బిజినెస్

కోలుకోని స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండో రోజూ కొనసాగిన నష్టాలు
సెన్సెక్స్ 44, నిఫ్టీ 18 పాయింట్లు క్షీణత
ముంబయి, నవంబర్ 24: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా నష్టాలకే పరిమితమయ్యాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో నమోదైన మిశ్రమ ఫలితాలు, ఐరోపా మార్కెట్లలోని ఆరంభ నష్టాలు మదుపరులను అమ్మకాల వైపు నడిపించాయి. ఈ నెల ఎఫ్‌అండ్‌ఒ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు దశకు చేరుకుంటుండటం కూడా మదుపరులను పెట్టుబడులపట్ల దైలమాలో పడేసింది. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెన్సెక్స్ 43.60 పాయింట్లు కోల్పోయి 25,775.74 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 17.65 పాయింట్లు నష్టపోయి 7,831.60 వద్ద స్థిరపడింది. క్యాపిటల్ గూడ్స్, ఆటో, ఐటి, హెల్త్‌కేర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్ల విలువ పడిపోయింది. అయినప్పటికీ బిఎస్‌ఇ స్మాల్-క్యాప్ 0.33 శాతం, మిడ్-క్యాప్ 0.08 శాతం పెరగడం విశేషం. కాగా, సోమవారం కూడా సెనె్సక్స్, నిఫ్టీ నష్టాల్లోనే ముగిసినది తెలిసిందే.