పశ్చిమగోదావరి

శ్రమ దోపిడీకి చరమగీతం పాడదాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, ఫిబ్రవరి 4: శ్రమ దోపిడీ చరమగీతం పాడదాం!, కులనిర్మూలన కోసం సమర శంఖం పూరిద్దామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, సామాజిక హక్కుల వేదిక రాష్ట్ర కన్వీనర్ కె రామకృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక ఎంబి సోషల్ క్లబ్ ఆవరణలో శనివారం సామాజిక హక్కుల శంఖారావం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సామాజిక హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ డేగా ప్రభాకర్ నిర్వహణలో వేదిక నియోజకవర్గ కన్వీనర్ ఇబ్రహీం అధ్యక్షతన జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్ళు, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 68 ఏళ్లయినా కుల వ్యవస్థ కొనసాగుతూనే ఉందన్నారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాలు దళిత, గిరిజన, మైనార్టీలపై మతోన్మాద దాడులు కొనసాగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. సంఘపరివార్, ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పి, శివసేన వంటి మతోన్మాద శక్తులు సామాజిక మాధ్యమాల్లో నిస్సిగ్గుగా ప్రచారం సాగిస్తున్నాయన్నారు. అణగారిన కులాలు, మైనార్టీలు ఐక్యంగా సామాజిక హక్కుల వేదిక ద్వారా మతోన్మాద శక్తులను తరిమికొట్టేందుకు శంఖారావం పూరించాలన్నారు. ఈ నేపధ్యంలోనే ఇచ్ఛాపురం నుండి హిందూపురం వరకు 40 రోజుల ప్రజా చైతన్య యాత్ర కొనసాగిస్తున్నట్టు చెప్పారు. దేశంలో 80 శాతంగా ఉన్న అణగారిన కులాలు సంపదకు, అధికారానికి దూరంగా బ్రతుకుటుంటే 20 శాతంగా ఉన్న దోపిడీ కులాలు పరిపాలన సాగిస్తూ 14 అత్యంత ఆదాయ వనరులున్న రంగాల్లో స్థిరపడి కోట్లు సంపాదిస్తున్నారన్నారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ది సాధ్యమన్నారు. ఎపి మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి దుర్గ్భావాని మాట్లాడుతూ పోరాటం ద్వారానే హక్కులు సాధించుకోగలుగుతామని, మెరుగైన జీవనం లభిస్తుందన్నారు. సభలో మైనార్టీ నేత అప్సర్, ప్రజానాట్యమండలి నాయకుడు సబ్బి కనకారావు, డివైఎఫ్‌ఐ నాయకుడు వైట్ల విద్యాధరరావు, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి గాళ్ళ శారద, సిపిఐ జిల్లా నాయులు పోతన అప్పారావు, వేదిక నేతలు ఎన్ శ్రీనివాస్, ఆర్ శంకర్, గిరిజన సమాఖ్య నేత గోవింద్, రైతు సంఘం నాయకులు రాయ చంద్రయ్య, చంద్రానాయక్, సిపిఐ మండల కార్యదర్శి బూరుగుపల్లి సూరిబాబు, పట్టణ కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కామవరపుకోట నుండి వివిధ కులస్థులు టివిఎస్ రాజు సారధ్యంలో కులధృవీకరణ పత్రాలు ఇవ్వడంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు వినతి పత్రం సమర్పించారు. అంతకు ముందు ప్రజా జైతన్య బస్సు యాత్రకు ఘనంగా స్వాగతం పలికారు.