శివలింగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాఘవ లారెన్స్ కథానాయకుడిగా పి.వాసు దర్శకత్వంలో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి.పిళ్లై అందిస్తున్న చిత్రం ‘శివలింగ’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయిన సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి ఆదరణ లభిస్తోందని, కథే హీరోగా కన్నడంలో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని హారర్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దారని తెలిపారు. యూ ట్యూబ్‌లో పది లక్షలకుపైన వ్యూస్ లభించాయని, దీంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయని తెలిపారు. రితికా సింగ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో వడివేలు, శక్తివాసు, రాధారవి, జయప్రకాష్, ప్రదీప్ రావత్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కెమెరా:సర్వేష్ మురారి, సంగీతం:ఎస్.ఎస్.తమన్, పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, ఎడిటింగ్:సురేష్, నిర్మాత:రమేష్ పి.పిళ్లై, దర్శకత్వం:పి.వాసు.