Others

చీరకు సాటి ఏది..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్యాషన్లు ఎంతగా మారినా చీరకట్టుకు సరితూగే దుస్తులేవీ ఇకముందు కూడా రావని బాలీవుడ్ భామ విద్యా బాలన్ అంటోంది. సంప్రదాయబద్ధమైన చీరలు మాత్రమే మగువల సొగసుల్ని రెట్టింపు చేస్తాయని చెబుతోంది. ప్రతి భారతీయ మహిళా తప్పనిసరిగా ఓ కంచి పట్టు చీరనో, బనారస్ చీరనో శుభకార్యాల వేళ ధరించాలని ఆమె సూచిస్తోంది. ఆదరణ కోల్పోతూ, ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న నేతపని వారిని ఆదుకునేందుకైనా అతివలు చీరలను కొనాలని విద్య విజ్ఞప్తి చేస్తోంది. తాను హైస్కూల్ రోజుల్లోనే తన తల్లి వాడే చీరలను కట్టుకుని ఆనందించేదాన్నని అప్పటి జ్ఞాపకాలను ఆమె గుర్తు చేస్తోంది. పార్టీలు, ఫంక్షన్లకు చీరకట్టుతో వెళ్లి మన సంప్రదాయాలను కాపాడుకోవాలంటోంది. చీర కట్టుకుంటే వచ్చే హుందాతనాన్ని మాటల్లో వర్ణించలేనని చెబు
తోంది. డిజైన్లు, రంగుల మేళవింపునకు సంబంధించి చీరల్లో అంతులేని వైవిధ్యం ఉంటుందని, ఈ కారణంగానే ప్రముఖ డిజైనర్లు సైతం వీటిపై ఇపుడు దృష్టి సారించా రంటోంది. ఎంతగా ఆధునిక దుస్తులకు అలవాటుపడినప్పటికీ ఈకాలపు అమ్మాయిల్లో చాలామంది చీరలంటే మోజు పడు తున్నారని అంటోంది. ఎంతో ఉన్నతమైన భారతీయ సంస్కృతిని పరిరక్షించుకోవాలంటే నేత పరిశ్రమను ఆదుకోవాలంటోంది. ప్రపంచ వ్యాప్తంగా చీరలకు ఆదరణ పెరుగుతుండగా మనం ఎందుకు నిర్లక్ష్యం చేయాలని ఆమె ప్రశ్నిస్తోంది. పట్టు, కాటన్, కళంకారీ చీరలను మహిళలు వాడితే పరోక్షంగా ఎందరో నేత కార్మికులకు సాయం చేసినట్లవుతుందని చెబుతోంది. పలురకాల నేత చీరలు, గులాబీ, ఆకుపచ్చ రంగుల్లో లభించే కంచి పట్టుచీరలు, ఎరుపు రంగు బనారస్ చీరలంటే తాను తెగ మోజుపడుతుంటానని విద్య తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తోంది.