S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలు రాని వారు ప్రొఫెసర్లా?

హైదరాబాద్, ఏప్రిల్ 27: ఉన్నత విద్యారంగం నాశిరకంగా తయారవుతోందని, దానికి కారణం ప్రమాణాలు కొరవడటమేనని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ విజయ్ కుమార్ సారస్వత్ పేర్కొన్నారు. ఇదో వేలం వెర్రిలా తయారైందని , యూనివర్శిటీల్లో ఉద్యోగానికి వచ్చిన వారు కనీసం ఆ దరఖాస్తు రాయడం కూడా రావడం లేదని, నాశిరకం పిహెచ్‌డిలతో ఉద్యోగాలకు రావడం వల్ల విద్యార్ధులు కూడా అదే రకంగా తయారవుతున్నారని అన్నారు. రెండు రోజుల పాటు జరిగే వైస్ ఛాన్సలర్ల జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యాసంస్థల్లో ప్రమాణాలు దిగజారడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విస్తరణ చేసుకోవాలి కాని ఎంత మూల్యానికి అని ప్రశ్నించారు.

దేశ రాజకీయాల్లో ఓయు విద్యార్థులే కీలకం

హైదరాబాద్, ఏప్రిల్ 27: దేశ రాజకీయలో ఓయూ విద్యార్థులే కీలక పాత్ర పోషిస్తున్నారని మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు అన్నారు. ఓయూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, తమిళనాడు మానవ హక్కుల కమిషన్ చైర్మన్, న్యాయముర్తి మీనాకుమారి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఓయూకు దేశానికి రాజకీయ నాయకులను అందించన ఘనత దక్కుతుందని తెలిపారు.

బూటకపు ఎన్‌కౌంటర్లు ఆపండి

హైదరాబాద్, ఏప్రిల్ 27: ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న ఎన్‌కౌంటర్లన్నీ బూటకమేనని, కేంద్రప్రభుత్వం బూటకపు ఎన్‌కౌంటర్లను వెంటనే ఆపేయాలని మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి వికల్ప్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాకు ఒక వాయిస్ ప్రకటన విడుదల చేశారు. దండకారణ్యంలో పోలీసులు మారణ హోమం సృష్టిస్తున్నారని, ప్రజల కోసం పోరాడే క్రాంతికార్ ఆందోళనకారులను హతమారుస్తున్నారని ఆయన ఆరోపించారు. పీడిత ప్రజల కోసం, ఆదివాసీ, గిరిజనుల కోసం మావోయిస్టులు సాగిస్తున్న పోరాటం ఆగదన్నారు.

రేపు సింహాచలేశుని చందనోత్సవం

సింహాచలం, ఏప్రిల్ 27: సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి చందనోత్సవం శనివారం జరగనుంది. 364 రోజులు చందనం ముసుగులో ఉన్న సింహాద్రి నాథుడు వైశాఖ శుద్ద తదియ సందర్భంగా శనివారం భక్తకోటికి తన నిజరూప దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహించనున్నారు. దేశం నలుమూలల నుండి లక్షలాదిగా భక్తులు తరలి రానున్నారు.

వినోద్‌ఖన్నా కన్నుమూత

ముంబయ, ఏప్రిల్ 27: ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్‌ఖన్నా (70) గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ముంబయిలోని రిలయన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 11.20కు తుదిశ్వాస విడిచారు. వినోద్ మృతిపట్ల భారతీయ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది.

కుమారుడితో సహా తల్లి ఆత్మహత్య

పాలకొండ (టౌన్), ఏప్రిల్ 27: భర్త వేధింపులకు తాళలేక అతని భార్య, కుమారుడు కిరోసిన్ పోసుకొని సజీవ దహనమయ్యారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధి జెట్టివారి వీధికి చెందిన చందనాల ప్రమీల (25), ఆమె కుమారుడు సాయి (5) ఎన్‌కె రాజపురం గ్రామానికి వెళ్లే రహదారిపై ఒంటిపై కిరోసిన్ పోసుకొని గురువారం ఉదయం 9.30 గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. సిఐ వేణుగోపాలరావు, ఎస్‌ఐ చంద్రవౌళి హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమీలను సరుబుజ్జిలి మండల కేంద్రానికి చెందిన చందనాల మురళి 2010లో వివాహమాడాడు.

భావనపాడు వెనక భారీ దోపిడీ

హైదరాబాద్, ఏప్రిల్ 27: ఆంధ్ర రాష్ట్రంలో భావనపాడు పోర్టు నిర్మాణం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం మరో దోపిడీకి తెర తీస్తోందని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర సిగలో కిరీటమని, భారీ ఓడరేవు అంటూ పోర్టుకు గ్లోబల్ టెండర్లు ఎందుకు పిలవలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. పోర్టు ఆదాయంలో 2.3 శాతం వాటాను రాష్ట్రప్రభుత్వానికి ఇవ్వడానికి జరిగిన ఒప్పందానికి వెనుక ఉన్న లొసుగులు ఏమిటో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే వారంతా అభివృద్ధికి ఆటంకమన్నారు. రూ. 13వేల కోట్ల పోలవరం ప్రాజెక్టును రూ.42వేల కోట్లకు పెంచారు.

అక్రమ నిర్మాణాలు అనుమతించవద్దు

హైదరాబాద్, ఏప్రిల్ 27: అమరావతి రాజధాని ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను అనుమతించరాదని, అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సిఆర్‌డిఏ) అధికారులను ఆదేశించింది. జస్టిస్ చల్లా కోదండరామ్‌కు ఈ కేసును విచారించారు. కృష్టా జిల్లా పెనమలూరుకు చెదిన అనేక మంది ఈ కేసుపై పిటిషన్లను దాఖలు చేశారు. తాము నిర్మించుకున్న ఇండ్లు అక్రమ కట్టడాలంటూ అధికారులు కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నారని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల వల్ల నగరం తన అందాన్ని కోల్పోయిందన్నారు.

అమరావతి నిర్మాణానికి నిర్బంధ చర్యలు అమలు చేయం

హైదరాబాద్, ఏప్రిల్ 27: అమరావతి రాజధాని నిర్మాణానికి రైతులను ఇబ్బంది పెట్టమని, నిర్బంధం చర్యలు అమలు చేయమని, చట్టం ప్రకారం నడుచుకుంటామని ఏపి ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. విజయవాడకు చెందిన అనుమోలు వెంకట తిరుమల చంద్‌గాంధీ తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషసాయి విచారించారు. ఈ కేసులో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ పై హామీ ఇచ్చారు.

అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ ఆస్తుల వేలానికి పచ్చజెండా

హైదరాబాద్, ఏప్రిల్ 27: అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ ఆస్తుల వేలానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ రెండు కంపెనీలకు చెందిన 17 ఆస్తులను ఇ-పోర్టల్ ద్వారా వేలం వేయాలని హైకోర్టు ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ వి రామసుబ్రహ్మణియన్, జస్టిస్ ఎస్‌వి భట్‌తో కూడిన ధర్మాసన ఈ కేసును విచారించింది. అగ్రిగోల్డ్‌కు చెందిన 12 ఆస్తులు, అక్షయ గోల్డ్‌కు చెందిన ఐదు ఆస్తులను ఈ పోర్టల్‌లో ఉంచాలని ఆదేశించింది. ఈ ఆస్తుల వేలానికి సంబంధించి మార్గదర్శకాలను శుక్రవారం జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది.

Pages