హైదరాబాద్

పాతబస్తీ కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం వాస్తవమే: పొన్నాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం వాస్తవమే: పొన్నాల
24/06/2015
TAGS:
సైదాబాద్, జూన్ 23: గతంలో ఎంఐఎంతో స్నేహపూర్వక పొత్తులు పెట్టుకున్నందున పాతబస్తీలో నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగినమాట వాస్తవమే అని పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అంగీకరించారు. దశాబ్దాల కాలంగా పార్టీని నమ్ముకుని ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా కాంగ్రెస్ పటిష్టతకు కృషిచేసిన పాతబస్తీ కాంగ్రెస్ కార్యకర్తలకు అన్ని రకాలుగా అండదండలు అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. మంగళవారం యాకుత్‌పురా నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఎం.అశ్విన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి డి.రాజనర్సింహ, ఎమ్మెల్యే డి.కె.అరుణ, ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ ఎంపి పి.ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. సమావేశంలో పలువురు డివిజన్ నేతలు, కార్యకర్తలు పాతబస్తీలో తాము ఎదుర్కొన్న సమస్యలను అగ్రనేతల దృష్టికి తెచ్చారు. నియోజకవర్గ స్థాయి సమావేశానికి నగర అధ్యక్షుడు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. పొన్నాల ప్రసంగిస్తూ గతంలో పరిస్థితులు ఇకముందు పునరావృతం కావని, అగ్రనేతలతో పైరవీలు చేసేవారికి టికెట్‌లు కేటాయించమని స్పష్టం చేసారు. గ్రేటర్ ఎన్నికలు వస్తున్నందున డివిజన్‌లో పూర్తిస్థాయి కమిటీలు వేసి రిజర్వేషన్‌ల ప్రకారంగా డివిజన్ కార్యకర్తలు సూచించిన నేతకే సెలక్ట్ అండ్ ఎలక్ట్ పద్ధతిలో కార్పొరేటర్ టికెట్ ఇస్తామని వివరించారు. కేవలం ప్రసంగాలు, పర్యటనలతో దేశం అభివృద్ధి అవదని మోడీ ప్రభుత్వం గుర్తించాలని, 130 సం.ల చరిత్రగల కాంగ్రెస్ పార్టీ సమర్ధ ప్రధానమంత్రుల కృషితోనే నేడు భారతదేశం ప్రపంచంలోనే మూడవ ఆర్థిక అగ్రరాజ్యంగా అవతరించిందని పేర్కొన్నారు. ఎన్నికల ముందు నల్లధనం వెనక్కి తెస్తామన్న మోడీ మాటలు మోసం కాదా అని ప్రశ్నించారు. ప్రజల్ని మోసగిస్తున్న ప్రధాని మోడీ, తెలంగాణ ఊసరవెల్లి సిఎం కెసిఆర్‌ను ప్రజలముందు దోషులుగా నిలబెడతామని అన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి డి.రాజనర్సింహ మాట్లాడుతూ, ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ బాబు, దొరకని దొంగ కెసిఆర్ ఇద్దరు సిఎంల వ్యవహారంపై కేంద్ర వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేసారు. గ్రేటర్ ఎన్నికలు వస్తున్నందునే సిఎం హైదరాబాద్‌పై వల్లమాలిన ప్రేమ ఒలకబోస్తున్నాడని ఎద్దేవా చేసారు.
13 నెలలుగా ఒక్క ఇల్లు కట్టించి ఇవ్వని కెసిఆర్ ఇప్పుడు ఏకంగా 2 లక్షల ఇళ్లు ఎలా కట్టించి ఇస్తాడో చెప్పాలని ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికలకోసం మజ్లిస్‌తో అనైతిక పొత్తు పెట్టుకుంటున్న కెసిఆర్, ఆరు నెలల్లో తిరిగి బిజెపితో పొత్తు పెట్టుకోవడం ఖాయమన్నారు. కేంద్రంలో తన కుమార్తెకు మంత్రి పదవి కోసం బిజెపి మెప్పుకోసం కెసిఆర్ పాకులాడుతున్నాడని ఆరోపించారు. మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే మూడు నెలల్లో మైనారిటీలకు 13 శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తానన్న కెసిఆర్ 13 నెలలైనా పట్టించుకోక పోవడాన్ని మైనారిటీలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. సమస్యల పరిష్కారానికి పనిచేయాల్సిన గ్రేటర్ కమిషనర్ సోమేష్‌కుమార్ టిఆర్‌ఎస్ తొత్తులా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. పిసిసి కార్యదర్శులు సిజె.శ్రీనివాస్, ఎం.గోపి, నర్సింగ్, అల్లం భాస్కర్, ఎ.లక్ష్మీనారాయణ, కె.శ్రీను, శంకరాచారి, నరేందర్ యాదవ్, రఘుపతి నాయుడు పాల్గొన్నారు.