S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ స్థాయికి రాజమండ్రి ఎయిర్ పోర్టు

న్యూఢిల్లీ, జూలై 15: రాజమండ్రి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడు మార్గాని భరత్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం లోక్‌సభ జీరో అవర్‌లో భరత్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పటికే 1750 మీటర్ల విస్తీర్ణం కలిగిన రన్-వేను 3125 మిటర్లకు విస్తరించారని, అలాగే రన్-వే 45 మీటర్ల వెడల్పును విస్తరించారని తెలిపారు. విమాననాశ్రయం ప్రాంతంలో నేషనల్ క్రికేట్ స్టేడియంనూ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని కూడా ఆయన చెప్పారు.

‘రహదారుల అభివృద్ధికి సహకరించండి’

న్యూఢిల్లీ, జూలై 15: తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని టీఆర్‌ఎస్ లోక్‌సభ సభ్యుడు రంజిత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం లోక్‌సభ సమావేశంలో ఈ ఏడాది రోడ్లు, రహదారుల కేటాయింపులు, పద్దులపై జరిగిన చర్చలో రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారుల భద్రతకు సంబంధించిన అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉదాసీనతను ప్రదర్శిస్తున్నదని ఆయన విమర్శించారు. రోడ్డు భద్రతకు కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేవలం 0.3 శాతం నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. ఈ నిధులు ఏ మాత్రం ఉపయోగపడవని ఆయన తెలిపారు.

పతనమైన బోయింగ్ కంపెనీ షేర్ ధర

న్యూయార్క్‌లోని లాగార్డియా విమానాశ్రయంలో నిలిచి ఉన్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ 737 బోయంగ్ విమానం. రెండు ఘోర ప్రమాదాల నేపథ్యంలో బోయంగ్ 737 మాక్స్ విమానాలను ఇకపై వినియోగించబోమని అమెరికన్ ఎయిర్‌లైన్స్ చేసిన ప్రకటన స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఏరోస్పేస్ రంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న బోయింగ్ కంపెనీ షేర్ ధర 1.4 శాతం పతనమై 360.23 డాలర్లకు చేరింది.

కృత్రిమ మేధస్సుతో పనిచేసే ఇంటరాక్టివ్ అసిస్టెంట్

హైదరాబాద్, జూలై 15: ఆంధ్రాబ్యాంకు ప్రధాన కార్యాలయంలో కృత్రిమ మేథస్సు(ఏఐ)తో పనిచేసే ఇంటరాక్టివ్ అసిస్టెంట్ - అభిని బ్యాంకు ఎండీ -సీఈఓ జే పకీరిసామి సోమవారం నాడు ప్రారంభించారు. కృత్రిమ మేధస్సుతో పనిచేసే ఈ సహాయకారికి అభి అని పేరు పెట్టారు. దీనిని ప్రధాన కార్యాలయం ఆడిటోరియంలో ఉంచారు. ఆంధ్రాబ్యాంకు ఎపుడూ ఆధునికతను సంతరించుకుంటూనే ఉందని, అందులో భాగంగానే చాట్‌బాట్‌గా అభిని ఏర్పాటుచేశామని ఆయన పేర్కొన్నారు. రోజంతా ఖాతాదారుల అనుమానాలను ఇది నివృత్తి చేస్తుందని, అనుమానాలను అర్ధం చేసుకుని తదనుగుణమైన సమాచారాన్ని తిరిగి ఇచ్చేందుకు వీలుగా అభిలో సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడం జరిగిందని ఆయన వివరించారు.

వారి వాదన వింటాం: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: కర్నాటక రాష్ట్ర కాంగ్రెస్-జెడీ(ఎస్) తిరుగుబాటు ఎమ్మెల్యేల వాదన వింటామని సుప్రీం కోర్టు తెలిపింది. అధికార కాంగ్రెస్-జెడీ(ఎస్) ఎమ్మెల్యేల రాజీనామాల పర్వంతో కర్నాటక ప్రభుత్వం సంక్షోభంలో పడిన సంగతి తెలిసిందే. తమ రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్‌ను ఆదేశించాల్సిందిగా కోరుతూ ఇదివరకే కాంగ్రెస్-జేడీ(ఎస్)కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కాగా, తాజాగా మరో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, కె. సుధాకర్, ఎన్. నాగరాజ్, మునిరత్న, రోషన్ బేగ్ కూడా తమ రాజీనామాలను స్పీకర్ ఆమోదించడంలేదని పిటీషన్ దాఖలు చేశారు.

అస్సాంను ఆదుకోవాలి

చిత్రం... ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొంటున్న అస్సాంను ఆదుకోవాలని కోరుతూ సోమవారం పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద ప్రదర్శన జరుపుతున్న కాంగ్రెస్ ఎంపీలు

ఆరు నెలలు గడువు కావాలి

న్యూఢిల్లీ, జూలై 15: బాబ్రీ మసీదు కూల్చి వేసిన ఘటనపై విచారణ ముగించేందుకు మరో ఆరు నెలల గడువు కావాలని విచారణ జరుపుతున్న ప్రత్యేక న్యాయమూర్తి ఎస్‌కే యాదవ్ సుప్రీం కోర్టును కోరారు. బాబ్రీ మసీదు కూల్చి వేసిన కేసులో బీజేపీ అగ్ర నేతలు ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి తదితరులపై ప్రత్యేక న్యాయమూర్తి విచారణ జరుపుతున్నారు. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ 30న తాను పదవీ విరమణ చేయనున్నట్లు న్యాయమూర్తి యాదవ్ ఇటీవల సుప్రీంకు లేఖ రాశారు.

హ్యాట్సాఫ్.. ఇస్రో

న్యూఢిల్లీ, జూలై 15: ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఎదురుచూస్తున్న చంద్రయాన్-2 ప్రయోగాన్ని సాంకేతిక సమస్య కారణంగా చివరి క్షణంలో ఇస్రో వాయిదా వేయడం మంచిదైందని శాస్తవ్రేత్తలు స్పష్టం చేశారు. దీన్ని పట్టించుకోకుండా ఈ ప్రయోగాన్ని సాగించి ఉంటే భారీ వైఫల్యానే్న చవిచూడాల్సి వచ్చేదని, అందుకు అవకాశం లేకుండా ఇస్రో ఈ ప్రయోగాన్ని వాయిదా వేసుకుందని అనేక మంది అంతరిక్ష శాస్తవ్రేత్తలు సోమవారం నాడు ఇక్కడ స్పష్టం చేశారు.

అవినీతి రహితంగా భారతీయ రైల్వేలు

లండన్, జూలై 15: భారతీయ రైల్వేలను అవినీతి రహితంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. తమ శాఖలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నట్టు ఆదివారం ఇక్కడ చెప్పారు. యూకేలో మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన పీయూష్ గోయల్ బ్రిటన్‌లో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. అన్ని ప్రభుత్వ శాఖలను అవినీతి రహితంగా తీర్చిదిద్దడానికి నరేంద్రమోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి స్పష్టం చేశారు. ‘అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేక మంది అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. నా మంత్రిత్వశాఖలో దీనిపై అధ్యయనం జరుగుతోంది.

మరో ఆరు మృతదేహాలు వెలికితీత

సిమ్లా, జూలై 15: హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో భవనం కూలిపోయిన ఘటనకు సంబంధించి మరో ఆరు మృతదేహాలు సోమవారం వెలికితీశారు. భవన శిథిలాల కింద చిక్కుకుని మొత్తం 14 మంది చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. 17 మంది సైనికులతో పాటు 11మంది పౌరులు గాయపడ్డారు. నహాన్-కుమార్తట్టి రోడ్డులోని నాలుగు అంతస్తుల భవవనం ఆదివారం కూలిపోయింది. భారీ వర్షాల వల్లే భవనం కూలిపోయినట్టు అధికారులు తెలిపారు. ఆ భవనంలో ఓ రెస్టారెంట్ నడుపుతున్నారు. ఇప్పటి వరకూ శిథిలాల కింద నుంచి 14 మృతదేహాలు వెలికి తీశారు. అందులో సైనికులవి 13, పౌరుడిది ఒకటి ఉన్నాయి. ‘ఇప్పటికి గాలింపుచర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

Pages