Others

సబ్జా.. మజా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవి ముదరక ముందే ఎండలు మండిపోతున్నా యి. దాహార్తితో ఇబ్బందులు మొదలవుతున్నాయి. కొన్ని జాగ్రత్తలు, చిట్కాలు పాటిస్తే ఎండ వల్ల ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. దాహార్తి తీర్చుకోవడానికి, బరువు తగ్గడానికి, నిగారింపుతోపాటు మరిన్ని ప్రయోజనాలు పొందడానికి సబ్జా గింజలను తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
ఫలూదాసీడ్స్, టుర్కమన్‌జా, బాసిల్‌గా పిలిచే ఈ గింజలు నల్లగా నువ్వుల్లా కనిపిస్తాయి. నిజానికి హోలీబాసిల్ అంటే తులసి. బాసిల్ అంటే సబ్జాగింజలు. వీటిని గోరువెచ్చటి నీళ్లలో వేస్తే కొద్దిసేపటికి తెల్లనిగుజ్జుతో ఉబ్బి అందంగా కనిపిస్తాయి. ఐస్‌క్రీమ్‌లు, షర్బత్‌లు, శీతల పానీయాల్లో వీటిని వేస్తే అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పీచుపదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ, ముఖ్యంగా చిన్న, పెద్దపేగులు శుభ్రపడతాయి. టైప్ 2 మధుమేహ రోగులకు సుగర్ నియంత్రణలో ఇవి మంచి ఫలితాలు చూపిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి. అందువల్ల కొవ్వు కరిగి బరు వు తగ్గుతాం. సబ్జాగింజలు కలిపిన పానీయాలు తాగడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా సాగుతుంది. అందువల్ల తొందరగా ఆకలివేయదు. తిండి తగ్గడం వల్ల ఊబకాయం సమస్య ఎదురుకాదు. శరీరంలో వేడిని నియంత్రించే ఈ గింజలు కడుపు, గుండెల్లో మంటను కలుగచేసే వాయువులను హరిస్తాయి. మొత్తంమీద వేసవి ఎండలవల్ల శరీరంలో నీటినిల్వలు తగ్గకుండా, వేడి పెరగకుండా, దాహం తీర్చే పానీయాల్లో సబ్జా గింజలు కలిపితే ఎన్నో లాభాలుంటాయి. కురులు, మేని నిగారింపునకు ఇవి ఎంతగానో తోడ్పడతాయి.