S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖలో నువ్వేచెప్పు

సన్నీ, ప్రశాంత్, ప్రసన్న, అక్చిత ప్రధాన తారాగణంగా వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై శివశ్రీ దర్శకత్వంలో డాక్టర్ మళ్ల విజయప్రసాద్ రూపొందిస్తున్న చిత్రం ‘ఇంకేంటి.. నువ్వే చెప్పు’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. సినిమా ఆడియో వేడుక వైజాగ్ ఆర్‌కె బీచ్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన నటుడు సుమన్ మాట్లాడుతూ సాగర తీరాన ఈ కార్యక్రమాన్ని అందరికీ నచ్చేలా తీర్చిదిద్దినట్టుగానే సినిమా కూడా అంతే అందంగా వుంటుందని భావిస్తున్నానని అన్నారు.

పెరుగుతున్న అసహనం .. నరకంగా మారిన నగదు కొరత!

ముంబయి, డిసెంబర్ 10: చేతిలో డబ్బు లేక అల్లలాడుతున్న ప్రజలను శనివారం నుంచి వరుసగా మూడు రోజులు వచ్చిన సెలవులు మరింత కుంగదీస్తున్నాయి. చెలామణిలోని 85 శాతం నోట్లను రద్దు చేసి నెల రోజులు గడిచినా ఇప్పటికీ నగదు కొరత తీరలేదు. ఎటిఎంలు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. ఒకటి అరా అక్కడక్కడా పనిచేసినా వాటిల్లో పెట్టిన నగదు కొద్ది సేపట్లోనే అయిపోతోంది. అప్పటి వరకు భారీ క్యూలలో నిలబడి ఉన్నవారు ఉసూరుమంటూ డబ్బు చేతికి రాకుండానే తిరిగి వెళ్లిపోతున్నారు. దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబయి నగరంలో వారంతపు సెలవు దినమైన శనివారం కూడా ప్రజలు తమ అవసరాల కోసం బ్యాంకుల్లో ఉన్న తమ డబ్బును తీసుకోలేకపోయారు.

ఇస్లామాబాద్‌లో హిందూ దేవాలయానికి భూమి

ఇస్లామాబాద్, డిసెంబర్ 10: పాకిస్తాన్‌లో నివసిస్తున్న హిందువుల దీర్ఘకాలిక డిమాండ్లు పరిష్కారానికి నోచుకోనున్నాయి. ఇస్లామాబాద్‌లో ఆలయ నిర్మాణం, కమ్యూనిటీ సెంటర్, స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని హిందువులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఇన్నాళ్లకు అధికారులు వీటికి ఆమోదం తెలిపారు. శుక్రవారం ఇక్కడ జరిగిన కేపిటల్ డెవలప్‌మెంట్ అథారిటీ(సిడిఏ) సమావేశంలో సానుకూల నిర్ణయం తీసుకున్నారు. పౌర అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాజధాని సెక్టార్ హెచ్-9లో హిందూ ఆలయం నిర్మాణానికి అర ఎకరం భూమి కేటాయించాలని నిర్ణయించారు.

విధానాల రూపకల్పనలో బాలల హక్కులకు పెద్దపీట

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ప్రతికూల పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న బాలల పురోగతికి ఉన్న ఆటంకాలను తొలగించాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ సూచించారు. ప్రభుత్వం రూపొందించిన విధానాల కార్యాచరణ ద్వారా వారికి సమాన అవకాశాలను కల్పించాలని అన్నారు. రాష్టప్రతి భవన్‌లో తొలిసారి శనివారం నిర్వహించిన ‘లారేట్స్ అండ్ లీడర్స్ ఫర్ చిల్డ్రన్ సమ్మిట్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ అన్ని చోట్లా బాలల హక్కుల అమలు, పరిరక్షణ అనే బృహత్ లక్ష్య సాధన కోసం ప్రభుత్వం సహా ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఉద్బోధించారు.

కొలంబియా అధ్యక్షుడికి నోబెల్ శాంతి పురస్కారం

ఓస్లో, డిసెంబర్ 10: కొలంబియా అధ్యక్షుడు జువాన్ మాన్యుయెల్ శాంటోస్ శనివారం ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతిని స్వీకరించారు. నార్వే రాజధాని ఓస్లోలో నార్వే నోబెల్ కమిటీ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో శాంటోస్‌కి శాంతి పురస్కారాన్ని అందజేశారు. కొలంబియాలో అయిదు దశాబ్దాలుగా సాగుతున్న విప్లవ సాయుధ దళాలతో చరిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని కుదర్చటంలో కీలక పాత్ర పోషించినందుకు శాంటోస్‌కి ఈ బహుమతిని నోబెల్ కమిటీ అక్టోబర్ 7న ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అంతకు నాలుగు రోజుల ముందే కొలంబియాలో నిర్వహించిన రెఫరండంలో శాంటోస్ తిరుగుబాటుదారులతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని తిరస్కరించారు.

నగదురహిత లావాదేవీలకు నీతి ఆయోగ్ అవార్డులు

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: నగదు లేకుండా డిజిటల్ లావాదేవీలు నిర్వహించే వారికి అవార్డులు ఇవ్వాలని నీతి ఆయోగ్ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఒక పథకాన్ని రూపొందించాలని జాతీయ చెల్లింపుల కార్పొరేషన్‌ను కోరింది. ఈ అవార్డులు పొందటానికి అర్హతలను నీతి ఆయోగ్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
* డిజిటల్ చెల్లింపులు జరిపే అందరు వినియోగదారులు, వ్యాపారులు ఈ పథకం కింద అవార్డులు పొందేందుకు అర్హులే.
* ఇందులో రెండు రకాల ప్రోత్సాహకాలు ఉంటాయి.
* చెల్లింపులు జరిపిన తరువాత వచ్చే ట్రాన్సాక్షన్ ఐడి లను లక్కీడ్రా చేసి విజేతలకు ప్రోత్సాహకాలు ఇస్తారు.

ఉపన్యాసాలే తప్ప పరిష్కారం శూన్యం

కోల్‌కతా, డిసెంబర్ 10: పెద్దనోట్ల రద్దుతో ప్రజల సమస్యలు తీర్చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఉపన్యాసాలు దంచడమే తప్ప వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు.‘ మోదీ వేదికలెక్కి ప్రసంగాలు చేయడమే..జనానికి ఏమాత్రం ఉపశమనం కలగడంలేదు’అని శనివారం ఆమె ధ్వజమెత్తారు. 500.1000 రూపాయల నోట్ల రద్దు నిర్ణయం వికటించిందని మోదీ బాబాకు తెలుసని ఆమె అన్నారు.

సుష్మా స్వరాజ్‌కు కిడ్నీ మార్పిడి

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు శనివారం మూత్రపిండం (కిడ్నీ) మార్పిడి శస్తచ్రికిత్స జరిగింది. ఇక్కడి అఖిల భారత వైద్య విజ్ఞానాల సంస్థ (ఎయిమ్స్)లో జరిగిన ఈ ఆపరేషన్‌లో వైద్యులు జీవించివున్న బంధువు కాని వ్యక్తి కిడ్నీని తీసి సుష్మా స్వరాజ్‌కు అమర్చారు. కుటుంబ సభ్యుల్లో ఎవరి కిడ్నీ కూడా సుష్మా స్వరాజ్‌కు సరిపోకపోవడంతో జీవించి ఉన్న బంధువు కాని వ్యక్తినుంచి కిడ్నీని సేకరించినట్టు ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి.

ఉత్పాదక రంగానికి ఊతమివ్వండి

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ఆర్‌అండ్‌డి పెట్టుబడుల కోసం వ్యాపార నిర్వహణను సులభతరం చేయాలని, దేశీయ ఉత్పాదక రంగానికి ఊతమివ్వాలని ఐటి, టెలికామ్ పరిశ్రమ సంఘాలు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కోరాయి. ఇందుకు తగ్గట్లుగా రాబోయే బడ్జెట్‌లో నిర్ణయాలు, ప్రోత్సాహకాలు ఉండాలని విజ్ఞప్తి చేశాయి. శనివారం ఇక్కడ ముందస్తు బడ్జెట్ చర్చల్లో భాగంగా జైట్లీని ఐటి సంఘం నాస్కామ్, టెలికామ్ సంఘం ఐసిఎ కలిశాయి. సమావేశం అనంతరం నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ విలేఖరులతో మాట్లాడుతూ ‘వ్యాపార నిర్వహణ సులభతరంపైనే మా ప్రధాన దృష్టి.

టాటా మోటార్స్ విదేశీ అమ్మకాల్లో వృద్ధి

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: దేశీయ ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్ విదేశీ అమ్మకాలు గత నెల నవంబర్‌లో 1 శాతం పెరిగాయి. ఈసారి 91,832 యూనిట్ల విక్రయాలు జరిగితే, పోయినసారి 90,695 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. కాగా, లగ్జరీ బ్రాండ్ జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్‌ఆర్) విక్రయాలు గతంతో పోల్చితే 1.5 శాతం వృద్ధి చెందాయి. ఈసారి 51,792 యూనిట్ల అమ్మకాలు జరిగితే, నిరుడు 51,021 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఈసారి ప్యాసింజర్ వాహన అమ్మకాలు 64,862 యూనిట్లుగా, వాణిజ్య వాహన విక్రయాలు 26,970 యూనిట్లుగా ఉన్నాయి. ఈసారి ప్యాసింజర్ వాహన అమ్మకాలు పెరగగా, వాణిజ్య వాహన విక్రయాలు తగ్గాయి.

Pages