రాష్ట్రీయం

పది రోజులు.. 10వేల కోట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 19:రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించటంపై ప్రభుత్వం దృష్టి సారించింది. మరో 10 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో దాదాపు 10వేల కోట్ల రూపాయల మేరకు ఆదాయం రాబట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పెద్దనోట్ల రద్దు ప్రభావం ఆర్థిక లావాదేవీలపై పడింది. ఇటీవలి కాలంలో నగదు కొంతమేర అందుబాటులో ఉండటంతో లావాదేవీలు గతంలో కంటే ఎక్కువయ్యాయి. నగదు ఉపసంహరణ, చెల్లింపులు, కొనుగోళ్లు, తదితర అంశాలపై ఆర్‌బిఐ ఆంక్షలు తీవ్ర ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో స్టాంప్‌లు, రిజిస్ట్రేషన్ శాఖకు 4981 కోట్ల రూపాయల మేర లక్ష్యాన్ని నిర్ణయించగా శనివారం నాటికి 3297.78 కోట్ల రూపాయల మేరకు ఆదాయం లభించింది. దాదాపు 67శాతం మేరకు మాత్రమే లక్ష్యాన్ని సాధించారు. ఆబ్కారీ శాఖకు 5535 కోట్ల రూపాయలు ఆదాయం లభించాలనేది లక్ష్యం కాగా 4034 కోట్ల రూపాయలు సమకూరాయి. ల్యాండ్ రెవెన్యూపై 606 కోట్ల రూపాయలు లక్ష్యం కాగా కేవలం 164.7 కోట్ల ఆదాయం వచ్చింది. వ్యవసాయేతర భూములకు సంబంధించి స్థిరాస్తి పన్ను రూ. 192.3 కోట్లు కాగా 181.6 కోట్లు వచ్చింది. అమ్మకాలు, వ్యాపార సంస్థల నుంచి పన్నుల ద్వారా రూ. 35,999 కోట్లు లభిస్తుందని అంచనా వేయగా ఇప్పటివరకూ 29,985.2 కోట్ల రూపాయలు మాత్రమే ఖజనాకు జమ అయింది. వాహనాలపై పన్ను కింద రూ. 2319 కోట్లు వస్తుందని అంచనా వేయగా 2222.5 కోట్లు మాత్రమే వచ్చింది. రాష్ట్రం సొంతంగా 10 పద్దుల ద్వారా 50,311.29 కోట్ల రూపాయల మేర సమకూరుతుందని అంచనా వేయగా ఇప్పటివరకూ 40,613.01 కోట్ల రూపాయలు మాత్రమే లభించాయి. పన్నులు కాని ఇతర ఆదాయం కింద 5284 కోట్ల రూపాయలు వసూలు కావాల్సి ఉండగా రూ. 3406 కోట్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1.35 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్ అంచనాల నాటికి రెవెన్యూ లోటు రూ. 4868.26 కోట్లు కాగా, అది రూ. 17,852 కోట్లకు చేరుకుంది. ఆర్థిక లోటు కూడా 20,497.15 కోట్ల రూపాయలుగా అంచనా వేయగా, అది 31,281.75 కోట్లకు చేరుకుంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో లక్ష్యాలను చేరుకునేందుకు అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.