S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ చరిత్రలోనే అపూర్వం

హైదరాబాద్, మార్చి 22: ప్రపంచానికే జనతా కర్ఫ్యూ స్పూర్తి దాయాకమని, దేశ చరిత్రలలోనే ఆపూర్వమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. కరోనా నివారణలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతొ జనతా కర్ఫ్యూ ఆదివారం విజయవంతంగా కోనసాగిందని తెలిపారు. ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన జనతా కర్ఫ్యూలో ప్రజలు స్వచ్చందంగా పాల్గొని తమ పూర్తి మద్దతు తెలిపారన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజల మద్దతు ఇలాగే ఉండాలని ఆకాంక్షించారు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఇలాంటి కర్ఫ్యూ చూస్తున్నామని తెలిపారు.

మాజీ సీఎం చంద్రబాబు సంఘీభావం

హైదరాబాద్, మార్చి 22: కరోనా వైరస్ మహామ్మారిని స్వీయ నియంత్రణ ద్వారా కరోనాను దూరంచేయవచ్చునన్న ప్రభుత్వ ఆదేశాలను అన్ని వర్గాలు ముక్తకంఠంతో విజయవంతం చేశారు. ఇటు మంత్రులు, అటు అధికారులు జనతా కర్ప్యూకు సంఘీభావం వ్యక్తం చేస్తూ సంకేతాలు ఇచ్చారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లో తన ఇంటి ముందు కుటుంబ సభ్యులతో బయటకు వచ్చి జనతా కర్ఫ్యూకు సంఘీభావం వ్యక్తం చేస్తూ చప్పట్లు కొట్టారు. టీఎస్ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, ఆపార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి జనతా కర్ఫ్యూకు సంఘీభావం చెబుతూ చప్పట్లు కొట్టారు.

హోం క్వారంటైన్’లను గుర్తిస్తున్నాం

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి దృష్ట్యా అవసరమైన అన్ని చర్యలను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటోందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం పేర్కొన్నారు. నిపుణుల సలహా మేరకు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన వ్యక్తులను ప్రభుత్వం గుర్తిస్తోందని చెప్పారు. ‘కరోనా లక్షణాలున్న వ్యక్తులెవరైనా మీ సమీపంలో ఉంటే అలాంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దనీ.. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి’ అని ప్రజలకు సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

తప్పని ‘కరోనా’ ప్రభావం?

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై ఈవారం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అనిశ్చితిలోనే లావాదేవీలు కొనసాగడం ఖాయంగా కనిపిస్తున్నది. గత వారం బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ ఏకంగా 4,187.52 పాయింట్లు (12.27 శాతం) పతనమైతే, జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 1,209.73 పాయింట్లు (12.15 శాతం) నష్టపోయింది. వరుసగా నాలుగు రోజుల నష్టాలకు తెరదించుతూ, లావాదేవీలకు చివరి రోజైన శుక్రవారం మార్కెట్లు లాభాల్లో ముగిసినప్పటికీ, అదే రకమైన సానుకూల ధోరణులు ఈవారం కూడా కొనసాగుతాయని అనుకోవడానికి వీల్లేదన్నది వాస్తవం.

రాష్ట్ర సరిహద్దులు మూసివేత

హైదరాబాద్, మార్చి 22: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించి తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి రాష్ట్రంలోకి ఎవరూ ప్రవేశించకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేస్తున్నారు. జనతా కర్ఫ్యూను పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు స్వచ్ఛందంగా ప్రజలు స్వీయనిర్భందంలో ఉన్నారు. వ్యాపార, వాణిజ్య వర్గాలు బంద్ పాటిస్తుండటంతో దుకాణాలు మూతపడ్డాయి.

దండం పెడతాం.. ప్లీజ్..

హైదరాబాద్, మార్చి 22: జనతా కర్ఫ్యూ అమలులో ఉన్నా రోడ్డుపైకి వస్తున్న వాహనదారులు, వ్యక్తులకు హైదరాబాద్ పోలీసులు వినూత్న రీతిలో బుద్ధి చెప్పారు. వారి బాధ్యతను గుర్తుకు వచ్చేలా వ్యవహరిస్తున్నారు. పోలీసుల తీరు మర్యాదపూర్వకంగానే ఉన్నా, అది మాత్రం వాహనదారులకు చెంపపెట్టులా అనిపిస్తోంది. జనతా కర్ఫ్యూ సందర్భంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి, అంతా ఇళ్లలోనే ఉన్న సమయం, అయినా రోడ్లపై తిరుగుతూ కనిపించిన వారికి నగర ట్రాఫిక్ పోలీసులు, కూడళ్లలో ఉన్న సాధారణ పోలీసులు వారిని ఆపి దండం పెడుతున్నారు. ఈ ఫోటోలను హైదరాబాద్ పోలీసులు ట్విట్టర్‌లో షేర్ చేశారు.

కరోనా పాజిటివ్ 27

హైదరాబాద్: తెలంగాణలో కరోనా సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని ప్రభుత్వ లెక్కలే తెలియచేస్తున్నాయి. ఆదివారానికి కరోనా పాజిటివ్‌గా తేలిన వారి సంఖ్య 27కు చేరింది. కరోనా పాజిటివ్‌గా తేలిన వారి వివరాలను ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఆదివారం సాయంత్రం వెల్లడించారు.
* ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన 24 ఏళ్ల యువకుడు దుబాయి మీదుగా లండన్‌నుండి హైదరాబాద్ వచ్చాడు. కరోనా ఉందని నిర్దారణ కావడంతో ప్రభుత్వం గుర్తించిన దవాఖానలో చికిత్సకోసం చేర్పించారు.

సమష్టి కృషితో కరోనాకు బ్రేక్

విజయవాడ, మార్చి 22: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర ప్రజలంతా ఆదివారం 14 గంటలపాటు జనతా కర్ఫ్యూ పాటించిన సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. ప్రధానంగా అహర్నిశలు సేవలందిస్తున్న వైద్య బృందాలు, వారికి సహకరిస్తున్న పోలీసు యంత్రాంగానికి గవర్నర్ ప్ర త్యేక ధన్యవాదాలు తెలిపారు. సమష్టి కృషితోనే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టగలమని స్ప ష్టం చేశారు. రాజ్‌భవన్ ఆవరణలో అధికారులు, సిబ్బంది తో కలిసి చప్పట్లుకొట్టి వారికి సంఘీభావం ప్రకటించారు.

బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారం!

సబ్బవరం, మార్చి 22: విశాఖపట్నం జిల్లా, సబ్బవరం మండలం అమృతపురం గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. శనివారం రాత్రి తన ఆటోలో తీసుకెళ్ళి సూరిరెడ్డిపాలెం శివార్లలో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. స్థానిక సీఐ ఆర్‌వీవీఎస్‌ఎస్ చంద్రశేఖరరావు తెలిపిన వివరాలివి. బాలిక(15) సబ్బవరంలో ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తోంది. అయితే, శనివారం ఆమె విధులు ముగించుకుని రాత్రి సుమారు ఏడు గంటల ప్రాంతంలో అమృతపురం వైపు వెళ్ళే ఆటోల స్టాండ్ వద్దకు వచ్చింది. అక్కడ ఆగి ఉన్న ఆటోను అమృతపురం వెళ్తుందా? అని అడగ్గా అదేగ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ వెళ్తుందని చెప్పటంతో ఆమె ఎక్కికూర్చుంది.

విదేశాల నుంచి వచ్చినవారు నిబంధనలు పాటించాల్సిందే..

గుంటూరు, మార్చి 22: విదేశాల నుండి రాష్ట్రానికి వస్తున్న వారిలోనే అధిక శాతం కరోనా వైరస్ లక్షణాలు కన్పిస్తున్నాయని, ఈ దృష్ట్యా ఎవరైనా విదేశాల నుండి వస్తే విధిగా నిబంధనలు పాటించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ఆదివారం ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ విదేశాల నుండి వచ్చినవారు వైద్య ఆరోగ్య శాఖకు కచ్చితంగా సమాచారం అందించాలన్నారు. ఈ విషయంలో వారి తల్లిదండ్రులు కూడా సహకరించాలని కోరారు. వైద్య ఆరోగ్య అధికారుల సూచనల మేరకు ఇంట్లో గానీ, హోం ఐసోలేషన్ నిబంధన పాటించాలని, అలాకాకుండా జనసంద్రంలో తిరగడం వల్ల ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు వస్తుందని హెచ్చరించారు.

Pages