S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గవర్నర్‌ను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ను శనివారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలిశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రి సుజనాచౌదరి కూడా ఉన్నారు.

ఇంకో దారి ఉందా అమ్మా?

భగత్‌సింగ్- 4
=========
ఇరవయ్యో శతాబ్దం మొదటి దశకం. బెంగాల్ విభజన, స్వదేశీ ఉద్యమాల దరిమిలా దేశంలో రాజకీయ ఉష్ణోగ్రత బాగా పెరిగింది. అప్పటికింకా గాంధీగారు దక్షిణాఫ్రికా వదిలి ఇండియాకు మరలి రాలేదు. తెల్లవారి సామ్రాజ్య ప్రయోజనాలకు తగ్గట్టుగా, వారి దొరతనానికి ఇంచుక ఇబ్బంది కలగని విధంగా కాంగ్రెసు ముసుగులో బ్రిటిషు రాజభక్తులు జాతీయోద్యమాన్ని లోపలి నుంచి నీరుగార్చే మహిమాన్విత కార్యక్రమం ఇంకా మొదలుకాలేదు. విప్లవ జ్వాలలు దేశమంతటా విస్తరించాయి. తెల్లవాడి పీచమణచి స్వాతంత్య్రాన్ని పోరాడి సాధించటానికి దేశవాసులు ఉద్యుక్తులయ్యారు.

ఎం.వి.ఆర్. శాస్త్రి

ఎలావుందీ వారం?

మేషం (ఏప్రిల్ 15 - మే 14)
సమాజంలో జరిగే మార్పులను గమనిస్తూ తగిన రీతిలో మీ వ్యవహారాలను మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఆధిపత్యం కోసం కాక సమానత్వం కోసం కృషి చేస్తే అధిక ఫలితాలు పొందగలరు. భట్రాజులను పక్కనపెట్టి క్రియాశీలక విషయాలు, కార్యక్రమాల పట్ల దృష్టి నిలపడం శ్రేయస్కరం. కుటుంబ విషయాలు ఆందోళన కలిగించేవిగా వున్నా అది తాత్కాలికమే. సమ్మేళనాలు, సంబరాలలో ఆత్మీయులతో కలిసి పాలుపంచుకుంటారు. ధన లోపం ఉండదు.

ఎస్.రవిప్రకాశ్

పజిల్ 551

ఆధారాలు
అడ్డం

-నిశాపతి

మరో మనిషి రోబో

ఆదిమానవుడు ఆధునిక మనిషిగా మారాడు. విలాసం కోసం, వినోదం కోసం ఎన్నో మార్గాలను వెతుకుతున్నాడు. తమ అవసరాలు తీర్చుకోవడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. కూర్చున్న చోటు నుండి కదలకుండా అన్ని పనులూ జరిగిపోయేలా యాంత్రిక జీవనానికి అలవాటుపడుతున్నాడు. అలాంటి జీవితానికి దోహదం చేసే యంత్రాలే రోబోలు.నిన్నటి వరకూ రోబోలను మర మనుషులు అని చెప్పినా, నేడు ఆధునిక కాలంలో మనిషి కోరుకుంటున్నవన్నీ చేసిపెట్టే మరో మనిషి రోబో. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఇందుకు దోహదం చేయబోతోంది.

-బి.వి.ప్రసాద్

ది హిచ్ హైకర్

అమెరికాలోని హైవే పక్కన నిలబడి థంప్స్ అప్ సైన్‌ని చూపించిన ఓ మధ్య వయస్కుడిని చూసి ఓ కారు ఆగింది. అతను ఎక్కాక ఆ కారు బయల్దేరింది. రివాల్వర్‌ని చూపించి అతను ఆ కారుని రోడ్డు పక్కన ఆపించి దిగాడు. రివాల్వర్ పేలగానే డ్రైవర్ కెవ్వున కేక వేసింది. ఆమె హేండ్‌బేగ్ తీసుకుని అతను వెళ్లిపోయాడు. ఇది పేపర్లో వార్తగా వచ్చింది. రెండు రోజుల తర్వాత అలాంటి మరో సంఘటన తాలూకు వార్త కూడా వచ్చింది.
* * *
అదే హైవేలో కారు డ్రైవ్ చేసే రాయ్‌తో అతని మిత్రుడు గిల్బర్ట్ చెప్పాడు.
‘వచ్చే చౌరస్తాలో ఎడమవైపు తిప్పు’

మల్లాది వెంకట కృష్ణమూర్తి

దుఃఖాశ్రువుల ఆనందబాష్పాలు

‘మనం పుడుతూ ఏడుస్తాం.. మరణిస్తూ ఏడిపిస్తాం.. ఈ జనన మరణాల మధ్యకాలంలో జీవితమంతా భావోద్రేకాల భారమే’ అన్నాను చైతన్యతో.
నేను నోరు విప్పింది చైతన్య కోసమే అయినా ఆతృతగా ప్రశ్నించటం ధర్మారావు నైజం. అది పుట్టుకతో వచ్చింది కాబట్టి మధ్యలో పొమ్మన్నా అంత సులభంగా పోదు. అందుకే ‘మనం ఎంత యోగం చేసుకుంటున్నా మానవ జీవితాన్ని విషాదయోగం క్రిందే పరిగణించాలా?’ అన్నాడు.
‘జీవితానికైనా, జీవనయోగానికైనా విషాదం నేపథ్యమే తప్ప అదే సర్వం కాదు’ నా జవాబు.
‘అంటే విషాదాన్ని అనుభూతిస్తే తప్ప ఆత్మజ్ఞానం సాధ్యం కాదంటారా?’ చైతన్య ప్రశ్న.

-డా.వాసిలి వసంతకుమార్ 93939 33946

విజయం సాధించేందుకు అనుసరించాల్సిన విధానాలు

జీవితంలో అద్భుతాలు సాధించాలంటే ‘టైమ్ మేనేజ్‌మెంట్’ నైపుణ్యం ఎంతో అవసరం. మీరు ఎంచుకున్న రంగంలో మీ గమ్యాన్ని చేరుకునేందుకు సహకరించే ఉత్పత్తి చర్యలను అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. టైమ్ అంటే టైమే. సమయాన్ని ఎవ్వరూ ఆపలేరు. లేదా సమయాన్ని కూడా పెంచలేరు. ఉన్న సమయాన్ని వృధా చేసుకోకుండా చాకచక్యంగా సద్వినియోగం చేసుకోవాలి.
మనిషికి ఎదురయ్యే సవాల్ టైమ్ మేనేజ్‌మెంట్‌కన్నా తనను తాను మేనేజ్ చేసుకోవడమే. ఎందుకు పని చేయలేకపోతున్నారో కారణాలు, క్షమాపణలు చెప్పుకున్నంత సేపు మీరు ఏ పని జయప్రదంగా పూర్తి చేయలేరు.

-సి.వి.సర్వేశ్వరశర్మ

కాశీ అను వారణాసి

పెళ్ళిళ్ళలో ఒక తంతు జరుగుతుంది. స్నాతకం అని ఒక కార్యక్రమాన్ని జరిపి, బ్రహ్మచారికి గోచీ పెట్టి ధోవతీ కట్టిస్తారు. దారి బత్తెం, పుస్తకాలు, గొడుగు పుచ్చుకుని అతను ఇక కాశీకి వెళతానని బయలుదేరతాడు. కాబోయే బావమరిది అడ్డం వచ్చి మా ఇంటి అల్లుడివి కావయ్యా అని అడుక్కుని పెళ్లిపీటల మీదకు తీసుకుపోతాడు. స్నాతకానికి, పెళ్లికి సంబంధం లేదు. యూనివర్సిటీల్లో జరిగే పట్టా ప్రదాన ఉత్సవాన్ని స్నాతకం అంటారు. మాస్టర్ చదువును స్నాతకోత్తరం అంటారు. మొదటి స్థాయి చదువును బ్యాచిలర్స్ అంటే, బ్రహ్మచారి స్థాయి అంటారు. అది జరిగిన తరువాత విద్యార్థికి గుర్తింపు, ముందు దారి దొరుకుతుంది. పాత కాలంలో పై చదువు అంటే, కాశీ వెళ్లడమే.

కె.బి. గోపాలం

సుశీలమ్మగారి వీలునామా

‘‘ఏవండీ! మీ నాన్నగారికి ఈ వయసులో అంత పంతం, పట్టింపు ఎందుకు? సంసారం అన్న తరవాత కుటుంబంలో నలుగురు ఆడవాళ్లు ఒకచోట చేరితే కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు పంచుకుంటారు. అవన్నీ వెంటనే వదిలేస్తారు. వారి మాటలు విని వాటినే పట్టుకుని శపధాలు చేయడం, మనుషుల మీద ద్వేషాలు పగలు పెంచుకోవడం ఏం బాగుంటుంది చెప్పండి. ఇంతకీ మావయ్య గారి కోపం, ఎవరిమీద? కొడుకుమీదా? కోడలి మీదా? లేక మనవల మీదా? అంది సునీత.

-రావి ఎస్.అవధాని

Pages