సబ్ ఫీచర్

మేలైన బోధనతో సృజనకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక కాలంలో అత్యధిక రాబడి వచ్చే వ్యాపారాల్లో స్కూళ్ల నిర్వహణ ఒకటి. కెజి విద్యార్థులకు కూడా పి.జి. విద్యార్థులకు చెల్లించేటంతటి భారీ ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలు ఎక్కడ చూసినా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. తల్లిదండ్రులకు అరచేతిలో స్వర్గం చూపిస్తూ- ‘మా స్కూల్లో చదివితే పిల్లల్ని అంతటి వాళ్లని చేస్తాం.. ఇంతటి వాళ్లను చేస్తాం’ అంటూ ఊదరగొట్టే పాఠశాలలు కార్యాచరణకు వచ్చేసరికి శూన్య హస్తం చూపిస్తున్నాయి. భారీ ఫీజులతోపాటు పుస్తకాలకి, యూనిఫాంలకి, టై అనీ, డైరీ అనీ, అదనీ ఇదనీ పేరెంట్స్ రక్తమాంసాలు తోడేస్తున్నా డాబుసరి పాఠశాలల్లో చదివే పిల్లల్ని తీరా ‘బడిలో ఏం నేర్చుకున్నార’ని అడిగితే తెల్లమొహం వేస్తారు.
చాలా బడుల్లో పిల్లలకు సంబంధించి సృజనాత్మకత పెరగడం లేదు. టాలెంట్, స్కిల్స్ పెంపొందడం లేదు. మహా అయితే పరీక్షల ముందు వారితో బట్టీ పట్టించి, పరీక్షల్లో అడిగే ప్రశ్నలు ముందుగా చెప్పి- ‘ మా పాఠశాలలో చదివే పిల్లలకి అన్ని మార్కులు వచ్చాయి.. ఇన్ని మార్కులు వచ్చాయ’ని ఊకదంపుడు మాటలు చెప్పి పబ్బం గడుపుకుంటున్నాయని చెన్నైకి చెందిన రుచి మహంతో అంటోంది. పదేళ్ల నుండి టీచింగ్ రంగంలో ఉన్న రుచి పిల్లల్ని సహజంగా చదవనివ్వాలని, చదవాలనే ఆసక్తి స్వతహాగా వారిలో పెంపొందేలా బోధనా పద్ధతులు ఉండాలని చెబుతోంది. అలా జరిగినప్పుడే పిల్లలకి ‘సబ్జెక్ట్ ఓరియంటెడ్’ విద్య అబ్బుతుందని ఆమె చెబుతోంది. పరీక్షల్లో అడిగే కొన్ని ప్రశ్నలను వారితో చదివించేసి తూతూ మంత్రంగా పరీక్షలు జరిపించేస్తే వారికి సబ్జెక్ట్ ఎప్పటికీ రాదని హెచ్చరిస్తోంది.
ఇలాంటి సమస్యలను అధిగమించేలా ఆమె సొంతంగా ఒక విద్యా కేంద్రాన్ని ప్రారంభించింది. ‘వాల్‌నట్ క్లబ్’ పేరిట ఒక పాఠశాలని ప్రారంభించి నాలుగు నుండి పధ్నాలుగు సంవత్సరాల పిల్లలకి విద్యాబోధన చేస్తోంది. కేవలం వ్యాపార దృక్పథంతోనే కాకుండా చిన్నతనం నుండే పిల్లల్లో దాగి ఉండే నైపుణ్యాన్ని గుర్తిస్తూ భవిష్యత్తులో వారు ఏ రంగంలో రాణించగలరో అందుకు అనుగుణంగా పాఠ్యాంశాలు బోధిస్తూంటుంది. ఈ విధంగా తాము చేసే బోధన పిల్లలకు ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి విద్యల్లో రాణించేందుకు బాగా ఉపకరిస్తుందని ఆమె చెబుతోంది. ముఖ్యంగా మైండ్ మ్యాపింగ్ పేరట ఆమె అనుసరించే విధానం వల్ల తెలివితేటల్లో హెచ్చుతగ్గులు ఉన్న పిల్లలు కూడా ఎటువంటి సబ్జెక్టునైనా క్షుణ్ణంగా అర్థం చేసుకునే వీలుకలుగుతుంది. అలాగే స్పీడ్ రీడింగ్, మెమరీ పెంచుకునే మెళకువలను కూడా రుచి తన వద్ద చదివే విద్యార్థులకు తెలియజేస్తుంది.
అలాగని తన దగ్గర చదివే పిల్లలకే కాకుండా బయటి స్కూళ్లలో చదివే పిల్లల కోసం కూడా ఆలోచన చేసి సులువుగా పాఠాలు గుర్తుంచుకునే చిట్కాలు తెలిపేందుకు తరచూ చెన్నైలో ఎడ్యుకేషన్ క్యాంపులు, శిబిరాలు ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు ఏ పాఠశాలలో చదివే పిల్లలకైనా మళ్లీ ఇంటి దగ్గర ట్యూషన్లు చెబుతున్నారని, దీనివల్ల పిల్లల్లో ఒత్తిడి పెరిగిపోతోందని ఆమె చెబుతోంది. అందుకే తమ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఆ అవసరం లేకుండా తామే స్కూల్లో ఏ రోజు పాఠాలు ఆ రోజు పూర్తయిపోయేలా హోం వర్క్ కూడా చేయిస్తామని చెబుతోంది.
ర్యాంకులు సాధించడానికే పిల్లలు అన్నట్లు కాకుండా వాళ్లు ఎందులో నిష్ణాతులు కాగలరో తెలుసుకోవడానికి బ్రెయిన్ ఫ్రెండ్లీ టెక్నిక్స్, మైండ్ మ్యాపింగ్ వంటివి అమలుచేసి పాఠాలు బోధిస్తే మంచి ఫలితాలు రావడంతోపాటు పిల్లలు చదువంటే భయపడిపోయే పరిస్థితి ఉండదని రుచి చెబుతోంది. (చిత్రం) రుచి మహంతో