S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోహ్లీ ‘డబుల్’.. జయంత్ సెంచరీ

ముంబయి, డిసెంబర్ 11: విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీతో కదంతొక్కితే, జట్టులోకి కొత్తగా వచ్చిన ఆల్‌రౌండర్ జయంత్ యాదవ్ శతకాన్ని నమోదు చేశాడు. అంతకు ముందు, మ్యాచ్ మూడోరోజు ఆటలో మురళీ విజయ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ముగ్గురు బ్యాట్స్‌మెన్ అద్వితీయ ప్రతిభ కనబరచడంతో, ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగు రోజు ఆటలో భారత్ 631 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది. దీనితో 231 పరుగులు వెనుకబడిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించి, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 182 పరుగులు చేయగలిగింది. ఈ జట్టు ఇంకా 49 పరుగులు వెనుకబడిగా, నాలుగు వికెట్లు చేతిలో ఉన్నాయి.

స్కోరుబోర్డు

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: 130.1 ఓవర్లలో 400 ఆలౌట్ (అలస్టర్ కుక్ 46, కీటన్ జెన్నింగ్స్ 112, మోయిన్ అలీ 50, జొస్ బట్లర్ 76, అశ్విన్ 6/112, రవీంద్ర జడేజా 4/109).

కెప్టెన్‌గా ‘ట్రిపుల్’!

ముంబయి: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్, నాలుగో రోజు ఆటలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ నమోదు చేయడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్‌గా అతనికి ఇది మూడో డబుల్ సెంచరీ. మూడు పర్యాయాలు డబుల్ సెంచరీలు చేసిన తొలి భారతీయ కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. జో రూట్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, కేన్ విలియమ్‌సన్ తదితరులు ప్రేక్షక పాత్ర వహిస్తే, ప్రపంచ మేటి బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ తనను తాను నిరూపించుకుంటున్నాడు. అతను ఈ ఏడాదే మూడు డబుల్ సెంచరీలు చేయడం విశేషం.

ఓ సెంచరీ.. ఓ డకౌట్..

ముంబయ: ఈ మ్యాచ్‌తోనే తన టెస్టు క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించిన ఇంగ్లాండ్ ఓపెనర్ కీటన్ జెన్నింగ్స్ మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి, రెండో ఇన్నింగ్స్‌లో సున్నాకే వెనుదిరిగాడు. ఈ విధంగా తమతమ మొదటి ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి, మరో ఇన్నింగ్స్‌లో డకౌటైన నాలుగో బ్యాట్స్‌మన్‌గా అతని పేరు రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. చివరిసారి, 20 ఏళ్ల క్రితం న్యూజిలాండ్ టెస్టుతో కెరీర్‌లో ఆరంభించిన పాకిస్తాన్ ఆటగాడు మహమ్మద్ వసీం కూడా ఇదే విధంగా సెంచరీ చేసి, ఆతర్వాత డకౌటయ్యాడు.

చిత్రం..కీటన్ జెన్నింగ్స్

షమీ, సాహా అన్‌ఫిట్

ముంబయి, డిసెంబర్ 11: భారత క్రికెట్ జట్టును గాయాల సమస్య వేధిస్తున్నది. ఆజింక్య రహానే ఇంగ్లాండ్‌తో జరుతున్న టెస్టు సిరీస్‌తోపాటు, ఆతర్వాత జరిగే వనే్డ, టి-20 సిరీస్‌లకు కూడా గాయం కారణంగా అందుబాటులో ఉండడం లేదు. తాజాగా ఈ జాబితాలో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ, వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా చేరారు. గాయాలతో బాధపడుతున్న వీరిద్దరూ నాలుగో టెస్టులో ఆడలేకపోయిన విషయం తెలిసిందే. కాగా, చెన్నైలో జరిగే చివరిదైన ఐదో టెస్టుకు కూడా వీరు దూరమయ్యారు.

సైనా అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు

స్పోర్ట్స్ ఫర్ ఆల్ (ఎస్‌ఎఫ్‌ఎ) ఆధ్వర్యంలో ఆదివారం ముంబయిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని, అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తున్న భారత బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్

పతకాన్ని ఖాయం చేసుకున్నశివ థాపా

గౌహతిలో జరుగుతున్న జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్
60 కిలోల విభాగం క్వార్టర్ ఫైనల్లో అశోక్‌ను ఓడించి
సెమీస్ చేరడం ద్వారా పతకాన్ని ఖాయం చేసుకున్న ఒలింపియన్ శివ థాపా (ఎడమ)

హ్యాట్రిక్ విజయంపై భారత్ కన్ను

లక్నో, డిసెంబర్ 11: జూనియర్ హాకీ ప్రపంచ కప్‌లో భారత్ హ్యాట్రిక్ విజయాలపై కనే్నసింది. మొదటి మ్యాచ్‌లో కెనడాను 5-0 తేడాతో చిత్తుచేసిన హర్జీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు రెండో మ్యాచ్‌లో పటిష్టమైన ఇంగ్లాండ్‌పై 5-3 ఆధిక్యంతో విజయం సాధించింది. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్‌లో స్థానాన్ని ఖాయం చేసుకున్న భారత్ సోమవారం దక్షిణాఫ్రికాతో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నది. అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా కనిపిస్తున్నప్పటికీ, దక్షిణాఫ్రికా ప్రపంచ మేటి జట్లలో ఒకటి కావడంతో పోరు తీవ్ర స్థాయిలో ఉండనుంది.

మెస్సీ మెరుపులు

మాడ్రిడ్, డిసెంబర్ 11: స్పానిష్ సాకర్ లీగ్ లా లిగా టోర్నమెంట్‌లో భాగంగా ఒసాసునాతో జరిగిన మ్యాచ్‌లో బార్సిలోనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ చెలరేగిపోయాడు. చివరి వరకూ వ్యూహాత్మక డిఫెన్స్‌తో సరిపుచ్చిన బార్సిలోనా మ్యాచ్ ముగింపు దశకు చేరుకున్నప్పుడు దాడులకు ఉపక్రమించింది. మెస్సీ రెండు మెరుపు గోల్స్ చేయగా, లూయిస్ సౌరెజ్ ఒక గోల్ చేశాడు. ఒసాసునా ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. కాగా, మరో మ్యాచ్‌లో రియల్ మాడ్రిడ్ 3-2 ఆధిక్యంతో డిపోర్టివో లా కొరునాను ఓడించింది. రియల్ సోసియాడ్ కూడా అదే ఆధిక్యంతో వలెన్షియాపై విజయం సాధించింది. లాస్ పల్మాస్, లెగానెస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది.

నత్తనడక దర్యాప్తు

అగస్టా వెస్ట్‌లాండ్ అవినీతి వ్యవహారంలో మన వైమానిక దళం మాజీ అధిపతి ఎస్‌పి త్యాగిని ‘కేంద్ర నేర పరిశోధక విభాగం’-సిబిఐ- వారు శుక్రవారం అరెస్టు చేయడం ఆశ్చర్యకరం కాదు. త్యాగి ఇన్నాళ్లు అరెస్టు కాకపోవడమే విస్మయకరం. ఎందుకంటె, ఈ అవినీతి ఉదంతం బట్టబయలయిపోయి నాలుగేళ్లయింది. లంచాలను గతికిన వారిలో త్యాగి, ఆయన సన్నిహిత బంధువులు ఉన్నట్టు అప్పటి నుంచి ఆరోపణలుఉన్నాయి. అయినప్పటికీ త్యాగి కి వ్యతిరేకంగా ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరించడానికి ఆయనను నిర్బంధించడానికి ఇన్ని సంవత్సరాలు పట్టడం నత్తల నడకతో పోటీపడుతున్న న్యాయ ప్రక్రియకు నిదర్శనం.

Pages