S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలీస్ కస్టడీకి మోసగాడు

హైదరాబాద్, డిసెంబర్ 11: ఎక్స్‌లెంట్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, ఆర్బిట్ సొల్యూషన్స్ సంస్థల పేరుతో మోసానికి పాల్పడి కోర్టుకు లొంగిపోయిన ఘరానా మోసగాడిని సిసిఎస్ పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. తమ సంస్థల్లో పెట్టుబడులు పెడితే రెండు నెలల్లోనే 30 నుంచి 35 శాతం లాభాలు ఇస్తానంటూ రూ. 20 కోట్ల మేర మోసానికి పాల్పడినట్టు నిందితుడు విచారణలో అంగీకరించాడు. లాభాల పేరుతో భారీ మొత్తంలో అమాయక ప్రజలను మోసం చేసిన ఇతని నుంచి సిసిఎస్ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఇతని దగ్గర మోసపోయిన వారిలో ప్రవాస భారతీయులు కూడా ఉన్నారని డిసిపి అవినాష్ మహంతి ఆదివారం వెల్లడించారు.

గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురి అరెస్టు

విజయవాడ (క్రైం), డిసెంబర్ 11: రవాణా కేంద్రమైన విజయవాడలో టాస్క్ఫోర్స్ పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. విశాఖ జిల్లా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి తరలించే యత్నంలో అక్రమార్కులు అడ్డంగా దొరికిపోయారు. ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు నిందితుల నుంచి 300 కేజీలకు పైగా గంజాయి, రెండు ఖరీదైన కార్లు స్వాధీనం చేసుకున్నారు. దారిదోపిడీలు, చైన్‌స్నాచింగ్‌లకు అలవాటుపడిన ఓ వ్యక్తి తనకు జైలులో పరిచయమైన మరికొందరితో కలిసి గంజాయి స్మగ్లర్‌గా అవతారమెత్తాడు. విజయవాడను కేంద్రంగా చేసుకుని మత్తు వ్యాపారానికి తెరతీశాడు.

మూతపడే దిశగా ప్రభుత్వ ముద్రణాలయం!

విజయవాడ, డిసెంబర్ 11: నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతికి కేంద్రంగా మారిన విజయవాడ నగరంలోని ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణాలయం రోజురోజుకూ మూతపడే దిశగా పయనిస్తోంది. 1982లో నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి కోస్తా ఆంధ్ర ప్రాంత అవసరాల కోసం నగరంలో ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావు తన స్వహస్తాలతో దీన్ని ప్రారంభించారు. నగరం నడిబొడ్డున దాదాపు నాలుగు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 200 మంది సిబ్బందితో ఏర్పాటైన ఈ ముద్రణాలయం ఆలనాపాలనా కొరవడి నానాటికీ తీసికట్టుగా మారుతోంది.

పోలవరానికి 10 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు!

విజయవాడ, డిసెంబర్ 11: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టులో దాదాపు 10 లక్షల క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీటును వినియోగించనున్నారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ఇంత పెద్ద మొత్తంలో కాంక్రీటును వినియోగించిన ప్రాజెక్టులు లేవు. పోలవరం ప్రాజెక్టును బహుళార్థ సాధక ప్రాజెక్టుగా దాదాపు 40 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇందుకు అవసరమైన నిధులు సమకూరుస్తుండగా, నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. గతంలో నాగార్జున సాగర్ డ్యామ్‌ను 124 మీటర్ల ఎత్తులో 24 క్రస్టుగేట్లతో నిర్మించారు. 1955లో డ్యామ్ నిర్మాణం ప్రారంభమైంది.

బిసి జాబితాలో ‘మొదలియార్’

విజయవాడ, డిసెంబర్ 11: వెనుకబడిన తరగతుల సబ్ గ్రూప్-డి కింద అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నివసించే అగముద్దీన్, అగముదీర్, అగముదీ వెల్లలార్, అగముదీ మొదిలియార్ (తుళువ వెల్లలాస్‌తో కలిపి) సామాజిక వర్గ, కులాలకు చెందిన వారిని ‘మొదలియార్’గా పరిగణిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2008లోనూ దీనిపై వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ జీవో విడుదల చేసింది. అయితే పైన పేర్కొన్న కులాలకు ‘మొదలియార్’ను టైటిల్‌గా పరిగణించాలని కోరుతూ నెల్లూరు జిల్లాకు చెందిన మొదలియార్ సంఘం వినతిపత్రం అందించిన నేపథ్యంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

16 వేల ఈ-పోస్ యంత్రాల కొనుగోలుకు ఆర్టీసీ నిర్ణయం

విజయవాడ, డిసెంబర్ 11: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా 16 వేల ఈ-పోస్ మిషన్ల కోనుగోలుకు ఎపిఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. రూపే, క్రెడిట్, డెబిట్ కార్డులను అంగీకరించేందుకు నిర్ణయించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ఎండి మాలకొండయ్య తెలిపారు. ఈ-పోస్ యంత్రాలను తెలుగువెలుగు, సిటి బస్సులు, ఎక్స్‌ప్రెస్, ఎసి, అమరావతి, తదితర సర్వీసుల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ మిషన్ల కోసం ఇప్పటికే ఆర్డర్ ఇచ్చామని, మరో మూడు నెలల్లో ఆర్టీసీలో నగదు రహిత లావాదేవీలే జరుగుతాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. బ్యాంక్‌లతో ఈ-పోస్ మిషన్లను అనుసంధానం చేసే ప్రక్రియ జరుగుతోందని తెలిపారు.

నోట్ల రద్దుతో కరెన్సీ ఎమర్జెన్సీ

విజయవాడ, డిసెంబర్ 11: పెద్దనోట్ల రద్దుతో పేదోళ్లు, సామాన్యులు ఇంకా కోలుకోలేదని, నెలరోజులు దాటినా బ్యాంకులు, ఏటిఎంల ఎదుట ప్రజలు క్యూలు కడుతున్నారని, కొన్ని సందర్భాల్లో తోపులాట జరగడంతో పలువురికి గాయాలవుతున్నాయని ఎపిపిసిసి చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. తీవ్ర ఒత్తిడికి గురై 100 మందికి పైగా సామాన్యులు, 13 మంది బ్యాంక్ ఉద్యోగుల మృతి చెందారని, దీనికి బాధ్యులు ఎవరని ఆయన ఆదివారం ఇక్కడ ఓ ప్రకటనలో ప్రశ్నించారు. మోదీ నోటు పోటు, చంద్రబాబు డిజిటల్ ఓటుతో జనానికి గుండెపోటు వస్తోందంటూ ఆందోళన వ్యక్తపర్చారు.

ప్రభుత్వాలకు కౌంట్‌డౌన్ మొదలు

కర్నూలు సిటీ, డిసెంబర్ 11 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కౌంట్‌డౌన్ మొదలైందని, ఎక్కువ కాలం ప్రజలు ఓపికతో ఉండలేరని ఖచ్చితంగా తగిన బుద్ధి చెబుతారని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి జోస్యం చెప్పారు. కర్నూలు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం డిసిసి అధ్యక్షుడు లక్ష్మిరెడ్డి అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కోట్ల మాట్లాడుతూ ప్రధాని మోదీ తొందరపాటు నిర్ణయం వల్ల దేశ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. పెద్ద నోట్లను రద్దు చేసినట్లు ప్రకటించిన ప్రధాని మోదీ ముందుగానే నల్లకుబేరులకు సమాచారం ఇచ్చారని ఆరోపించారు.

శ్రీకాకుళం జిల్లాలో గజరాజుల బీభత్సం

హిరమండలం, డిసెంబర్ 11: శ్రీకాకుళం జిల్లాలో కొద్ది రోజులుగా గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా, హిరమండలం మండలంలోని రుగడ గ్రామ పంచాయతీ పరిధిలోని బొమ్మికగూడ గిరిజన గ్రామంలో 13 పూరిళ్లును ధ్వంసం చేశాయి. క్రైస్తవ మందిరాన్ని, పంటలను ధ్వంసం చేశాయి. దీంతో ప్రమాదం అంచుల్లో ఉన్న గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయించారు. బొమ్మికగూడ గిరిజన గ్రామం కొండప్రాంతానికి సమీపంలో ఉంది. ఏనుగుల గుంపు శనివారం రాత్రి ప్రవేశించింది. గ్రామంలోకి ప్రవేశించి సవర సుబాకు, పవిత్ర, అబ్రహాం, ప్రసాద్‌తో పాటు మరో 9 మందికి చెందిన పూరిళ్లను ధ్వంసం చేశాయి.

త్వరలో మున్సిపల్ ఎన్నికలు

కందుకూరు, డిసెంబర్ 11: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగాల్సి ఉన్న పలు కార్పొరేషన్లు, పురపాలక సంఘాలకు త్వరలో ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆదివారం ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని పలు ప్రాంతాలను సందర్శించిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. కోర్టు వివాదాలు, రిజర్వేషన్లు తదితర సమస్యలపై కొన్ని కోర్టు పరిధిలో ఉన్న కారణంగా ఎన్నికలు నిలిచిపోయాయని అన్నారు. తిరుపతి, కాకినాడ, కర్నూలు తదితర ఏడు కార్పొరేషన్లలో కోర్టు వివాదాలు పరిష్కారం అయ్యాయని పేర్కొన్నారు.

Pages