S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోలాహలంగా గణనాథుల ఊరేగింపు

అమరావతి, సెప్టెంబర్ 22: గణపతి నవరాత్రులు శనివారంతో ముగియనున్న సందర్భంగా అమరావతి, పరిసర ప్రాంతాల నుండి అమరావతిలో నిమజ్జనం చేసేందుకు భారీగా గణనాధులు తరలివచ్చారు. సత్యసాయి సేవాసంస్థల కో ఆర్డినేటర్ కె నారాయణరావు పర్యవేక్షణలో జిల్లాలో సత్యసాయి సేవాసమితి వారు ఏర్పాటుచేసిన 9 వినాయక విగ్రహాలు అమరావతిలోని త్రిశక్తి పీఠానికి చేరుకున్నాయి. త్రిశక్తిపీఠం వద్ద చేకూరి జాజిబాబు పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథులను నిమజ్జనానికి తరలించారు. అలాగే మండల పరిధిలోని నరుకుళ్లపాడు గ్రామం నుంచి కాకతీయ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాన్ని యువకులు మేళతాళాల నడుమ ఊరేగింపుగా అమరావతికి తరలించారు.

ఉరకలెత్తిన ఉత్సాహం

హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు క్యూలుకట్టారు. 119 నియోజకవర్గాలకు మొత్తం 1076 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణ శనివారంతో ముగిసింది. దీనిని బట్టి పోటీ చేసేందుకు చాలామంది ఉత్సాహంగా ఉన్నారన్నది స్పష్టం అయ్యిందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వ్యాఖ్యానించారు. ఇలాఉండగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున ఎంపిక చేస్తారు. ఆ జాబితాను స్క్రీనింగ్ కమిటీకి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అందజేస్తారు. అభ్యర్థుల సామాజిక, ఆర్థిక, అంగబలం, కుల బలబలాలనూ పరిగణనలోకి తీసుకుంటారు.

చేబ్రోలులో క్రీ.శ1వ శతాబ్దం నాటి బౌద్ధ ఆనవాళ్లు

చేబ్రోలు, సెప్టెంబర్ 22: బౌద్ధసంపదకు పుట్టినిల్లైన మండల కేంద్రమైన చేబ్రోలు గ్రామంలో క్రీస్తుశకం 1వ శతాబ్దానికి చెందిన బౌద్ధ ఆనవాళ్లను పురావస్తు పరిశోధకులు కల్చర్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి సిఇఒ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి శనివారం గుర్తించారు. చేబ్రోలు దేవాలయాలను, బౌద్ధ శిల్పాలను ఆయన పరిశీలించారు. వారసత్వ సంపద, ప్రాచీన కట్టడాలను గుర్తించి వాటిని పరిరక్షించి భావితరాలకు అందించేందుకు గాను ప్రారంభించిన ప్రిజర్వ్ హెరిటేజ్ ఆఫ్ పోస్టెరిటీ అనే కార్యక్రమంలో భాగంగా చేబ్రోలులో ఆయన శనివారం పర్యటించారు.

కాంగ్రెస్ ‘పీపుల్స్ మేనిఫెస్టో’

హైదరాబాద్, సెప్టెంబర్ 22: కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం, హామీ ఇచ్చామంటే అమలు చేస్తుందన్న విశ్వాసం ప్రజలకు కలిగించాలని టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో) కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహా అధ్యక్షతన సమావేశమై వివిధ హామీలపై సుదీర్ఘంగా చర్చించింది. పార్టీ మేనిఫెస్టోను ‘పీపుల్స్ మేనిఫెస్టో’గా పేర్కొనాలని ఈ సందర్భంగా నిర్ణయించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సీ కుంతియా, ఉతమ్‌కుమార్ రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

‘మహా’ అయితే 10 సీట్లు!

ముస్తాబాద్, సెప్టెంబర్ 22: కాంగ్రెస్ శుష్క హామీలు, ప్రతిపక్ష పార్టీల మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని తెలంగాణ ప్రజలకు ఐటీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. గత 60ఏళ్లలో జరగని అభివృద్ధి తెలంగాణ వచ్చాక జరిగిందని, టీఆర్‌ఎస్‌ను మరొకసారి గెలిపిస్తే ఇప్పటికన్నా మూడింతలు అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కేసీఆర్ ఉద్యమం లేకుంటే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 10సీట్లు మాత్రమే గెలుస్తుందని తారక రామారావు జోస్యం చెప్పారు. ఈ విషయం ఉత్తమ్‌కమార్‌కూ తెలుసని ఆయన తెలిపారు.

బురద రోడ్లపైనే జగన్ పాదయాత్ర

విశాఖపట్నం, సెప్టెంబర్ 22: వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర విశాఖ జిల్లాలో మరో రోజు మాత్రమే కొనసాగనుంది. ప్రస్తుతం భీమిలి నియోజకవర్గం ఆనందపురంలో కొనసాగుతున్న పాదయాత్ర శనివారం ఉదయం కోలవానిపాలెం నుంచి ప్రారంభమైంది. పాదయాత్ర భీమన్నదొరపాలెం, ఎర్రవానిపాలెం, రామవరం మీదుగా గండిగుండం జంక్షన్‌కు చేరుకుంది. దారిపొడవునా జగన్ స్థానికులను ఆప్యాయంగా పలుకరిస్తూ ముందుకు సాగారు. పూర్తి పల్లె వాతావరణంలో మట్టి రోడ్ల మీదుగా జగన్ పాదయాత్ర సాగింది. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు జగన్ పాదయాత్ర చేసిన గ్రామాల్లో మట్టిరోడ్లు బురదమయమయ్యాయి. అయినప్పటికీ జగన్ ఇదే మార్గంలో పాదయాత్ర కొనసాగించారు.

సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాలి

సూర్యాపేట, సెప్టెంబర్ 22: ఆనాదిగా వస్తున్న సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర విద్యుత్, దళిత అభివృద్దిశాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమాన్ని శనివారం జిల్లాకేంద్రంలోని గణేష్ చౌరస్తా(పూల సెంటర్) వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో అనాదిగా పండుగలు, ఉత్సవాలు జరుపుకోవడం వస్తున్న ఆచారమన్నారు. దేశ స్వాతంత్ర సమరం జరుగుతున్న రోజుల్లోనూ జాతీయవాదాన్ని పెంపొందింపజేసేందుకు గణేశ్ ఉత్సవాలు దోహదం చేశాయన్నారు.

గంగమ్మ ఒడికి గణపయ్య!

నల్లగొండ, సెప్టెంబర్ 22: భక్తుల నవరాత్రుల పూజలందుకున్న వినాయకుడి నిమజ్జనోత్సవాన్ని జిల్లా ప్రజలు, భక్తులు శనివారం కోలాహలంగా భారీ ఊరేగింపులతో సాగిన శోభాయాత్రల మధ్య ఘనంగా నిర్వహించారు. పార్వతీ ముద్దుల తనయ గణపయ్య నిమజ్జన శోభాయాత్రలు ఉదయం నుండి మొదలై అర్ధరాత్రి వరకు కూడా కొనసాగగా గంగమ్మ ఒడి చేరిన గణపయ్యలతో నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి.

నిమజ్జనానికి సర్వం సిద్ధం

చౌటుప్పల్, సెప్టెంబర్ 22: గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనరేట్ సీపీ మహేష్ భగవత్ అన్నారు. చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం చెరువును శనివారం పరిశీలించారు. వినాయకుడి విగ్రహలను నిమజ్జనం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లపై స్థానిక పోలీస్ అధికారులతో సమీక్ష చేశారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శాంతియుతంగా గణేష్ నిమజ్జనం జరుపుకునేందుకు ప్రజలు సహకరించాలన్నారు. దండుమల్కాపురం చెరువులో వినాయకుడి విగ్రహలను నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసామన్నారు. రోడ్డు, లైటింగ్ ఏర్పాట్లు చేసామన్నారు.

ప్రణయ్ హత్యపై సమగ్ర విచారణ కోరతాం

మిర్యాలగూడ టౌన్, సెప్టెంబర్ 22: మిర్యాలగూడ పట్టణంలో ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న దళిత యువకుడు పెరుమాళ్ల ప్రణయ్‌కుమార్‌ను దారుణంగా హత్య చేశారని, దీనిపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాధ్‌సింగ్, రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌లను కలిసి సమగ్ర, సిబిఐ విచారణ జరపాలని కోరుతామని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం రాత్రి ప్రణయ్ ఇంటికి చేరుకుని ప్రణయ్ చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రణయ్ కుటుంబ సభ్యులు జిల్లా పోలీసులు సమగ్ర విచారణ జరపలేదని పేర్కొన్నారన్నారు.

Pages