జాతీయ వార్తలు

ప్రజా విశ్వాసంతోనే సంస్కరణలకు బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 23: భారత దేశాన్ని రెడ్‌టేప్ నుంచి రెడ్ కార్పెట్ దిశగా సంస్కరణ పథంలో పరుగులు పెట్టించాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశంలో సంస్కరణల అమలు వేగం పెరగాలని ఇటు కార్పొరేట్లను అటు పౌరులను పరిగణలోకి తీసుకుని ముందుకు సాగడమే వీటి ఉద్దేశమని వెల్లడించారు. అన్ని విషయాల్లోనూ జాప్యం, తాత్సారం పేరుకుపోయిన నేటి పరిస్థితుల నుంచి వేగవంతంగా నిర్ణయాలు తీసుకుని అర్థవంతంగా వాటిని అమలు చేసే పరిస్థితులను పాదుగొల్పాల్సిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేశారు. జాప్యానికి అలవాటుపడ్డ పరిశ్రమల్లో ప్రతిదీ అనుమానాన్ని సందేహాలను కలిగిస్తోందని, ఏ విధంగానూ ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుందని ప్రధాని అన్నారు. అన్ని రకాల పరిశ్రమలకు ఆకర్షణీయ రీతిలో ఆహ్వానం పలకడమే రెడ్‌కార్పెట్ లక్షణమని ఇది కేవలం ప్రజా విశ్వాసాన్ని పెంపొందించుకోవడం వల్ల మాత్రమే సాధ్యమవుతోందని తెలిపారు. ‘రెడ్‌టేప్ టు రెడ్ కార్పెట్’ అన్న పుస్తకావిష్కరణ సందర్భంగా మంగళవారం మాట్లాడారు. ప్రతి మనిషి స్వతహాగా, అంతర్గతంగా సద్భావననే కలిగి ఉంటాడని పేర్కొన్న మోదీ స్వేచ్ఛాయుతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ప్రతిఒక్కరికీ కల్పిస్తేనే వారు రాణిస్తారని అన్నారు. ఈ లక్ష్యంతోనే భారత్‌లో నియంత్రణలు, ఆంక్షలకు స్వస్తిపలికి సంస్కరణలకు బలమైన పునాదులు వేస్తున్నామని వెల్లడించారు. ఈ సంస్కరణల్లో అత్యంత కీలకమైనది పౌరులు తమకు తాముగా తమ వివరాలు నిర్ధారించుకునే అవకాశం కల్పించడమేనని ప్రధాని తెలిపారు. విద్యార్థుల నుంచి పారిశ్రామికవేత్తల వరకూ అన్ని రకాల పత్రాలకు సంబంధించి స్వయం ధ్రువీకరణ అవకాశం తాము కల్పించామని అన్నారు. ఎవరో ఒకరిద్దరు తప్పుచేసినంత మాత్రాన అందరినీ శిక్షించాల్సిన అవసరం లేదని అందుకే పౌరుల, కార్పొరేట్ల విశ్వాసాన్ని పెంపొందించుకోవడమే సంస్కరణ మూల సూత్రమని వెల్లడించారు. ప్రజల ఆలోచనల్లో గుణాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నామని పేర్కొన్న మోదీ ఎల్‌పిజి సబ్సిడీ అంశాన్ని ప్రస్తావించారు. ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన ఆన్‌లైన్ బదలాయింపు ప్రక్రియగా దీన్ని అభివర్ణించారు. భారత్ చేపట్టిన సంస్కరణల వల్ల నిర్ణయాలకు క్రమంగా గుర్తింపు లభిస్తోందని అన్ని దేశాలు కూడా ఆసక్తిని కనబరుస్తున్నాయని వెల్లడించారు.
చిత్రం.. ఢిల్లీలో మంగళవారం ‘రెడ్‌టేప్ టు రెడ్ కార్పెట్’ అన్న పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రధాని మోదీ