బాలీవుడ్‌లోకి ప్రభాస్?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 24 June 2015
ప్రస్తుతం యావత్ సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంటున్న చిత్రం ‘బాహుబలి’. ఉన్నత సాంకేతిక విలువలతో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అన్నివర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాతో అంతే క్రేజ్‌ని దక్కించుకున్నారు దర్శకుడు రాజవౌళి, హీరో ప్రభాస్. జూలై 10న విడుదలవుతున్న ఈ సినిమా తర్వాత ప్రభాస్ తదుపరి చిత్రాలేంటి? అనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్‌కు బాలీవుడ్‌లో అవకాశాలు వస్తున్నాయని తెలిసింది. ఈ విషయంపై ప్రభాస్ స్పందిస్తూ బాలీవుడ్‌లో సినిమా చేయడానికి తానెప్పుడూ రెడీగానే ఉన్నానని, మంచి స్క్రిప్ట్‌వస్తే తప్పకుండా చేస్తానని అంటున్నారు. మరి బాహుబలి తర్వాత ప్రభాస్‌కు బాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కే అవకాశం వుంది.