హైదరాబాద్

పిలిస్తే..పలుకుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* రంజాన్‌ను ప్రశాంతంగా జరుపుకోవాలి
* బందోబస్తుపై పోలీసు కమిషనర్ హామీ
హైదరాబాద్, చార్మినార్, జూన్ 23: నెలరోజుల పాటు ఉపవాసదీక్షలను ప్రశాంతంగా, సామరస్యపూర్వకంగా జరుపుకోవాలని నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి సూచించారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నగరంలోని ప్రార్థన మందిరాల వద్ధ పరిస్థితులు, బందోబస్తు, వౌలిక వసతుల కల్పన వంటి అంశాలకు సంబంధించి ఆయన మంగళవారం సాలార్‌జంగ్ మ్యూజియంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రంజాన్ మాసంలో కానిస్టేబుల్ మొదలుకుని కమిషనర్ వరకు ప్రజలకు అందుబాటులో ఉంటామని ఆయన స్పష్టం చేశారు. పాతబస్తీలోని మలక్‌పేట నుంచి బహద్దూర్‌పురా వరకున్న అన్ని ప్రార్థన మందిరాల నిర్వాహకులు, కమిటీ సభ్యులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. కొన్ని ప్రార్థన మందిరాల్లో, పరిసర ప్రాంతాల్లో వౌలిక వసతుల్లేవని కమిటీ సభ్యులు తెలిపారు. అంతేగాక, ప్రార్థన మందిరాల వద్ధ పరిశుభ్రతను పాటించాలని కమిషనర్ సూచించారు. మరికొన్ని ప్రార్థన మందిరాల వద్ధ కనీసం వీది లైట్లు కూడా వెలగటం లేదని కమిషనర్ దృష్టి రాగా, వీలైనంత త్వరగా వీది లైట్లకు మరమ్మతులు చేయాలని ఆయన జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్ సుబ్రహ్మణ్యంరెడ్డిని ఆదేశించారు. ట్రాఫిక్ డిసిపితో సమన్వయం ఏర్పర్చుకుని ఎక్కడ కూడా ట్రాఫిక్ జాం కాకుండా చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. దీంతో పాటు ప్రార్థన మందిరాలకు ప్రార్థనల నిమిత్తం వచ్చే వారికి పోలీసులు ఎప్పటికీ సహకరిస్తున్నారని, కనీసం కమిటీ సభ్యులు ప్రార్థన మందిరాల వద్ధ వాహనాల పార్కింగ్ సక్రమంగా జరిగేలా చూడాలని సూచించారు. రంజాన్ మాసం ప్రారంభం కాకముందే ఈ సమావేశం నిర్వహిస్తే కాస్త మెరుగైన ఫలితాలు వచ్చేవని కొందరు కమిటీ సభ్యులు తెలపగా, వచ్చే సంవత్సరం నుంచి ఈ పద్దతిని అనుసరిద్దామని కమిషనర్ తెలిపారు. అనంతరం జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్ సుబ్రహ్మణ్యంరెడ్డి మాట్లాడుతూ పాతబస్తీ పరిధిలో మలక్‌పేట నుంచి బహద్దూర్‌పురా వరకు 611 ప్రార్థన మందిరాలున్నాయని, వాటిలో ప్రధానంగా వీది లైట్ల సమస్య ఉందని అంగీకరించారు. రోడ్ల మరమ్మతుల కోసం ఇటీవలే అందుబాటులోకి తెచ్చిన ఇన్స్‌టెంట్ రోడ్డు రిపేరర్‌ను రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ప్రజలు ఎలాంటి సమస్యనైనా తమ దృష్టికి తీసుకువస్తే కేవలం గంట సమయంలో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని, సిబ్బంది ఎవరైన అందుబాటులో లేని పక్షంలో మరుసటి రోజు సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామన్నారు. మక్కా మసీదు వద్ధ టాయిలెట్ల నిర్మాణం కోసం జిహెచ్‌ఎంసి ఇప్పటికే రూ. 1.2కోట్లను మంజూరు చేసినట్లు ఆయన వివరించారు. సమావేశంలో అదనపు కమిషనర్ అంజనీకుమార్, సౌత్‌జోన్ డిసిపి సత్యనారాయణ, అదనపు డిపిసి కె.బాబురావు, ఈస్ట్‌జోన్ డిసిపి వెంకటేశ్వరరావు, ట్రాఫిక్, సిపిడిసిఎల్, జలమండలి ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
‘తెలంగాణ సాహితీ సంపద’ గ్రంథావిష్కరణ
కాచిగూడ, జూన్ 23: ప్రముఖ సాహితివేత్త డా.ద్వానాశాస్ర్తీ గొప్ప పరిశోధకుడు తెలంగాణ సాహిత్య సంపదను తవ్విచూపుతున్న ప్రతిభావంతుడని డా.సి.నారాయణరెడ్డి కొనియాడారు. ద్వానాశాస్ర్తీ రచించిన ‘తెలంగాణ సాహితీ సంపద’ గ్రంథావిష్కరణ సభ వంశీ విజ్ఞాన పీఠం, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం గానసభలోని కళాసుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నారాయణరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంపద గురించి ద్వానాశాస్ర్తీ పుస్తకంలో అద్భుతంగా వివరించారని పేర్కొన్నారు. ద్వానా శాస్ర్తీ రచించిన పుస్తకం విద్యార్థులకు పోటీ పరీక్షల కోసం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఏపి జ్యుడీషియల్ అకాడమి డైరెక్టర్ మంగారి రాజేందర్, ఆచార్య బన్న ఐల్లయ్య, ప్రగతి పబ్లిషర్స్ పి.రాజేశ్వరరావు, వంశీ సంస్థల అధ్యక్షురాలు డా.తెనే్నటి సుధాదేవి, ప్రధాన కార్యదర్శి సుంకరపల్లి శైలజ పాల్గొన్నారు.
పేరిణి నాట్యానికి అంతర్జాతీయ గుర్తింపు రావాలి
హైదరాబాద్, జూన్ 23: కాకతీయుల కాలం నటి శిల్పకళల ఆధారంగా డా. నటరాజ రామకృష్ణ రూపొందించిన పేరిణి నృత్యానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలని తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అన్నారు. ఆంధ్ర నాట్యం ట్రస్ట్ ఆధ్వర్యంలో మతంగళవారం తెలుగు విశ్వవిద్యాలయంలో ‘పేరిణి నాట్యం’ పుస్తకావిష్కరణకు శివారెడ్డి అధ్యక్షత వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వరంగల్‌లో విశ్వవిద్యాలయం తరఫున పేరిణి నాట్యానికి శిక్షణ కేంద్రం నడుపుతున్నామని దీనిని ఇంకా అభివృద్ధి చేయాలన్నారు. ముఖ్యఅతిథి, రాష్ట్ర సాంస్కృతిక సలహాదారులు కె.వి.రమణాచారి మాట్లాడుతూ, తాను చదువుకుంటున్న రోజుల్లో (1966) సిద్దిపేటలో నటరాజ రామకృష్ణను కలిసినపుడు నాట్యం నేర్చుకోమని అడిగితే చదువుకు ఇబ్బంది అని నేర్చుకోలేక పోయినా ఆ తర్వాత చూసి నేర్చుకున్న ఏకలవ్య శిష్యుడినని అన్నారు. పేరిణి నేర్చుకున్న రామకృష్ణ తొలి శిష్యుడు రమేష్ అని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారులు బి.వి.పాపారావు, సాంస్కృతిక శాఖ సంచాలకులు ఎం.హరికృష్ణ పాల్గొని నాట్యాచారిణి డా. అలేఖ్య పుంజలను సత్కరించి నటరాజ రామకృష్ణ స్మారక పురస్కారాన్ని ప్రదానం చేసారు. తొలుత ‘పేరిణి’ లాస్యము, తాండవ నృత్యాలను ప్రదర్శించారు.
జలమండలి డయల్ యువర్ ఎండికి ఫిర్యాదుల వెల్లువ
చాంద్రాయణగుట్ట, జూన్ 23: జలమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన డయల్ యువర్ ఎండి, మీట్ యువర్ ఎండి కార్యక్రమానికి గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుండి ఫిర్యాదులు అందాయి. కలుషిత నీటి సరఫరా, అతి తక్కువగా నీటి సరఫరా, అక్రమంగా విద్యుత్ మోటార్ల వాడకం, లోప్రెషర్ నీటి సరఫరా, నీటి బిల్లింగ్ వంటి సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ ఎండి కార్యక్రమానికి మొత్తం 11 అంశాల్లో ఫిర్యాదులు అందాయి. మియపుర్, బల్కంపేట్, వౌలాలి, మారేడ్‌పల్లి, రామంతపుర్, అంబర్‌పేట్, రాణిగంజ్, కార్వాన్, యూసుఫ్‌గూడ తదితర ప్రాంతాల నుండి వినియోగదారులు డయల్ యువర్ ఎండికి ఫిర్యాదు చేశారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ముందుగా జరిగిన మీట్ యువర్ ఎండి కార్యక్రమానికి అందిన మొత్తం 28 సమస్యలను అధికారులు అక్కడిక్కడడే పరిష్కరించారు. జలమండలి ఎండి ఎం.జదీశ్వర్ మాట్లాడుతూ వినియోగదారులిచ్చే ఫిర్యాదులకు అధికారులు వెంటనే స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరించి, జవాబుదారీగా నిలవాలని అన్నారు. వర్షకాలం సందర్భంగా అధికారులు ఎల్లపుడు అప్రమత్తంగా ఉంటు డ్రేనేజీ, మంచి నీటి సమస్యలు తలేత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. వర్షకాలం సందర్భంగా తలేత్తే సమస్యలను వెనువెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. మీట్, డయల్ యువర్ ఎండి కార్యక్రమం అనంతరం ఎండి జగదీశ్వర్.. వివిధ విభాగాల డైరెక్టర్, సిజిఎం, జిఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఇఎన్‌సి ఎం.సత్యనారాయణ, డైరెక్టర్లు ఎస్.ప్రభాకర్ శర్మ, డాక్టర్ పి.సత్యసూర్యనారాయణ, జి.రామేవ్వరరావు, ఎం.ఎల్లస్వామి, రెవెన్యూ, ట్రాన్స్‌మిషన్ సిజిఎంలు ప్రవీణ్‌కుమార్, విజయ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
బంగారు తెలంగాణ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న కేసిఆర్
నేరేడ్‌మెట్, జూన్ 23: అధికారంలోకి రాక ముందు ఉద్యమం పేరుతో.. వచ్చాక బంగారు తెలంగాణ, హమీల పేరుతో ప్రజలను ముఖ్యమంత్రి కెసిఆర్ మోసం చేస్తూ మభ్య పెడుతున్నాడని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని ఆనంద్‌బాగ్ బృందావన్ గార్డెన్‌లో మల్కాజిగిరి ఇన్‌చార్జి నందికంటి శ్రీ్ధర్ అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఉత్తమ్ మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణ పేరుతో ప్రజలకు సినిమా చూపిస్తుందని అన్నారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఒక్క హామీ నేరవేర్చలేదని చెప్పారు. దళితులకు మూడేకరాల భూమి, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, రేషన్‌కార్డులు.. హామీలుగానే మిగిలాయని పేర్కొన్నారు. కెసిఆర్ చెప్పే మాటలకు చేసే పనులకు సంబంధం లేదని అన్నారు. తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీదేనని గుర్తు చేశారు. విద్యార్థుల, ప్రజల ఆత్మ బలిదానాలు చూడలేకే తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే.. టిఆర్‌ఎస్‌తో వచ్చిందని చెప్పి.. కేసిఆర్ అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తాననే మాట తప్పిన కెసిఆర్.. తెలంగాణ ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ఏఐసిసి కార్యదర్శి రాంచందర్ కుంతియా, మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ 130 ఏళ్ల కాంగ్రెస్ చరిత్ర ముందు టిఆర్‌ఎస్ ఎంత అని అన్నారు. ప్రజల కోసం అహర్నిశలు పనిచేసేది కాంగ్రెస్సేనని చెప్పారు. టిఆర్‌ఎస్ ఒక కుటుంబ పార్టీ అని ఎద్దేవా చేశారు. గ్రేటర్ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని అమలుకాని హామీలను ఇస్తూ ప్రజలను టిఆర్‌ఎస్ మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. డివిజన్, వార్డు, బూత్‌స్థాయి కమిటీలు వేసి కార్యకర్తలలో ఉత్సహం నింపాలని సూచించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలలోకి తీసుకెళ్లి గ్రేటర్ ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపి వివేక్, జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్, వేణుగోపాల్, నర్సిగౌడ్, నాగయ్య, జగదీష్, సురేష్ యాదవ్, వెంకటేష్ యాదవ్, జిడి శ్రీనివాసగౌడ్, ఎంఆర్ మల్లేష్, సదాలక్ష్మీ, మాజీ కార్పొరేటర్లు గీతారాణి, మరియమ్మ, భారతి, రాము పాల్గొన్నారు.
తలసానికి మర్రి సవాల్
* అభివృద్ధి విషయంపై వివరణ ఇవ్వాలని డిమాండ్
బేగంపేట, జూన్ 23: నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను తెలుపాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి సవాలు విసిరారు. మంగళవారం తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు మర్రి లేఖ రాశారు. నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించిన పనులకు నిధుల మంజూరు విషయంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సనత్‌నగర్ అభివృద్ధికి 15 రోజుల్లో 40 కోట్లు మంజూరు చేయించానని ఏప్రిల్‌లో తలసాని ప్రకటించారని, అభివృద్ధి పనుల వివరాలను శాఖల వారీగా పూర్తి వివరణ ఇవ్వాలని సవాలు విసిరారు. కాంగ్రెస్ హయాంలోనే మంజూరైన నిధులతోనే ఇప్పడు అభివృద్ధి పనులు చేపడుతున్నారని వివరించారు. అభివృద్ధి పనుల వివరాలను తెలపాలని డిమాండ్ శశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు.