S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదుగో ‘ఇ’లోకం! మనదే ఆ నేస్తం!

నెల్లాళ్లు క్యాష్‌లెస్‌గా, రెస్ట్‌లెస్‌గా అదేదో మరో లోకంలో సాగుతున్నట్లు గడిచిపోయాయి. ‘నమో’నల్లధనం వేట- సామాన్య ‘జనం’ తెల్లధనంకోసం వెంపర్లాట బ్యాంకు నుంచి బ్యాంకుకి- ఏ.టి.ఎమ్.నుంచి ఏ.టి.ఎమ్.కీ వేట- ప్రతిపక్షాలకి కంఠశోష- పైగా ‘బ్లాక్‌డే’పాటించి గజగజ వణికించే చలిలో- తెల్లని పొగమంచు బురఖాలో ఐకమత్యంగా నిలబడి పాడిన నిరసన పాటల- యొక్క ఫలితం లేని ‘ఇరకాటం’గా గడిచిపోయింది.

- వీరాజీ

డెబిట్ కార్డులతో కష్టాలు

పెద్దనోట్ల రద్దు తరువాత డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేయాలన్న ప్రచారం విస్తృతమైంది. కానీ మన వ్యవస్థలో అది అంత సులువుకాదు. బ్యాంకు అకౌంట్లు లేని ప్రజల సంఖ్య తక్కువేమీ కాదు. డెబిట్, క్రెడిట్ కార్డులతో చిల్లర మార్కెట్లు, కూరగాయల మార్కెట్లలో చెల్లింపులకు తగిన ఏర్పాట్లు కూడా సరిగా లేవు. అది ఆచరణలో కష్టమే. చిన్నచిన్న లావాదేవీలకు సంబంధించి బ్యాంకు అకౌంట్లను అప్‌డేట్ చేయించడం తలనొప్పి వ్యవహారమే. ఎటిఎంలు, బ్యాంకుల చుట్టూ తిరగడం చిర్రెత్తిస్తుంది. ప్రజలకు చక్కటి అవగాహన కల్పించడం, విద్యావంతులను చేయడం ఇప్పుడు ముఖ్యం. ఆ తరువాతే కాష్‌లెస్ విధానాల అమలు సాధ్యం.

ఉద్యమంగా విద్యుత్ పొదుపు

ప్రపంచంలో విద్యుత్ అవసరాలు పెరిగిపోయాయి. విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే వనరులను మనం అత్యంత వేగంగా వాడేస్తున్నాం. కానీ ఆ వనరులు తయారీకి కోట్లాది సంవత్సరాల సమయం పడుతుంది. విచ్చలవిడిగా విద్యుచ్ఛక్తి వినియోగించడం వల్ల భవిష్యత్ అవసరాలకు కొరత ఏర్పడబోతోంది. కోట్లాది సంవత్సరాల కాలంలో తయారైన బొగ్గు, ఇతర ప్రకృతి ప్రసాదించిన వనరులను మనం విచ్చలవిడిగా వాడి విద్యుచ్ఛక్తిని తయారు చేసుకుంటున్నాం. అవసరం ఉన్నా లేకపోయినా వాడి వృధా చేస్తున్నాం.

-కృష్ణతేజ

తాయిలాలు.. తమిళ రాజకీయాలు!

ఇందిరాగాంధీ తర్వాత దేశంలో, అందునా దక్షిణాదినుంచి మరో మహిళా ప్రధానిగా అయ్యే అర్హత జయలలితకే వుందంటూ మూడు దశాబ్దాల క్రితం అప్పటి ‘ఆన్ లుకర్’ అనే ఆంగ్ల పత్రిక ఓ కథనాన్ని రాసింది. నేడు కూడా అలాంటి కథనాలకు తలూపే జనాలున్న దేశం మనది. వర్ధమాన నటిగా, రాజకీయ శక్తిగా ఎదుగుతున్న, ఎదిగిన కాలంలో జయలలిత ఇందిర లాగానే రాజకీయ అభిశంసనను, కోర్టు కేసుల్ని కూడా ఎదుర్కోవడం గమనార్హం!

- జి.లచ్చయ్య సెల్: 94401 16162

దృశ్యాదృశ్యాలు

కొండ కోసం ఎర్రని దొక పువ్వు
మంచు మీద మణి కార్ముకాన్ని వంచి
తోట బాట మీద తొడిమ నీడలల్లుతుంది
ఆత్మని మరంద స్నానం చేయించిన అవని
నిజానికి నొగులు వోని ప్రాచీ సుమం
తరాల తావి గనులతో తనరారుతుంది
తడబడి ఏ బిందువు ఎందుకు జారిందో
తెమలని మునుకల బడి-ఈ
తరగని వాగులా ఈదుతునే ఉంది
జీవకాంతి శబల మనోహరమై
ఏ ప్రాచీమేచకంలో ఎడతెగదో-అక్కడ
ఉనికి సంకేతంగా
ఊపిరి గాలుల ఉయ్యాలలూగుతుంది
తలపు గుంపుల జీవితం
నిద్రాబల పరాజిత అయినప్పుడే-కల
గాయాలను మాన్పుతుంది
తోటలో విచ్చిన విరజాజి
పరిమళాల నాజూకుని

- పి.ప్రమీలారాణి, 9951038136

కేరింత

వానకి వయసు మళ్లింది, ఓపిక తగ్గింది
ముసలి నసలా చినుకుల్ని రాలుస్తోంది
వాకిలిముందు పారుతూ పిల్ల కాలువలు
సిరలు, ధమనుల్లా సాగిసాగి
క్రమంగా సనసన్నని నాళాలవుతున్నాయి
కాలువలో ముందు వేగంగా
అంతలో నిదానంగా-పడవలు, కత్తిపడవలు
వాటి వేగానికి చోదక శక్తినివ్వాలని
ఒకటేకేరింతలు, త్రుళ్లింతలు, కవ్వింపులు-
పిల్లకాయలు!
కత్తిపడవ కాలికి అడ్డంపడి
పయనాన్ని అడ్డుకుంది-పుల్ల
ఎగురుతూ చేయిసాచి, తీసి
తన ‘వస్తువు’ని తాను అందుకుంది పాప
ఇప్పుడది రూపం కోల్పోయిన పడవ!
ఇటు చివికిన పుల్ల చిట్లి చెదిరింది

- విహారి, 9848025600

ప్రార్థన

కొన్ని నగరాలు ఎప్పుడూ నిద్రపోవు
కొన్ని బతుకులకు ఎప్పుడూ నిద్ర లేనట్టుగా..
కునుకుపాట్లు పడే రాత్రులలో కూడా
కొన్ని రహదార్లు మేల్కొన్నట్టే
కొన్ని స్వప్నాలూ ఎప్పుడూ నిద్రపోవు
మువ్వలు లేకుండానే సవ్వడి చేసే
పాదాలు ఎనె్నన్నో ముంగిళ్లను
చుట్టబెడుతూ ఉంటాయ
కొన్ని ఉదయాలూ
ఎప్పుడూ అస్తమించవు
అంతరంగ ఆనంద సుమాలు
వికసించిన పూలకుండీలలో
ఏ కిరణమూ వచ్చి వాలదు
ఇన్ని సజీవ సత్యాల నడుమ
స్వయంగా జీవించి ఉండటం
ఎదగటం, రక్షింపబడే ప్రార్థన
తమాషా కాదు కదా!
- హిందీ మూలం: వర్తికానంద, న్యూఢిల్లీ

ఊక దంచితే.. వ్యుత్పన్నత అంతే!

ప్రతిభ పాండిత్యాలలో ప్రతిభకు పట్టం కట్టినవాడెవ్వడు పాండిత్యాన్ని త్రోసిపుచ్చలేదు. అనభియోగమే కవిని బైట పడేస్తుంది. ‘కవి’ అనే తోక తగిలించుకున్న అప్రయోజకుడు తోచింది వ్రాస్తే తోకను కత్తిరించి పారేస్తారు. అనుభూతి వినా కవిత్వం లేదు. రాదు. ఐతే అనుభూతి ఉన్న ప్రతివాడు కవి అవుతాడని అనేది కేవలం ఒక వర్గపు రొడ్డకొట్టుడు మాట. ప్రతివాడు కవి కాలేకపోవడానికి కారణం అభియోగం లేకనే. అభియోగం లోని వైలక్ష్యమొకటి అనుభూతినాక్రమిస్తుంది. ఆక్రమించబడ్డ అనుభూతి కవిలోంచి అలంకార భూషిత కావ్యఝురిగా క్రేళ్లుఱుకుతుంది. ఈ క్రేళ్లుఱకడమే వ్యుత్పన్నతగా గుర్తించినవారు మొదట ఆలంకారికులు.

- సాంధ్యశ్రీ, 8106897404

సంఘటనల నుండి...

విశే్లషించడానికేం మిగిలింది
సామాన్యమైందేదీ ఉండదిక్కడ
బియ్యపు గింజంత సహజంగా
అన్నీ జరిగిపోతూనే వుంటాయి
స్మృతులు పరచిన తివాచీల్లా ఉండిపోతాయి
మళ్ళీ రణక్షేత్రాలు రగులుతాయి
జనన మరణాలు సహజాతాలవుతాయి
ఆరని దిగులుతో
ఆరబోతల తడి అంటుకుంటుంది
అస్తిత్వ ప్రభావాలయాలు
ఒంటరితనాన్ని పులుముకుంటాయి
అనంత దూరాలు ఎప్పటికప్పుడే
కలుస్తూ విడిపోతూనే వుంటాయి
మైలురాళ్లు నిలబడి మళ్ళీ
సరిహద్దుల్ని వెలిగిస్తుంటాయి
వొదగడం ఎదగడం దిగబడడం మామూలైంది
పేరుకుపోయిన సంవేదనల్ని ఊడ్చేస్తే
ఒకానొక శబ్ద సంభాషణ విన్పిస్తుంది

తంజావూరు తెలుగు కవయిత్రులు

క్రీ.శ.1550 ప్రాంతాలలో శ్రీకృష్ణదేవరాయలు సామంతులైన నాయక రాజుల ఆధ్వర్యంలో దక్షిణాదిన తంజావూరు ఆంధ్ర రాజ్యంగా స్థాపించబడిన విజయనగర పతనానంతరం అక్కడి కవులు కళాకారులు దక్షిణాంధ్ర నాయక రాజుల ప్రాపకం సంపాదించుకున్నారు. 1550 సంవత్సరం నుండి సుమారుగా 1673 సంవత్సరం వరకు ఆంధ్ర నాయక రాజులు తంజావూరు కేంద్రంగా పరిపాలన సాగించారు. వీరి కాలంలో తెలుగు ప్రబంధ, యక్షగాన సాహిత్యం ఉజ్వలంగా ప్రకాశించింది. ఆ తర్వాత 1855 సంవత్సరం వరకు మహారాష్ట్ర నాయకులు తంజావూరుని పరిపాలించారు. వారు కూడా తెలుగు సాహిత్యాన్ని పోషించారు. ఈ కాలంలో శహాజీ (1684-1712) చేసిన తెలుగు సాహిత్య సేవ ఎన్నదగినది.

- పుట్ల హేమలత, 8500496117

Pages