S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

31వరకు రైళ్లు రద్దు

విజయవాడ (రైల్వేస్టేషన్), మార్చి 22: కరోనా వైరస్ కారణంగా ఆదివారం అర్ధరాత్రి 12గంటల నుంచి ఈ నెల 31వరకు భారతీయ రైల్వే అంతటా రైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నారని దక్షిణ మధ్య రైల్వే పౌర సంబంధాల ప్రధానాధికారి సీహెచ్ రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్‌ని నివారించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒకరోజు జనతా కర్ఫ్యూని దేశమంతటా పాటించడంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో సైతం ఎవరికి వారుగా పూర్తిస్థాయిలో స్పందించారు. ఇందులో భాగంగానే దూర ప్రాంతాలకు నడిచే రైళ్లు మినహా మిగిలిన సూపర్‌ఫాస్ట్, ఇంటర్ సిటీ, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను ఆదివారం ఒక్కరోజు రద్దుచేశారు.

మియాకో రైల్వే స్టేషన్ వద్ద ఒలింపిక్ క్రీడా జ్యోతి

జపాన్‌లోని మియాకో రైల్వే స్టేషన్ వద్ద ప్రదర్శనకు ఉంచిన ఒలింపిక్ క్రీడా జ్యోతి. నిషేధ ఆజ్ఞలు ఉన్నప్పటికీ, జ్యోతిని తిలకించేందుకు మాస్క్‌లు ధరించి, భారీ సంఖ్యలో హాజరైన క్రీడాభిమానులు

ఐఓసీ నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు

జెనీవా, మార్చి 22: అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఓసీ) ఇటీవల తీసుకున్న పలు నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షెడ్యూల్ ప్రకారమే ఒలింపిక్ క్రీడా జ్యోతి ప్రజ్వలన, రిలే కార్యక్రమాలను నిర్వహించడాన్ని కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు. నిజానికి రిలే కార్యక్రమాన్ని రద్దు చేయాలని ఐఓసీని టోక్యో ఒలింపిక్ కమిటీ కోరింది.

మూతపడిన కొలరాడోలోని అమెరికా ఒలింపిక్

మూతపడిన కొలరాడోలోని అమెరికా ఒలింపిక్, పారాలింపిక్ ట్రైనింగ్ సెంటర్. కరోనా వైరస్ కారణంగా స్పోర్ట్స్ ట్రైనింగ్ కాంప్లెక్స్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు కొలరాడో గవర్నర్ జారెడ్ పోల్స్ ప్రకటించాడు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఇక్కడ శిక్షణా కార్యక్రమాలు మొదలుకావని స్పష్టం చేశాడు.

దివాలా దిశగా సాకర్ క్లబ్‌లు!

మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తున్నది. క్రికెట్, రగ్బీ, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, టెన్నిస్, బాడ్మింటన్ వంటి ఎన్నో విభాగాల్లో టోర్నీలు, సిరీస్‌లు రద్దవుతున్నాయి. ఐరోపా దేశాల్లో అ త్యంత ఆదరణ ఉన్న ఫుట్‌బాల్ ఇప్పుడు కరోనా బారిన పడి విలవిల్లాడుతున్నది. ఫస్ట్, సెకండ్ డివిజన్ క్లబ్‌లకు భా రీ నష్టాలు తప్పడం లేదు. అయితే, ఆర్థికంగా పటిష్టమైన స్థితిలో ఉన్న ఈ క్లబ్‌లు కొంత వరకూ నిలదొక్కుకోవచ్చు. కానీ, థర్డ్, ఫోర్త్ డివిజన్ క్లబ్‌లు మాత్రం దివాలా దిశగా నడుస్తున్నాయి.

కరోనా ఎఫెక్ట్

న్యూఢిల్లీ, మార్చి 22: కరోనా వైరస్ ప్రభావం క్రీడా రంగాన్ని కూడా పట్టి పీడిస్తున్నది. వివిధ దేశాల్లో జరగాల్సిన ఎన్నో ప్రాంతీయ, అంతర్జాతీయ టోర్నీలు, క్వాలిఫయింగ్ ఈవెంట్లు, ఇతరత్రా పోటీలు రద్దవుతున్నాయి. సైప్రస్‌లోని నికొసియాలో మార్చి 4 నుంచి 13వ తేదీ వరకు జరగాల్సిన షూటింగ్ వరల్డ్ కప్ నుంచి భారత్ వైదొలగింది. మరికొన్ని దేశాలు ఇలాంటి నిర్ణయానే్న తీసుకుంటే, ఆ టోర్నీ జరిగే అవకాశాలు దారుణంగా దెబ్బతింటాయి. అంతేగాక, న్యూఢిల్లీలోని డాక్టర్ కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్‌లో మార్చి 16 నుంచి 26వ తేదీ వరకు వరల్డ్ కప్ సంయుక్త ఆతిథ్యం నేపథ్యంలో పోటీలను భారత జాతీయ షూటింగ్ సంఘం (ఎన్‌ఆర్‌ఏఐ) నిర్వహించాలి.

సందట్లో సడేమియా

కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తే, ఈ పేరు అందరికీ తెలిసింది కాబట్టి, ప్రత్యేకంగా ప్రచారం
చేసుకోవాల్సిన అవసరం లేదని అనుకున్నారో ఏమోగానీ అదే పేరుతో బీరును మార్కెట్లోకి విడుదల చేశారు. ఉత్తర లండన్‌లోని
టెస్కో సూపర్ మార్కెట్‌లో దర్శనమిస్తున్న కరోనా బీర్ కార్టన్ బాక్స్‌లు ఇవి. రెస్ట్రాంట్లు, లీజర్ సెంటర్లు, జిమ్‌లు తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకూ మూసివేయాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ స్పష్టం చేసిన తర్వాత, మందు కావాలనుకునే వారు సూపర్ మార్కెట్లను ఆశ్రయించక తప్పడం లేదు

‘బేర్’ దెబ్బకు కంపెనీలు విలవిల

న్యూఢిల్లీ, మార్చి 22: భారత స్టాక్ మార్కెట్లలో గత వారం బేర్ ఆధిపత్యం కొనసాగడంతో, దేశంలోని అతి పెద్ద కంపెనీలు విలవిల్లాడాయి. ‘టాప్-10’ కంపెనీల మార్కెట్ విలువ సుమారు 3.63 లక్షల కోట్ల రూపాయలు తగ్గిందంటే ప్రతికూల పరిస్థితులు ఏ స్థాయిలో మార్కెట్లను దెబ్బతీస్తున్నాయో ఊహించుకోవచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్)ను రెండో స్థానానికి నెట్టిన టాటా కన్సల్టెన్సీ లిమిటెడ్ (టీసీఎస్) నంబర్ వన్‌గా ఎదగడం విశేషం. మార్కెట్ గణాంకాల ప్రకారం గత వారం టాప్-10 కంపెనీల నష్టం అక్షరాలా 3,63,884.03 కోట్ల రూపాయలు.

పన్ను మినహాయింపు ఇవ్వండి

న్యూఢిల్లీ, మార్చి 22: కరోనా వైరస్ కారణంగా దారుణంగా దెబ్బతిన్న పరిశ్రమను ఆదుకోవడానికి పన్ను మినహాయింపు కల్పించాలని సినిమా ఆపరేటర్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదే విధంగా బకాయిలు, రుణాల చెల్లింపులకు ఏడాది గడువు ఇవ్వాలని కోరారు. వివిధ విద్యుత్ డిస్కాంలు కనీస చార్జీల కింద వసూలు చేస్తున్న మొత్తాలను రద్దు చేయాలని కూడా మల్టిప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఏఐ) ఒక ప్రకటనలో కోరింది. కరోనా వైసర్ విజృంభణ కారణంగా థియేటర్లు మూతపడ్డాయని, షూటింగ్స్ ఆగిపోయాయని గుర్తుచేసింది. ఫలితంగా సినిమా ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు చెప్పింది.

మ్యూచువల్ ఫండ్స్‌లో మరో మూడు లక్షల ఇనె్వస్టర్ ఖాతాలు

న్యూఢిల్లీ, మార్చి 22: మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఫిబ్రవరి నెలలో కొత్తగా మూడు లక్షలకు పైగా ఇనె్వస్టర్ ఖాతాలను తెరచింది. దీంతో ఈ పరిశ్రమలో మొత్తం ఇనె్వస్టర్ ఖాతాల సంఖ్య 8.88 కోట్లకు పెరిగింది. ఇలాంటి పథకాలలో ఉన్న మార్కెట్ రిస్క్‌ల గురించి మదుపరులకు గల అవగాహనను ఇది సూచిస్తోంది. అయితే, అంతకు ముందు రెండు నెలలతో పోలిస్తే ఫిబ్రవరి నెలలో ఇనె్వస్టర్ ఖాతాల సంఖ్య వృద్ధిలో వేగం తగ్గింది. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ జనవరి నెలలో 14 లక్షల ఇనె్వస్టర్ ఖాతాలను తెరచింది. అదేవిధంగా 2019 డిసెంబర్ నెలలో ఆరు లక్షల ఇనె్వస్టర్ ఖాతాలను తెరచింది.

Pages