుల నుంచి వివరాలు సేకరించారు. గొట్టాబ్యారేజ్‌కు అనుసంధానంగా ఉన్న కాలువల్లో ఏర్పాటు చేసిన షట్టర్లలో భారీ అవినీతి చోటు చేసుకుంది. 2005లో జరిగిన కుంభకోణంపై విచారణ బాధ్యతను సిఐడికి ప్రభుత్వం అప్పగించింది. దీనిపై 33 మంది ఇంజనీరింగ్ అధికారులపై కేసులు నమోదు కూడా జరిగింది. నరసన్నపేట, టెక్కలి డివిజన్ పరిధిలోని ఇంజనీర్లపై కూడా కేసులు నమోదు చేశారు. దీనిపై పూర్తిస్థాయిలో సిఐడి అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. విశాఖపట్నం సిఐడి సిఐ ఎస్ విజయకుమార్, జలవనరులశాఖ విశాఖపట్నం సబ్‌డివిజన్ డిఇ సి.హెచ్.సుప్రజ, శ్రీచరణ్‌తో పాటు జె ఇలు శివరాజ్ వివరాలు సేకరించారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి కార్యాలయ సిబ్బంది నుంచి అభిప్రాయాలు సేకరించారు. వీటిపై సిఐడి సిఐ విజయకుమార్ మాట్లాడుతూ ఆమదాలవలస, హిరమండలం సబ్ డివిజన్ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టామని, షట్టర్లకు సంబంధించి పూర్తిస్థాయి దర్యాప్తు నిర్వహించి నివేదికలు సేకరించినట్టు తెలిపారు. శ్రీకాకుళం సబ్‌డివిజన్ నుంచి కూడా వివరాలు సేకరించనున్నట్టు తెలిపారు.
లోక్‌సభలో..
సిక్కోలు గళం!

* ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత కల్పించండి
* ఎంపి రామ్మోహన్‌నాయడు విజ్ఞప్తి

శ్రీకాకుళం, నవంబర్ 18: ఉద్యమాల గడ్డ, సర్దార్ గౌతు లచ్చన్న, బొడ్డేపల్లి రాజగోపాలరావు, గొర్లె శ్రీరాములనాయుడు, కింజరాపు ఎర్రన్నాయుడు వంటి ఎంతోమంది మహానాయకులు ప్రజలు తరుఫున చట్టసభల్లో గళం వినిపించిన విషయం తెలిసిందే! ఆ మార్గానే్న ఎంచుకున్న శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు శుక్రవారం లోక్‌సభలో ప్రత్యేక ప్యాకేజీ కోసం ఇంకా పోరాటాలు చేయలేమని..రెండున్నర ఏళ్ళు నిరీక్షించామని...ఇకనైనా ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత కల్పించమంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గళాన్ని పార్లమెంటులో వినిపించారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రం సాయంపై రెండున్నర ఏళ్ళుగా గడుస్తున్నా ఇప్పటికీ స్పష్టత లేదని ఎం.పి. రామ్మోహన్‌నాయుడు అన్నారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన ప్యాకేజీకి చట్టబద్దత అంశాన్ని లేవనెత్తి, రాష్ట్ర ప్రజల మనోభావాలను వివరించారు. ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీకి వెంటనే చట్టబద్ధత కల్పించి సాయం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రజలు తరుఫున తాను కేంద్రప్రభుత్వాన్ని కోరుతున్నట్టు స్పష్టం చేసారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేసే రాష్ట్ర ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా, చట్టపరంగా హోదా అంశమే లేదన్న కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినప్పటికీ, ఆ ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించడానికి రెండున్నర ఏళ్ళు పట్టిందని, ఇంకా నీరిక్షించలేమంటూ రామ్మోహన్‌నాయుడు రాష్ట్ర సామాన్య ప్రజల మనోగతాలను వెల్లడించారు.
కేంద్ర,రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన శ్రీకాకుళం జిల్లా నుంచి సర్థార్ గౌతు లచ్చన్న, బొడ్డేపల్లి రాజగోపాలరావు, గొర్లె శ్రీరాములనాయుడు, కింజరాపు ఎర్రన్నాయుడు వంటి నేతలు సిక్కోల్ గళం చట్టసభల్లో వినిపించడం పరిపాటి. ఆ దిశనే ఎంచుకున్న శ్రీకాకుళం ఎం.పి. యువనేత కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రత్యేక ప్యాకేజీ కూడికలుతీసివేతలు - గుణకారాలు చేసుకునే కాకులెక్కలు కాదన్న భరోసా రాష్ట్ర ప్రజలకు కావాలని, అందుకే చట్టబద్ధత చేయాలని లోక్‌సభ ద్వారా కోరుతున్నట్టు పేర్కొన్నారు. ఐదేళ్ళు, పదేళ్ళు తర్వాతైనా ప్రత్యేక ప్యాకేజీ తు.చ.తప్పకుండా అమలు జరగాలంటే లిఖితపూర్వకంగా ఉండాలని, దానిని లోక్‌సభ ఆమోదం కావాలని రామ్మోహన్‌నాయుడు డిమాండ్ చేసారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, కోట్లాది మంది ప్రజల గళం తాను లోక్‌సభలో వినిపించినట్లు ‘ఆంధ్రభూమి’తో శ్రీకాకుళం ఎం.పి. డిల్లీ నుంచి ఫోన్‌లో చెప్పారు.

నోట్ల మార్పిడికి అనుమతించండి
శ్రీకాకుళం(రూరల్), నవంబర్ 18: ఆంధ్రప్రదేశ్ కోపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఉద్యోగులు అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలియజేశారు. కేంద్ర సహకార బ్యాంకులకు వెన్నుముకలైన రైతులు, ఖాతాదారులకు రూ.500, రూ.1000 నోట్లను మార్చుకునే వెసులుబాటును కల్పించాలని కోరారు. కేంద్రచి ఆంక్షలు విధించడం వలన రైతులు తమ స్వల్ప, దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు సకాలంలో చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. బ్యాంకు ఖాతాదారులు కూడా డిపాజిట్ చేసేందుకు రుణగ్రహీతలు కూడా వారి రుణాలు తిరిగి చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులకు సేవ చేసే సహకార సంఘాలకు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు ఆంక్షలు విధించడం సమంజసం కాదన్నారు. ఈ విషయాన్ని పునఃపరిశీలించి వెంటనే ఆంక్షలను ఎత్తివేసి రైతులకు, ఖాతాదారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిజిఎం ఎస్‌వి ఎస్ జగదీష్, బ్రాంచ్ మేనేజర్ దశరధరామ్, సిహెచ్ బసవలింగం, ఎస్‌వి సత్యన్నారాయణ ఉన్నారు.

టిడిపి పాలనలోనే అభివృద్ధి
శ్రీకాకుళం(రూరల్), నవంబర్ 18: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సాధ్యపడుతుందని స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. జనచైతన్య యాత్రలో భాగంగా శుక్రవారం నగరంలోని 8వ వార్డు పరిధి బొందిలీపురంలో జనచైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ర్యాలీ నిర్వహించి అనంతరం పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు మున్సిపాలిటీగా ఉన్న శ్రీకాకుళాన్ని కార్పొరేషన్‌గా మార్చి రూ.28కోట్లు నిధులు మంజూరు చేసినట్లు తెలియజేశారు. అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ సహకరించాలన్నారు. గత పదేళ్లలో చేసిన అభివృద్ధి ఈరెండేళ్లలో చేసిన అభివృద్ధిని బేరీజ్ వేసుకొని ప్రతిపక్ష నేతలు విమర్శలను తిప్పి కొట్టాలన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దశలవారీగా అమలు చేస్తున్నారని అందులో భాగంగానే మహిళలకు తొలి విడత రూ.3వేలు, రెండవ విడత రూ.3వేలు వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలియజేశారు. చంద్రన్న బీమా వ్యవసాయ కార్మికులకు ఓ వరం వంటిదని ప్రతీ ఒక్కరూ చంద్రన్న బీమాలో సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో మాజీ మంత్రి గొండు అప్పలసూర్యనారాయణ, టిడిపి నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, రమణమాదిగ, డివిఎస్ ప్రకాశ్, జి.కోటేశ్వరరావు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే భద్రమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మండలంలోని కిష్టప్పపేట గ్రామంలో శుక్రవారం జనచైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజెప్పేందుకు జనచైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే లక్ష్మీదేవి తెలియజేశారు. ముందుగా పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గొండు జగన్నాథరావు, ఎంపిటీసీ గొండు శంకర్, కంచు దశరధ, చిట్టి మోహన్, పార్టీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ఎచ్చెర్ల, నవంబర్ 18: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనచైతన్య యాత్రలకు శ్రీకారం చుట్టారని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మీ స్పష్టంచేశారు. కుశాలపురం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన జనచైతన్య యాత్రలను పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు. ఈసందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ విభజన తరువాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పటికీ మేనిఫేస్టోలో రూపొందించిన హామీలను క్రమం తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. దేశంలో మరెక్కడాలేని విధంగా చంద్రన్న బీమా పథకం, ఐదురెట్లు పింఛన్ పథకాన్ని అమలు చేసిన ఘనత సీ ఎం చంద్రబాబుకే దక్కిందన్నారు. ఇటువంటి పథకాలు లబ్ధిదారులకు అందించేందుకు పార్టీ కేడర్ మరింత అంకింతభావంతో పనిచేసి ప్రభుత్వ ప్రతిష్టను పెంచాలన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా లక్ష్యాన్ని అధిగమించేలా తెలుగుదేశం కుటుంబ సభ్యులను చేర్పించాలన్నారు. యువనేత లోకేష్‌బాబు పార్టీ సభ్యత్వం తీసుకున్న కుటుంబాలకు బీమా సౌకర్యాన్ని కూడా కల్పించారన్నారు. ఆపదలో ఉన్న వారు అనారోగ్యంతో బాద పడుతున్న కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం అందించి ఆదుకుంటుందని ఆమె గుర్తుచేశారు. ఇటువంటి పార్టీని అబాసుపాలు చేయాలని విపక్షాలుతప్పుడు విమర్శలు సాగిస్తున్నాయని దీనిని తమ్ముళ్లంతా తిప్పికొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా పూర్వపు అధ్యక్షులు చౌదరి బాబ్జీ, ఎంపిపి బల్లాడ వెంకటరమణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బెండు మల్లేశ్వరరావు, కార్యదర్శి వి.రామకృష్ణ, స్థానిక ఎంపిటిసి పైడి గోవిందరావు, ఎచ్చెర్ల పిహెచ్‌సి చైర్మన్ పైడి అన్నంనాయుడు, మెండ రాజారావు, పంచిరెడ్డి సత్యన్నారాయణ, సీపాన ఎర్రంనాయుడు, గొలివి గోవిందరావు, అనె్నపు భువనేశ్వరరావు, బోర సాయిరాం, చింతాడ రామారావు తదితరులు ఉన్నారు.