క్రీడాభూమి

జాతీయ క్రీడలు ఆంధ్రకు దక్కేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), డిసెంబర్ 26: రాష్ట్రంలో 2018 జాతీయ క్రీడలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుమార్లు ప్రకటించినప్పటికీ భారత ఒలింపిక్ సమాఖ్య (ఐఒఎ) మాత్రం ఇప్పటివరకూ దానిపై అధికారిక ప్రకటన చేయలేదు. ఇందుకు అవసరమైన కసరత్తు సక్రమంగా జరగకపోవడంతో రాష్ట్రానికి జాతీయ క్రీడల నిర్వహణ బాధ్యతలు దక్కలేదలేదు. అయితే, తాజాగా ఈసారి జాతీయ క్రీడల నిర్వహణ బాధ్యత ఏ రాష్ట్రానికి అప్పగించాలనే అంశంపై ఐఒఎ మంగళవారం చెన్నైలో భేటీ కానుంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరో నాలుగు రాష్ట్రాలు కూడా జాతీయ క్రీడల నిర్వహణకు పోటీ పడుతున్నాయి. కాగా, జాతీయ క్రీడలు రాష్ట్రానికే దక్కేలా చూసేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అందులోభాగంగా నాలుగున్నర కోట్ల రూపాయల డిడితో మంత్రి అచ్చెన్నాయుడు, శాప్ ఎండి బంగార్రాజు, చైర్మన్ పిఆర్ మోహన్ చెన్నై వెళ్లారు. ఇదిలాఉండగా, రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధికార పార్టీకే చెందిన ఇద్దరు నేతలు గల్లా జయదేవ్, సిఎం రమేష్‌ల మధ్య జరుగుతున్న కోర్టు కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పటికీ ఐఒఎ మాత్రం జయదేవ్, ఆర్‌కె పురుషోత్తంలను గుర్తిస్తూ ప్రకటన జారీ చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు శాప్ ఎవరినీ గుర్తించకుండా, హైకోర్టులో కేసు తేలేవరకూ చూద్దామనే ధోరణితో వ్యవహరించాయి. అయినప్పటికీ ఎపి ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి శాప్ చైర్మన్ పిఆర్ మెహన్, గతంలో ఎండిగా పనిచేసిన రేఖారాణి రూ. 50లక్షల చెక్కును గౌహతిలో జరిగిన ఐఒఎ సమావేశంలో జాతీయ క్రీడల కోసం రాష్ట్రం తరఫున బిడ్ దాఖలు చేశారు. అనంతరం జరిగిన పరిణామాల్లో భాగంగా ఎపి ఒలింపిక్ సంఘానికి ఎలాంటి సమాచారం లేకుండా శాప్ అధికారులు నేరుగా ఐఒఎకు మరో రూ.4.50 డిడిని పంపగా ఒలింపిక్ అసోసియేషన్ నుండి పంపాలని ఐఒఎ శాప్‌కు తెలియజేస్తూ డిడిని తిప్పిపంపినట్లు సమాచారం. దీంతో రాష్ట్రంలో జాతీయ క్రీడల నిర్వహణపై ఆలోచనలో పడిన ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశాలిచ్చి శాప్ అధికారులు, జయదేవ్ వర్గానికి చెందిన ఒలింపిక్ సంఘ సభ్యులతో కలిసి ఐఒఎకు జాతీయ క్రీడల నిర్వహణకు సంబంధించి బిడ్ దాఖలు చేయాలని సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తం మీద 2018 జాతీయ క్రీడల నిర్వహణకు మన రాష్ట్రంతో పాటు గోవా, ఉత్తరాఖండ్, చత్తీస్‌గఢ్, మేఘాలయ పోటీ పడుతుండగా, ఆ అవకాశం ఎవరికి దక్కు తుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. మంగళవారం దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.