S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వణికిస్తున్న వార్ధా

నెల్లూరు, డిసెంబర్ 11: బంగాళాఖాతంలో ఈనెల 8న అల్పపీడనంగా ఏర్పడి చివరకు పెను తుఫాన్‌గా మారిన వార్ధా తుఫాన్ సోమవారం జిల్లాలోని శ్రీహరికోట, చెన్నై నగరాల మధ్య తీరం దాటనుందనే సమాచారం నేపథ్యంలో జిల్లాలో అధికారులు అప్రమత్తం అయ్యారు. తీరం వెంబడి ఆదివారం రాత్రి నుంచే తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గంటకు 50-60 కిమీ వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉంటోంది. కృష్ణపట్నం ఓడరేవులో 6వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సముద్రంలో వేటకెళ్లిన మత్స్యకారుల వివరాలను అధికారులు ఇప్పటికే సేకరించి, వారిని క్షేమంగా ఒడ్డుకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

నోట్ల రద్దుతో వరి రైతులకు ఇక్కట్లు!

ఆదోనిటౌన్, డిసెంబర్ 11 : ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన పెద్దనోట్లు రద్దు ప్రభావం వరి రైతులపై కూడా పడింది. వరి దాన్యం కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో వరి ధాన్యం క్వింటాల్‌పై రూ. 200 నుంచి రూ. 300ల వరకు ధర తగ్గింది. అంతేకాకుండా కొనేనాథుడే లేకపోవడం అమ్మడానికి మార్కెట్‌లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రభుత్వాలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో పండించిన వరి పంట దిగుబడులకై కోతలు ప్రారంభం అయ్యాయి. నవంబర్ నెల చివరిలో వచ్చిన దిగుబడులకు క్వింటాల్ వరి దాన్యం రూ. 1950 నుంచి రూ.1900ల వరకు ధర పలికిందని రైతులు రామస్వామి, ఈరన్న, తదితరులు పేర్కొన్నారు.

ఉచిత విద్యపై ప్రచారమేగానీ ఆచరణ ఏదీ?

ఖమ్మం(జమ్మిబండ), డిసెంబర్ 11: ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడంలో విద్యనే ప్రధానపాత్ర అని, అయితే తెలంగాణ రాష్ట్ర పాలకులు కెజిటుపిజి ఉచిత విద్య అని చేసిన ప్రచారం ఆచరణలో చూపడంలేదని తెలంగాణ జేఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్‌లు విమర్శించారు. నగరంలో నిర్వహిస్తున్న తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా ప్రథమ మహాసభల్లో ఆదివారం పాల్గొన్న వారు మాట్లాడుతూ విద్యారంగంలో ప్రైవేటు, కార్పొరేట్ విధానాలను ప్రోత్సహించి ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు అవసరమైన నాణ్యమైన విద్యను అందించేందుకు పాలకులపై ఒత్తిడి తేవాలన్నారు.

పల్నాడు ప్రాంతాన్ని దత్తత తీసుకోండి

విజయపురిసౌత్, డిసెంబర్ 11: జిల్లాలో అత్యంత వెనుకబడిన పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, వినుకొండ ప్రాంతాలను దత్తత తీసుకుని అభివృద్ధికి చేయూతనివ్వాలని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తిని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు రాయపాటి సాంబశివరావు కోరారు. ఇన్ఫోసిస్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా జరుగుతున్న అనుపు ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆదివారం సాయంత్రం ఎంపీ రాయపాటి హాజరై ప్రసంగించారు. దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ తమ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రపంచ పర్యాటక కేంద్రమైన అనుపులో ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

‘నగదు రహితం’ ఓ ఫ్లాప్ షో!

కాకినాడ, డిసెంబరు 11: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చిన పిలుపుమేరకు ఆదరాబాదరగా జిల్లా యంత్రాంగం మొదలుపెట్టిన నగదు రహిత అమ్మకాలు జిల్లాలో ప్రహసనంగా మారాయి. ఈ అట్టర్‌ఫ్లాప్ షోను సగటు వినియోగదారుడు విచారంతో గమనిస్తుండగా, వ్యాపారులు నగదు రహిత ప్రక్రియ పేరు చెబితే అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. అక్కడక్కడా ఈ-పోస్ యంత్రాల పనితీరు చూసి వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. సర్వర్లు పనిచేయక కొన్ని, ఇతర సాంకేతిక కారణాలతో మరికొన్ని యంత్రాలు పనిచేయక మొరాయిస్తున్నాయి. దీంతో ఇటు బేరం చూసుకోవాలా? అటు పనిచేయని పనికి మాలిన యంత్రాలను పట్టుకుని ఏడవాలా? అంటూ వర్తకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అంతటా అప్రమత్తం

చిత్తూరు, డిసెంబర్ 11: జిల్లాలో వార్ధా తుఫాన్ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ తుఫాన్ కారణంగా సోమవారం జిల్లాలో కొంతవరకు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ తుఫాన్ పరిస్థితులను పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఎఎస్ అధికారి అయిన రావత్‌ను నియమించింది. అలాగే జిల్లా అధికారులు ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తుండాలని ఆదేశాలు జారీ చేశారు.

రైతుల ఆశలన్నీ వాయుగుండంపైనే..!

కడప,డిసెంబర్ 11: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోతుండడంతో భారీ వర్షాలు వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో బుడ్డశెనగ వేసిన మెట్టప్రాంత రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. వీటితోపాటు జొన్న, కంది, మినుము, పెసర తదితర పంటలు వేసిన రైతులు కూడా ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం నుంచి వాతావరణంలో మార్పు రావడం, మేఘావృతం కావడంతో జిల్లాలో వర్షాలు పడుతాయన్న ఆశలు రైతులను చిగురింపచేస్తున్నాయి.

అంతా అయోమయం

అనంతపురం, డిసెంబర్ 11: పెద్ద నోట్ల రద్దుతో 3నల్ల2దొరలు దర్జాగా ఉంటున్నారు. సామాన్య, మధ్యతరగతి జనం, ఉద్యోగులు, యువత బ్యాంకుల వద్ద, ఎటిఎం కేంద్రాల వద్ద బారులు తీరుతూ నానా అవస్థలు పడుతున్నారు. గత నెల 8న నుంచి ఇప్పటి వరకు పడరాని పాట్లు పడుతున్నారు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో జనం బెంబేలెత్తుతున్నారు. ఆదివారం కూడా ఎటిఎంల వద్ద భారీగా జనం బారులు తీరారు. యథాతథంగా నగరంలోనూ, జిల్లా వ్యాప్తంగానూ ఎటిఎంలు మూతపడ్డాయి. సెలవుల కారణంగా గ్రామీణ, మండల ప్రాంతాల్లో బ్యాంకుల శాఖలు మూతపడటంతో జనం డబ్బు కోసం అవస్థలు పడ్డారు.

ఎన్నికల్లో ప్రకటించిన వాగ్దానాలను అమలు చేయాలి

నార్సింగి, డిసెంబర్ 11: టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతూ రెగ్యులరైజేషన్ పేరుతో నోటీసులు ఇచ్చి పేద, మధ్య తరగతి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని, ప్రజల పక్షాన నిలిచి చర్యలను విరమించుకునే వరకు పోరాటం చేస్తామని బిజెపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవర కరుణాకర్ అన్నారు. గుడిమల్కాపూర్ డివిజన్‌లో శనివారం రాత్రి మెహిని ఫంక్షన్‌హాల్ వద్ద బిజెపి జనసభ నిర్వహించింది.

11ప్రాణాలు మింగిన 5లక్షల లంచం

హైదరాబాద్, డిసెంబర్ 11: పాలకుల అలసత్వం..సంబంధిత ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం..కారణంగా నగరంలో జరుగుతున్న నిర్మాణాల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.
రాష్టస్థ్రాయిలో సంచలనం సృష్టించిన నానక్‌రాంగూడలో పేక మేడలా కూలిన ఏడంతస్తుల అక్రమ నిర్మాణానికి సంబంధించి జిహెచ్‌ఎంసి అధికారులకు ఐదు లక్షల రూపాయల పైగా లంచాలు ముట్టజెప్పినట్టు తెలిసింది. ఈ ఐదు లక్షలే పదకొండు ప్రాణాలను మింగేసింది. భవన యజమాని టి.సత్యనారాయణ సింగ్ అలియాస్ సత్తూ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతుండటంతో అధికారుల అవినీతి బాగోతాలు ఒక్కొక్కటీ వెలుగు చూస్తున్నాయి.

Pages