రాష్ట్రీయం

జాతిభేదం లేని ‘అమ్మ’తనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయదుర్గం, జూన్ 23: ఆవుదూడ బంధం గురించే మనకు తెలుసు. మనకు తెలీని మరోబంధం ఉంది అదే ఆవు వరాహ బంధం. ఓ ఆవు తనజాతి కాని పందిపిల్లలకు ప్రతిరోజూ పాలిస్తోంది. ఈ వింత అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని నేతాజీరోడ్డు పాత కరెంటు ఆఫీస్ వద్ద ఉదయం సాయంత్రం పూట ఓ ఆవు పందిపిల్లలకు పాలిస్తోంది. నిత్యం కనిపించే ఈ దృశ్యాన్ని చూసి స్థానికులు అచ్చెరువొందుతున్నారు. ఆవు అలా వచ్చి పడుకోగానే చుట్టుపక్కల ఉండే పంది పిల్లలు బిలబిలమంటూ వచ్చి ఆవురావురంటూ పాలు తాగేస్తుంటాయి. పందిపిల్లలు పాలు తాగుతున్నంతసేపు ఆవు కదలకుండా ఉండడం గమనార్హం.