S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎండదెబ్బకు పాల ఉత్పత్తి ఢమాల్!

కరీంనగర్, ఏప్రిల్ 25: గత కొన్ని వారాలుగా దంచికొడుతున్న ఎండల దెబ్బకు కరీంనగర్ జిల్లాలో పాల ఉత్పత్తి పడిపోయింది. సుమారు లక్ష లీటర్ల పాల ఉత్పత్తి తగ్గిపోయింది. ఓ వైపు ఎండ ప్రచండంతో పాడి పశువులు విలవిల్లాడుతూ ఒత్తిడికి గురవుతుండడం, మరోవైపు నీరు, పశుగ్రాసం కొరత వెరసి పాలఉత్పత్తి పడిపోయింది. ఈ పరిస్థితులు మరో రెండు మాసాలు ఉండే పరిస్థితులుండే సూచనలు కనబడుతుండడంతో పాడి రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

భర్తను చంపిన భార్య

నెల్లూరు రూరల్, ఏప్రిల్ 25: దొంగతనాలు చేస్తూ రోజూ మద్యం సేవించి ఇంటికొచ్చి భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్న భర్తను రోకలిబండతో మోది చంపిన భార్య వైనమిది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు స్థానిక వెంకటేశ్వరపురంలోని భగత్‌సింగ్ కాలనీలో మహబూబ్ బాషా (38), భార్య జెనిలా కాపురం ఉంటున్నారు. హతుడు ట్రాన్స్‌ఫార్మర్లు దొంగతనాలు చేస్తూ చిల్లరగా తిరిగేవాడని, ఇప్పటికే పలు పోలీసుస్టేషన్లలో అతనిపై కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి అతిగా మద్యం సేవించి ఇంటికొచ్చి భార్యతో ఘర్షణకు దిగాడు.

ప్రేమ వ్యవహారంలో మనస్తాపం..

ధర్మారం, ఏప్రిల్ 25: ప్రేమ వ్యవహారంలో మనస్తాపం చెందిన ఒక యువకుడు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ ఎదురుగా జరిగింది. రామడుగు మండలం రామచంద్రాపూర్ గ్రామానికి చెందిన ఏగుర్ల వినోద్ (30) గత కొంతకాలంగా గంగాధర మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన యువతి (18) అనే యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఫోన్‌లో వేధిస్తున్నాడంటూ తల్లిదండ్రులతో పాటు మండలంలోని బొమ్మారెడ్డిపల్లికి చెందిన యువతి తాత ఒరుగల ఎల్లయ్యతో కలిసి శనివారం ధర్మారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాలను పిలిపించిన ఎస్‌ఐ ఇకపై ఒకరి జోలికి ఒకరు వెళ్లవద్దంటూ చెప్పి పంపించినట్లు తెలిపారు.

దోపిడీ కేసులో నిందితురాలి అరెస్ట్

నెల్లూరు, ఏప్రిల్ 25: ఆమె ఒక సాధారణ గృహిణి. వీధిలో అందరికీ తలలో నాలుకలా వ్యవహరిస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరించే ఆమె మాటల వెనుక అంతర్లీనంగా దాగిన అత్యాశ అడ్డదారులు తొక్కించింది. ఆర్థికంగా కష్టాలు రావడంతో గట్టెక్కేందుకు దొంగతనమే మార్గంగా ఎంచుకుంది. చివరకు చంపేందుకు కూడా సాహసించింది. ఈక్రమంలో పోలీసుల చేతికి చిక్కి ఊచలు లెక్కపెడుతోంది. నగరంలోని ఉస్మాన్‌సాహెబ్‌పేటలో ఈనెల 22న మహిళలపై దాడికి పాల్పడి నగలు దోపిడీ చేసిన కేసులో నిందితురాలు కంకిపాటి జయలక్ష్మిని 2వ నగర పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను నగర డిఎస్పీ వెంకటరామడు విలేఖరుల సమావేశంలో వివరించారు.

ఫ్ల్లెక్సీపై సిఎం ఫొటో లేకపోవడంపై జిఎంఆర్ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

చౌటుప్పల్, ఏప్రిల్ 25: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద సోమవారం జరిగిన ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ఫాస్ట్‌టాగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి జిఎంఆర్ అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రారంభోత్సవ సభలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ బొమ్మ మాత్రమే ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కేసిఆర్ ఫొటో పెట్టకుండా అవమానించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆడిట్ కార్యాలయంలో అవినీతి ‘ఇంద్ర’లు!

నెల్లూరు, ఏప్రిల్ 25: జిల్లా ఆడిట్ కార్యాలయంలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఇద్దరు సీనియర్ ఆడిటర్‌లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అవకతవకలకు పాల్పడుతున్నారు. వీరి అక్రమాలకు అడ్డుతగిలితే తోటి ఉద్యోగులపై కూడా దాడులకు దిగే స్థాయికి ఎదిగిపోయారు. ఈ క్రమంలో సహ ఉద్యోగినులను కూడా వదలడం లేదు. ఆన్‌లైన్‌లో ఎంప్లాయిమెంట్ డేటాలో కూడా వీరు పేర్లు మార్చగలిగిన నిపుణులు. భర్త పేరు దగ్గర భార్య పేరు, భార్య పేరు ఉండాల్సిన దగ్గర మరో పేరు.. ఇలా పేర్లను మార్చేస్తారు. ఏడ్చి కాళ్లావేళ్లా పడితే లంచాలు తీసుకుని పేర్లు సాధారణ స్థితికి తెస్తారు. ఇలాంటి పనులు సరికాదని ప్రశ్నించిన తమ పైఅధికారిని సైతం బెదిరిస్తున్నారు.

ఉస్మానియా విసి ఎంపికకు సెర్చి కమిటీ ఏర్పాటు

హైదరాబాద్, ఏప్రిల్ 25: ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఎంపికకు తెలంగాణ ప్రభుత్వం సెర్చి కమిటీని నియమించింది. ఈ మేరకు జీవో 94ను సోమవారం నాడు విడుదల చేసింది. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్శిటీ మాజీ విసి ప్రొఫెసర్ వి ఎస్ ప్రసాద్, ఇగ్నో మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హెచ్.పి దీక్షిత్, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి కె రామకృష్ణారావులతో ఈ సెర్చి కమిటీని నియమించారు.

ఎస్‌ఐ రాత పరీక్ష ప్రశాంతం

హైదరాబాద్, ఏప్రిల్ 25: ఎస్‌సిటి సబ్ ఇనె్స్పక్టర్స్ ఆఫ్ పోలీస్ ఉద్యోగాలకు సోమవారం జరిగిన (పిటిఓ, మెన్) రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. నగరంలో ఏర్పాటు చేసిన మూడు కేంద్రాల్లో 1497 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ జె పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ పరీక్షకు 2364 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేశామని, వీరిలో 1497 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని పూర్ణచంద్ర రావు తెలిపారు. మొత్తం 63.32 శాతం అభ్యర్థులు పరీక్ష రాశారని ఆయన పేర్కొన్నారు.

వైకాపాకు వేమిరెడ్డి రాజీనామా

నెల్లూరు, ఏప్రిల్ 25: ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం నెల్లూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా కేంద్ర కమిటీ సభ్యుడు, జిల్లా సమన్వయ కమిటీలతో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆయనతో ఉన్న సత్సంబంధాల కారణంతో జగన్‌కు సహకరించాలని నిర్ణయించి ఆ పార్టీలో చేరినట్లు తెలిపారు.

శబరి క్షేత్రంలో పుష్పయాగం

నెల్లూరు, ఏప్రిల్ 25: దర్గామిట్టలోని శబరి శ్రీరామక్షేత్రంలో సోమవారం సాయంత్రం స్వామివారికి పుష్పయాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.

Pages