కృష్ణ

కష్టాల కడలిలో మత్స్యకారులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వాతావరణ మార్పులతో నిలిచిపోయిన చేపల వేట
* నేటికీ అందని నిషేధిత కాల జీవనభృతి
* నత్తనడకన మత్స్యకార కుటుంబాల వివరాల సేకరణ
మచిలీపట్నం, జూన్ 23: మత్స్యకారులు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. మత్స్యకారుల జీవనసరళి రోజురోజుకీ కడుదుర్భరంగా మారుతోంది. పాలకులు మారుతున్నా వారి తలరాతలు మాత్రం మారడం లేదు. బతుకుదెరువు భారంగా మారుతున్న మత్స్యకారుల సమస్యలను ఒకసారి అధ్యయనం చేస్తే వారి జీవితాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. సముద్రతీర ప్రాంతాల్లో నివసిస్తూ చేపలవేటే జీవనాధారంగా సాగుతున్న మత్స్యకార కుటుంబాలకు పూటగడవడమే గగనంగా మారుతోంది. ఎన్నో అటుపోట్లు ఎదుర్కొని సముద్రంలో వేటకు వెళ్లే వీరి జీవితాలకు భద్రత కూడా కరవవుతోంది. జిల్లాలో సుమారు 4వేల మత్స్యకార కుటుంబాలున్నాయి. వీరందరికీ జీవనాధారం చేపల వేటే. మెకనైజ్డ్ బోట్లు, నాటుపడవల ద్వారా సముద్రంలో వేటకు వెళ్లి వచ్చిన కొద్దిపాటి మత్స్య సంపదను అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ప్రతి యేటా ఏప్రిల్ 15 నుండి 45రోజుల పాటు సముద్రంలో చేపల వేటను ప్రభుత్వం నిషేధిస్తుంది. అయితే ఈ యేడాది కొత్తగా ఏర్పడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన మత్స్య విధానం పేరుతో వేట నిషిద్ధ కాలాన్ని రెండు నెలలకు పెంచాయి. అంటే గత ఏప్రిల్ 15 నుండి జూన్ 15 వరకు సముద్రంలో చేపల వేటను నిషేధించారు. నిషేధిత కాలానికి రూ.4వేలు జీవనభృతి ఇస్తామని పాలకులు హామీలిచ్చారు. అయితే నిషేధిత కాలం ముగిసి పదిరోజులవుతున్నా మత్స్యకారులకు జీవనభృతి అందిన దాఖలాలు లేవు. సముద్రతీర ప్రాంతాలైన కృత్తివెన్ను, బందరు, నాగాయలంక, కోడూరు, మోపిదేవి మండలాల్లో సుమారు 95 మెకనైజ్డ్ బోట్లు, 700 పైగా మోటారు బోట్లు ఉన్నాయి. ఒక్కో మెకనైజ్డ్ బోటు ద్వారా ఎనిమిది మత్స్యకార కుటుంబాలకు, మోటారు బోట్ల ద్వారా ఆరు కుటుంబాలకు జీవన భృతి అందించాల్సి ఉంది. అయితే మత్స్యకార కుటుంబాల వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వేట నిషేధిత సమయం ముగిసినా వివరాలు సేకరిస్తున్నామని అధికారులు చెబుతుండటం పట్ల మత్స్యకార కుటుంబాలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. కొత్తగా వచ్చిన జన్మభూమి గ్రామ కమిటీల ద్వారా అధికారులు మత్స్యకార కుటుంబాల వివరాలు సేకరిస్తున్నారు. వివరాల సేకరణ అనంతరం సంబంధిత ఫైల్‌పై కలెక్టర్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. కలెక్టర్ ఆమోద ముద్ర అనంతరం ఫైల్ మత్స్య శాఖ కమిషనర్‌కు వెళుతుంది. అక్కడ కూడా ఆమోద ముద్ర పడిన తర్వాత మత్స్యకారులకు జీవనభృతి అందే అవకాశం ఉంటుంది. అయితే ఇదంతా జరగడానికి కనీసం నెలరోజులైనా పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో మత్స్యకారులు జీవనభృతి కోసం గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. ఈ నెల 15వ తేదీతో నిషేధిత కాలం ముగిసినప్పటికీ వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లడం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మత్స్యకారులెవ్వరూ సముద్రంలోకి వెళ్లరాదన్న ఆదేశాలు ఆశనిపాతంగా మారాయి.