S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విపక్షాల నోరు నొక్కేస్తున్న తెరాస: రేవంత్

వరంగల్: ఎన్నికల్లో తెరాసను ప్రజలు గెలిపించింది మంచి పాలన అందించడానికే తప్ప విపక్షాల గొంతు నొక్కేయడానికి కాదని టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఆయన శుక్రవారం ఇక్కడ ప్రచారం చేసిన సందర్భంగా మాట్లాడుతూ, తెరాస గెలిచాక తెలంగాణ ప్రజల ఆశలను సిఎం కెసిఆర్ వమ్ము చేస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్ర ప్రాంత కాంట్రాక్టర్లకు ప్రాజెక్టులు కేటాయించి కోట్లాది రూపాయలను కెసిఆర్ దోచిపెడుతున్నారని రేవంత్ అన్నారు.

ఈవిఎంల్లో ట్యాంపరింగ్ అపోహ మాత్రమే

హైదరాబాద్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఇవిఎం)ను ట్యాంపరింగ్ చేస్తున్నారన్నది కేవలం అపోహేనని ఈసిఐఎల్ సిఎండి సుధాకర్ తెలిపారు. వీటి ద్వారా అక్రమాలకు పాల్పడే అవకాశం లేదని ఆయన శుక్రవారం తెలిపారు. తొలిసారిగా తెలంగాణలో ఓటర్లలో భరోసా కల్పించేందుకు ఇవిఎంల ద్వారా రశీదులు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టామన్నారు. 5 లక్షల ఇవిఎంలు కావాలని కేంద్ర ఎన్నికల సంఘం తమను కోరిందని, విదేశాలకు సైతం వీటిని ఎగుమతి చేస్తున్నామన్నారు.

‘ప్రాజెక్టు అనంత’ కోసం కాంగ్రెస్ బైక్ ర్యాలీ

అనంతపురం: జిల్లాలో వ్యవసాయ రంగానికి ఆశాకిరణమైన ‘ప్రాజెక్టు అనంత’ను చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ఎత్తున బైక్ ర్యాలీ ప్రారంభించారు. మడకశిరలో ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి బైక్ ర్యాలీని ప్రారంభించారు. ప్రాజెక్టు అనంతను పూర్తి చేసేలా జిల్లాలోని ప్రజాప్రతినిధులంతా దీక్ష వహించాలని ఆయన పిలుపునిచ్చారు. అన్ని మండలాల నుంచి బైక్ ర్యాలీ అనంతపురానికి చేరుకుంటుందని ఆయన తెలిపారు.

టిఎస్‌పిఎస్‌సి భవన్ ముట్టడికి విద్యార్థుల యత్నం

హైదరాబాద్: గ్రూప్-2 ఉద్యోగాల సంఖ్యను పెంచాలని, ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ బీసీ విద్యార్థులు శుక్రవారం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్సీస్ కమిషన్ భవన్‌ను ముట్టడించేందుకు యత్నించారు. గ్రూప్-2 పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు మూడు నెలల గడువు ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకు యత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.

భీమవరంలో దొంగనోట్ల ముఠా అరెస్టు

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో శుక్రవారం దొంగనోట్ల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాలో అయిదుగురిని అరెస్టు చేసి, లక్షా 20 వేల రూపాయల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

చత్తీస్‌గఢ్‌లో ఇద్దరు జవాన్ల మృతి

రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లోని సుకుమా అటవీ ప్రాంతంలో శుక్రవారం వేకువజామున కూంబింగ్ నిర్వహిస్తున్న సిఆర్‌పిఎఫ్ జవాన్లపై మావోలు ఆకస్మికంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మరణించగా, 14 మంది గాయపడ్డారని తెలిసింది. జవాన్లు, మావోల మధ్య ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.

కేంద్రమంత్రి సుజనాకు సుప్రీంలో నిరాశ

దిల్లీ: మారిషన్ బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకున్న వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ కేంద్రమంత్రి సుజనా చౌదరి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టివేసింది. రుణాలు ఎగవేసిన కంపెనీల వ్యవహారాల్లో తన ప్రమేయం లేదని ఆయన కొంతకాలంగా చెబుతున్నారు. ఇదే కేసులో ఆరునెలల గడువును అయిదునెలలకు కుదిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుజనా చౌదరి సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.

పాలేరు ఎమ్మెల్యే వెంకటరెడ్డి మృతి

ఖమ్మం: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 72 ఏళ్ల వెంకటరెడ్డి అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, వైఎస్, కిరణ్‌కుమార్ రెడ్డి క్యాబినెట్‌ల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన మృతి పట్ల సిఎం కెసిఆర్, వివిధ రాజకీయ పార్టీల నేతలు సంతాపం ప్రకటించారు.

ఆర్టీఏ అధికారి ఇళ్లలో ఎసిబి సోదాలు

హైదరాబాద్: ఇక్కడి రవాణాశాఖలో పరిపాలనాధికారిగా పనిచేస్తున్న నరేందర్ భారీగా అక్రమార్జనకు పాల్పడినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. శుక్రవారం ఉదయం నుంచి అతనికి చెందిన ఆస్తులపై సోదాలు జరుగుతున్నాయి. బోయగూడ, కుర్మగూడ తదితర ప్రాంతాల్లో నరేందర్, అతని బంధువుల ఇళ్లలో సోదాలు ప్రారంభించగా పెద్దఎత్తున స్థిరాస్తులు, నగదు, బంగారు నగలు ఉన్నట్లు గుర్తించారు. కొద్దిరోజుల క్రితం నరేందర్ ఓ వ్యక్తి నుంచి 8 వేల రూపాయలు లంచం తీసుకున్నట్లు గుర్తించి విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత పలు ఆరోపణలు రావడంతో ఎసిబి అధికారులు ఈరోజు సోదాలు ప్రారంభించారు.

భీంగల్‌లో మావోల పోస్టర్ల కలకలం

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా భీంగల్‌లోని మండల పరిషత్ కార్యాలయంపై గోడలపై మావోయిస్టుల పేరిట పోస్టర్లు వెలిశాయి. గురువారం అర్ధరాత్రి వీటిని అంటించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ బూటకమని మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు జగన్ పేరిట ఈ పోస్టర్లు వెలిశాయి. బూటకపు ఎన్‌కౌంటర్లకు పాలకులు మూల్యం చెల్లించక తప్పదని మావోలు హెచ్చరించారు.

Pages