S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నగదు రహిత గ్రామానికి వెంకయ్య కితాబు

హైదరాబాద్, డిసెంబర్ 11:దేశంలో రెండవ నగదు రహిత గ్రామం ఇబ్రహీంపూర్ గ్రామం నిలిచినందుకు కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు ట్విట్టర్‌లో అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్ గ్రామం దేశంలో రెండవ నగదు రహిత గ్రామంగా నిలిచిందని తెలిపారు. వెంకయ్యనాయుడు ట్విట్టర్ అభినందనలకు నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలుపుతూ రీ ట్విట్ చేశారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రోత్సాహంతో సిద్దిపేట నియోజక వర్గం మొత్తాన్ని త్వరలోనే నగదు రహిత నియోజక వర్గంగా అభివృద్ధి చేయనున్నట్టు హరీశ్‌రావు తెలిపారు.

జాతీయ స్థాయికి పోర్టు వ్యతిరేకోద్యమం

మచిలీపట్నం, డిసెంబర్ 11: బందరు పోర్టు భూసేకరణ వ్యతిరేక ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళతానని రాజ్యసభ సభ్యుడు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు చెప్పారు. కృష్ణా జిల్లా బందరు మండలంలోని పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో ఆదివారం పర్యటించిన ఆయన పోర్టు పేరుతో జరుగుతున్న ప్రభుత్వ భూదోపిడీని ఎదుర్కొని రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. త్వరలోనే ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ, వామపక్షాలకు చెందిన జాతీయ స్థాయి నాయకులతో బందరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తామన్నారు.

బడాబాబులపై ముప్పేట దాడి

హైదరాబాద్, డిసెంబర్ 11: మరో 17 రోజుల్లో రద్దయిన పెద్ద నోట్ల డిపాజిట్ చేసేందుకు గడువు ముగియనున్న నేపథ్యంలో, ఈ వ్యవహారంలో వెలుగుచూస్తున్న అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేందుకు ఆదాయ పన్ను శాఖ సిద్ధమవుతోంది. అసాధారణమైన బ్యాం కింగ్ లావాదేవీలు, డిపాజిట్లుపైన కాకుండా,కొత్త కరెన్సీని సమకూర్చుకున్న వారిపై దాడులు తీవ్రతరం చేయాలని నిర్ణయించింది. ఈమేరకు కేంద్ర ఆదాయం పన్ను శాఖ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆదాయపు పన్ను శాఖ ముఖ్య అధికారులకు ఆదేశాలు వచ్చాయి. దర్యాప్తును ముమ్మరం చేసేందుకు ఐటి శాఖలోని ఇన్విస్టిగేషన్ విభాగానికి ఇతర విభాగాల నుండి డిప్యుటేషన్‌పై సిబ్బందిని నియమిస్తున్నారు.

జనాభా దామాషా ప్రకారమే రిజర్వేషన్ ఫలాలు అందాలి

న్యూఢిల్లీ,డిసెంబర్ 11: దేశంలో సంపద, అవకాశాలు, ఉద్యోగాలు జనాభా దామాషా ప్రకారం పంపిణీ జరగాలని, దానికి వర్గీకరణే మార్గమని ఎమ్మర్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆదివారం నాడు కేంద్ర సామాజిక న్యాయ,సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథావలేతో అయన కార్యాలయంలో మందకృష్ణ సమావేశం అయ్యారు. బిఆర్ అంబేద్కర్‌కు ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన విధానం ఆనాడే ఉన్నదని, వర్గీకరణ జరగాలన్న కోణంలో అనేక సందర్భాలలో ప్రస్తావించారని మందకృష్ణ కేంద్రమంత్రికి వివరించారు.

కోహినూర్ వజ్రం జయలలిత

చెన్నై, డిసెంబర్ 11: పురుషాధిక్య సమాజంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని తనదైన శైలిలో రాణించిన కోహినూర్ వజ్రంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను సూపర్ స్టార్ రజనీకాంత్ అభివర్ణించారు. సుదీర్ఘ అస్వస్థత అనంతరం ఇటీవల మరణించిన జయలలిత, చో రామాస్వామిలకు నివాళులర్పించేందుకు ఆదివారం దక్షిణ భారత కళాకారుల సంఘం సంస్మరణ కార్యక్రమం నిర్వహించింది. 1996 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాను చేసిన కొన్ని ప్రకటనలు జయలలితకు తీవ్ర మనస్తాపం కలిగించాయని రజనీ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తాను తీసుకున్న నిర్ణయం వల్లే జయ సారథ్యంలోని అన్నాడిఎంకె ఓడిపోయిందన్నారు.

కాశ్మీర్‌లో తొలిసారిగా నక్సల్స్ తరహా ఐఇడి దాడి

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: కాశ్మీర్ లోయలో దశాబ్దాలుగా సాగుతున్న తీవ్రవాద హింసాకాండలో మొట్టమొదటిసారిగా భద్రతా దళాలపై నక్సల్స్ తరహా ఐఇడి (మందుపాతర) పేలుడు జరగడంతో నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో వందలాది ప్రాణాలను బలిగొన్న ఇలాంటి మందుపాతరలను ఎలా ఎదుర్కోవాలో తెలియక అక్కడి భద్రతా దళాలు కొట్టుమిట్టాడుతున్నాయి.

నేటి నుంచి ద.మ.రైల్వే సిబ్బంది నిరశన

హైదరాబాద్, డిసెంబర్ 11: దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 12 నుంచి 16 వరకు దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది నిరశన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు కార్మిక సంఘం తెలిపింది. రైల్వే సిబ్బందికి కొత్త ఇపిఎఫ్ కాకుండా పాత ఇపిఎఫ్‌నే కొనసాగించాలని, రైల్వే శాఖలోని ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని, సీనియార్టీ ప్రకారం పదోన్నతులు, వేతన సవరణలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘ్ ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు నిరశన కార్యక్రమాలు కొనసాగుతాయని కార్మిక సంఘ్ తెలిపింది.
ఇంధన పొదుపులో జాతీయ పురస్కారాలు

అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంలో ప్రభుత్వ సంస్థలు భాగస్వాములు కావాలి

విజయవాడ, డిసెంబర్ 11: అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు భాగస్వాములై ప్రతినెలా కనీసం వెయ్యి నుంచి రెండు వేల కోట్ల ఆస్తులను వేలం వేయించడం ద్వారా బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలని బాధితుల సంఘం గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేసారు. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాస్తున్నామని తెలిపారు. దాసరి నాగభూషణరావు భవన్‌లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధితులకు సత్వర న్యాయం చేకూర్చి ఆత్మహత్యలు నిరోధించాలని గతంలోనే 10 డిమాండ్లతో ముఖ్యమంత్రికి వినతిపత్రం అందించామన్నారు.

విద్యార్థుల ఘాతుకం

కెపిహెచ్‌బి కాలనీ, డిసెంబర్ 11: రోడ్డు ప్రమాదం కేసులో ఇటీవల రాష్ట్రాన్ని కుదిపేసిన పంజగుట్టలో రమ్య, పెద్దఅంబర్‌పేటలో తల్లీ,కూతుళ్లు శ్రీదేవి, సంజన ఘటనలను మరవకముందే కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలోని బాచుపల్లిలో ఆదివారం మరో దారుణం చోటుచేసుకుంది. పదోతరగతి చదువుతున్న విద్యార్థులు స్కార్పియో నడుపుతూ ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. ఈ సంఘటన కూకట్‌పల్లి, ప్రగతినగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. మైనర్ విద్యార్థుల ఘాతుకానికి ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిలో ఓ మహిళ పరిస్తితి విషమంగా ఉంది.

16 లక్షల రూపాయల కొత్త నోట్ల పట్టివేత

రామాయంపేట, డిసెంబర్ 11: మెదక్ జిల్లా రామాయంపేట పోలీసులు ఆదివారం రూ.16 లక్షల కొత్త నోట్లను పట్టుకున్నారు. బాసం శ్రీనివాస్, రాజు అనే వ్యక్తులు కారులో కొత్త నోట్లను తరలిస్తున్నారన్న సమాచారం మేరకు గొల్పర్తి రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేసి ఈ సొమ్మును పట్టుకున్నామని ఎస్‌ఐ నాగార్జున గౌడ్ తెలిపారు. పట్టుబడిన సొమ్ములో రూ.15.90 లక్షల రెండువేల కొత్త నోట్లు, మరో రూ.10 వేల వంద రూపాయల నోట్లు ఉన్నాయన్నారు.

Pages