S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆశలు గల్లంతు

న్యూఢిల్లీ, ఆగస్టు 2: ఒలింపిక్ క్రీడల్లో మన దేశానికి పతకాన్ని అందిస్తాడని ఆశించిన షాట్‌పుటర్ ఇందర్‌జీత్ సింగ్ వరుసగా రెండోసారి కూడా డోపింగ్ పరీక్షలో విఫలమయ్యాడు. దీంతో అతను రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ద్వారాలు మూసుకుపోయాయి. ఇందర్‌జీత్ నుంచి సేకరించిన ఏ శాంపిల్‌కు కొద్ది రోజుల క్రితం పరీక్షలు నిర్వహించగా, అతను ఆండ్రోస్టెరోన్, ఎటియోకొలనోలోన్ అనే స్టెరాయిడ్లను ఉపయోగించినట్లు తేలిన విషయం విదితమే. ప్రస్తుతం అతని బి శాంపిల్‌కు నిర్వహించిన పరీక్షలోనూ ఇదే విషయం వెల్లడైందని అధికార వర్గాలు మంగళవారం పిటిఐ వార్తా సంస్థకు తెలిపాయి.

రహానే అజేయ శతకం

కింగ్‌స్టన్ (జమైకా), ఆగస్టు 2: కరీబియన్లతో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా కింగ్‌స్టన్‌లోని సబీనా పార్క్‌లో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అజింక్యా రహానే అజేయ అర్ధ శతకంతో సత్తా చాటుకున్నాడు. అమిత్ మిశ్రా (21), ఉమేష్ యాదవ్ (19) అందించిన సహకారాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న రహానే 237 బంతుల్లో 108 పరుగులు సాధించి టెస్టు కెరీర్‌లో ఏడో శతకాన్ని నమోదు చేసుకున్నాడు. దీంతో 9 వికెట్లు నష్టానికి 500 పరుగులు రాబట్టి 304 పరుగుల ఆధిక్యత సాధించిన భారత జట్టు సోమవారం టీ విరామ సమయానికి ముందు తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

అమెరికాలో తొలిసారి టీమిండియా మ్యాచ్‌లు

ముంబయి, ఆగస్టు 2: భారత క్రికెట్ జట్టు మొట్టమొదటిసారి అమెరికాలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఫ్లోరిడాలో ఆ జట్టు వెస్టిండీస్‌తో రెండు టి-20 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడబోతోంది. ఇంతకు ముందు వెస్టిండీస్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు జరిగిన ప్లోరిడాలోని ఫోర్ట్ లూడెర్‌డేల్‌లో ఉన్న సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్కు వేదికగా ఆగస్టు 27, 28 తేదీల్లో ఈ రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్‌లోని టీవీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతాయి.

హాకీ జట్టుకు శుభశకునం

రియో డీ జెనిరో, ఆగస్టు 2: ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు రియో డీ జెనిరో నగరానికి చేరుకున్న భారత హాకీ జట్టు మంగళవారం సన్నాహక మ్యాచ్‌లో 2-1 గోల్స్ తేడాతో స్పెయిన్‌ను మట్టికరిపించింది. అద్భుతమైన ఫీల్డ్ గోల్‌తో ఆకాష్‌దీప్, పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచిన రూపీందర్ పాల్ సింగ్ భారత జట్టుకు ఈ విజయాన్ని అందించారు. రియో ఒలింపిక్స్‌లో శనివారం ఐర్లాండ్‌తో పోరాటాన్ని ప్రారంభించనున్న భారత జట్టు అంతకంటే ముందు మరో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడనుంది.

లోధా కమిటీతో చర్చలకు బిసిసిఐ ప్రతినిధిగా కట్జూ

ముంబయి, ఆగస్టు 2: జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయడం వల్ల ఎదురయ్యే సమస్యలను అర్థం చేసుకోవడంలో బోర్డుకు సహకరించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ నేతృత్వంలో నలుగురు సభ్యుల న్యాయ నిపుణుల కమిటీని బిసిసిఐ ఏర్పాటు చేసింది. జస్టిస్ లోధా కమిటీతో సంప్రదించడానికి, అలాగే బిసిసిఐకి సలహాలు, సూచనలు ఇవ్వడానికి బోర్డు తరఫున జస్టిస్ కట్జూను ఏకైక ప్రతినిధిగా చేయాలని మంగళవారం జరిగిన బిసిసిఐ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో కట్జూ కాకుండా మరో న్యాయ కోవిదుడు అభినవ్ ముఖర్జీ కూడా ఉన్నారు.

లోధా కమిటీ సిఫార్సులపై నిర్ణయం బిసిసిఐదే

ఇండోర్, ఆగస్టు 2: లోధా కమిటీ సిఫార్సులపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ) ఒక నిర్ణయం తీసుంటుందని, దానికి అనుగుణంగా మాత్రమే తాము పని చేస్తామని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ చెప్పారు. సోమవారం రాత్రి మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన గంగూలీని ఒక అడ్మినిస్ట్రేటర్‌గా, మాజీ క్రికెటర్‌గా లోధా కమిటీ సిఫార్సులపై మీ అభిప్రాయమేమిటని విలేఖరులు ప్రశ్నించినప్పుడు ఆయన నేరుగా తన అభిప్రాయం చెప్పలేదు.

రెవెన్యూ సమస్యల్ని త్వరగా పరిష్కరించండి

కరీంనగర్, ఆగస్టు 2: పేద ప్రజలు, రైతులకు సంబందించిన రెవెన్యూ సమస్యల్ని ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖలపై మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ సాదాబైనామా, విరాసత్, మ్యూటేషన్‌ల ధరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. 277 మంది సర్వేయర్లను నియమించనున్నట్లు తెలిపారు. ఆక్రమిత ప్రభుత్వ భూములు, ప్రస్తుతం ఆధీనంలో ఉన్న భూముల వివరాలు తెలియజేయాలని ఆదేశించారు.

పోచంపాడ్ నుండి ఎల్‌ఎండికి నీటి విడుదల

తిమ్మాపూర్, ఆగస్టు 2: పోచంపాడ్ ప్రాజెక్టు నుండి ఎల్‌ఎండి రిజర్వాయర్‌లోకి బుధవారం రెండు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మంగళవారం తిమ్మాపూర్ మండల అల్గునూర్ గ్రామ శివారులో గల ఎల్‌ఎండి రిజర్వాయర్‌కు ఆనుకొని ఉన్న ఫారెస్ట్ నర్సరీ స్థలంలో మంత్రి ఈటల రాజేందర్‌తో పాటు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీచైర్‌పర్సన్ తుల ఉమ, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, కలెక్టర్ నీతూప్రసాద్ మొక్కలు నాటారు.

రాష్ట్రంలో ప్రత్యామ్నాయం మేమే..

పెద్దపల్లి రూరల్, ఆగస్టు 2: రాష్ట్రంలో అధికార టిఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బిజెపి అని, రాబోవు ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం కాయమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 7న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనలో భాగంగా మోదీతో మనం, మహా సమ్మేళనం కార్యక్రమానికి కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మండలంలోని రంగంపల్లి గ్రామంలో గల సాయి గార్డెన్‌లో బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన పోస్టర్‌ను బిజెపి నాయకులు ఆవిష్కరించారు.

ప్రత్యేక హోదా కోసం వినతులు

ప్రధాని మోదీ ప్రజలనుద్దేశించి ‘మీ ఆకాంక్షల్ని తెలపండి, ఎర్రకోటపై నుండి చేసే స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావిస్తాను’ అని తెలియజేయడం ముదావహం. దేశ ప్రజల ఆశలు, ఆశయాలు, కలలు ప్రతిబింబించేలా ప్రధాని ప్రసంగించడం మామూలే అయనా ప్రసంగ పాఠం తయారీలో ప్రధానిది, లేదా కార్యదర్శి వర్గానిదే ఏకైక పాత్ర. ఇందులో ప్రజల నుండి ఆలోచనల్ని సేకరించొచ్చన్న వూహే సరికొత్తది. తనతో పాటు తామూ నడుస్తున్నామని దేశ ప్రజలు భావించేలా చూడడానికి ప్రధాని చేస్తున్న యత్నాలు అభినందనీయం.

Pages