S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మయ్య .. వచ్చేశాం!

ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుని, అక్కడి నుంచి సికిందరాబాద్ రైల్వే స్టేషన్, శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బస్సుల్లో చైన్నై వరద బాధితులు తరలివెళ్లారు.

తెదేపాకు ‘సాయన్న’షాక్

సికింద్రాబాద్, డిసెంబర్ 3: తెలుగుదేశం పార్టీకి కంటోనె్మంట్ ఎమ్మెల్యే సాయన్న షాక్ ఇచ్చారు. గురువారం సిఎం క్యాంపు కార్యాలయంలో కెసిఆర్‌ను కలిసిన అనంతరం బయటికి వచ్చి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధికి టిడిపిని వీడి తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి నమ్మిన బంటుగా ఉన్న సాయన్నకు తెలంగాణ నుంచి టిటిడి బోర్డు మెంబర్‌గా చంద్రబాబునాయుడు నియమించారు. కంటోనె్మంట్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సాయన్న.. పార్టీ మారుతారని ఎవరు ఊహించలేకపోయారు.

శతచండీయాగంలో ముఖ్యమంత్రి దంపతులు

ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 3: ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఎలిమినేడులోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న శతచండీయాగంలో ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం ఉదయం 11 గంటలకు ఎలిమినేడుకు చేరుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శతచండీయాగంలో భాగంగా నిర్వహించిన పూర్ణాహుతిలో పాల్గొన్నారు. యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి వేదిక వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పండ్లు, పుష్పాలు సమర్పించారు. యాగంలో పాల్గొని పీఠాధిపతులు, వేద పండితులతో శతచండీయాగం నిర్వాహణపై చర్చించారు.

ఎస్సీ వర్గీకరణ చేయాలని ఢిల్లీకి వెళ్లడం హాస్యాస్పదం

ఖైరతాబాద్, డిసెంబర్ 3: ఎస్సీ వర్గీకరణ చేయాలని తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లడం హాస్యాస్పదమని మాల సంఘాల నాయకులు అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాలసంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్, మాల మహాసభ అధ్యక్షుడు దయానంద్ మాట్లాడుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, జాతీయ ఎస్సీ కమిషన్ వ్యతిరేకించిన ఎస్సీ వర్గీకరణను చేస్తామని తెలంగాణ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి ఆధ్వర్యంలో మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని కలిస్తే సాధ్యం కాదంటూ ఖరాఖండిగా చెప్పడం ఆనందించదగ్గ విషయమని అన్నారు.

రోడ్లపై నదిలా ప్రవహించిన గోదావరి జలాలు

జీడిమెట్ల, డిసెంబర్ 3: బస్తీలలోని రోడ్లపై ఓ నదిలా గోదావరి జలాలు పుష్కలంగా ప్రవహించాయి. జగద్గిరిగుట్ట జలమండలి కార్యాలయం నుండి నేరుగా రోడ్ల పైకి గోదావరి జలాలు ప్రవహించాయి. వీధులలో, రోడ్లపై నీరంతా వృథాగా ప్రవహించడంతో ప్రజలంతా ఆశ్చర్యానికి గురయ్యారు. గత 20 రోజుల నుండి నీటి సరఫరా లేకపోవడంతో బస్తీలలో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో ఒక్కసారిగా నీరంతా రోడ్లపై ప్రవహించడంతో అవాక్కయ్యారు. అసలే నీళ్లందకు ప్రజలు బోర్‌లను, ఇతరత్రా కొనుగోలు చేసుకుని వాడుకుంటుంటే రోడ్లపై నదిలా గోదావరి ప్రవహించడం అందరిని కలచివేసింది.

ఫీజుల బకాయిలు చెల్లించాలని భారీ ప్రదర్శన

ముషీరాబాద్, డిసెంబర్ 3: తెలంగాణ రాష్ట్ర ఫ్రభుత్వానికి విద్యార్ధుల ఫీజుల బకాయిలు చెల్లించటానికి రూ.1600 కోట్లు లేవు కాని, కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి మాత్రం 42 వేల కోట్లు ఎలా వచ్చాయని జాతీయ బిసి సంక్షేమ సంఘం ఆధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. గత సంవత్సర ఫీజుల రియింబర్సమెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద బిసి విద్యార్ధి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బిసి వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pages