S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

test

test

జగదేకసుందరి క్లియోపాత్రా--95

ఈ చిన్న యుద్ధానికే తాను విపరీతమైన పన్నులు వేసి, ప్రజల్ని పిండి, అపకీర్తిని మూటగట్టుకున్నాడు. ప్రజల్ని ఇంకా పిండేందుకైనా వారి దగ్గర ఏమీ లేదని తెలుసు. అసలు ప్రాచ్య దేశాల యుద్ధమే మానుకోమనే ప్రజాభిప్రాయం తనకు అడ్డంకి కావచ్చు. ఈ సమస్య తేలుతే, తన ఏక ఛత్రాధిపత్యం తథ్యమైనట్టే!

ధనికొండ హనుమంతరావు

జయహో.. జనతా

హైదరాబాద్, మార్చి 22: ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా మహమ్మారిపై పోరాడేందుకు ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపునకు కోటిన్నర జనాభా అలరారుతున్న హైదరాబాద్ మహానగరం మూగబోయింది. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంపూర్ణంగా జనతా కర్ఫ్యూకు మద్దతు పలకడం విశేషం. పేద, మధ్య తరగతి, ధనిక వర్గం అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు స్వీయ నిర్బంధంతో ఇంటికే పరిమితమయ్యారు. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 400 సంవత్సరాలకుపైబడి చరిత్ర ఉన్న హైదరాబాద్ మహానగరంలో మార్చి 22వ తేదీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. అనేక యుద్థాలు, ఉద్యమాలు, పోరాటాలకు సాక్షీభూతంగా నిలిచిన హైదరాబాద్ మహానగరంలో చీమ చిటుక్కుమనలేదు.

నెల్లూరు నిర్మానుష్యం

నెల్లూరు, మార్చి 22 : కోవిడ్-19 (కరోనా వైరస్)ను నియంత్రించే చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి పిలుపు మేరకు ఆదివారం చేపట్టిన జనతా కర్ఫ్యూ జిల్లాలో విజయవంతంగా కొనసాగింది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ ఈ స్వీయ నిర్బంధం కొనసాగించాలని ప్రధాని పిలుపునిచ్చారు. అయితే జిల్లాలో తెల్లవారుజాము నుంచే ప్రజలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండిపోయారు. రాత్రి తొమ్మిది తర్వాత కూడా నెల్లూరు నగరంలో జనసమ్మర్థం పెద్దగా కనిపించకపోవడం విశేషం.

పెళ్లికి ‘కరోనా’ బ్రేక్

పిఠాపురం, మార్చి 22: ఒక పక్క కరోనా మహమ్మారికి అందరూ వణికిపోతుంటే పిఠాపురంలో ఓ కుటుంబం విదేశాల నుండి వచ్చిన వధూవరులకు వివాహం జరిపించడానికి సిద్ధమైంది. విషయం తెలుసుకున్న అధికారులు రంగప్రవేశం చేయడంతో వారికి వైద్యపరీక్షలు నిర్వహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అధికారులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంటున్న పిఠాపురం యువతికి, విజయవాడకు చెందిన వరునికి వివాహం నిశ్చయించారు. వధూవరులు ఇద్దరు ఐదు రోజుల క్రితం అమెరికా నుండి వచ్చారు. వధువు నివాసం పిఠాపురం పట్టణం కాగా, వరుడు విజయవాడ నుండి బంధువులతో కలిసి పిఠాపురం వచ్చాడు.

సీమ జనం.. ఇళ్లకే పరిమితం

కర్నూలు/అనంతపురం/కడప, మార్చి 22: కరోనా (కొవిడ్-19)వైరస్ ప్రస్తుతం దేశంలో 2వ దశలో వుందని, ఈ వైరస్ మరింత విస్తరించకుండా అరికట్టేందుకు ప్రజలు కూడా సహకరించాలని దేశ ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపునకు రాయలసీమ ప్రజలు స్పందించి ఆదివారం స్వచ్ఛందంగా గృహ నిర్బంధం పాటించారు. మునుపెన్నడూ లేనివిధంగా ప్రజలు కరోనా భయంతో ఇళ్లను వదిలి బయటకు రాలేదు. ఒక రోజుకు కావాల్సిన నిత్యావసర సరుకులు, కూరగాయలు, ఇతరత్రా వస్తువులను ప్రజలు ముందు రోజునే సమకూర్చుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు ముందస్తు చర్యలు తీసుకుని స్వీయ గృహ నిర్బంధం పాటించారు.

నిశ్శబ్ధంలో తిరునగరి

తిరుపతి: ఆధ్యాత్మిక క్షేత్రం తిరునగరిలో భక్తుల గోవింద నామస్మరణలు లేవు. వాహనాల శబ్ధాలు లేవు....రైలు కూతలు లేవు.వీధుల్లో జనసంచారం లేదు. దుకాణాలు తెరుచుకోలేదు. బ్యాంకుల్లో వ్యాపార వాణిజ్యాలు నడవలేదు. ఏ వీధిచూసినా, ఏ వాడ చూసినా రోడ్లు నిర్మానుష్యంగా మారి తిరుమల, తిరుపతిలో నిశ్శబ్దం రాజ్యమేలింది. అలా అని ఏ సూర్యగ్రహణమో పట్టలేదు. రాజకీయ నాయకులు బంద్‌కు పిలుపునివ్వలేదు. కేవలం కరోనా వైరస్ నివారణకు సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోదీ 14 గంటల పాటు జనతా కర్ప్యూను పాటించాలంటూ ఇచ్చిన ఒకే ఒక పిలుపు జనారణ్యాన్ని నిశ్శబ్ధ అరణ్యంగా మార్చింది.

Pages