S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్ రుయా అరెస్టు

కోల్‌కతా, డిసెంబర్ 10: పశ్చిమ బెంగాల్ సిఐడి అధికారులు శనివారం రుయా గ్రూప్ చైర్మన్ పవన్ రుయాను అరెస్ట్ చేశారు. రైల్వే శాఖ ఇచ్చిన ఫిర్యాదులో భాగంగా శనివారం ఉదయం న్యూఢిల్లీలోని సుందర్ నగర్‌లోగల రుయా నివాసానికి వెళ్లిన బెంగాల్ సిఐడి అధికారులు.. అక్కడ పవన్ రుయాను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఓ సీనియర్ సిఐడి అధికారి చెప్పారు. కోల్‌కతాలోని డమ్ డమ్ ప్రాంతంలోగల జెస్సప్ ఫ్యాక్టరీ పరిసరాల నుంచి రైల్వే శాఖకు చెందిన 50 కోట్ల రూపాయల విలువైన వస్తువులు అపహరణకు గురయ్యాయి. ఈ ఫ్యాక్టరీ రుయా గ్రూప్ సంస్థల్లోనిదే. ఫ్యాక్టరీని సందర్శించిన రైల్వే బృందం..

భాగస్వాముల మద్దతుపై మిస్ర్తి గురి

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: టాటా గ్రూప్ సంస్థల నుంచి సైరస్ మిస్ర్తిని బయటకు పంపించే పనిలో టాటాలు బిజిగా ఉంటే, మరోవైపు ఆయా సంస్థల వాటాదారుల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో మిస్ర్తి మరింత బిజిగా ఉన్నారు. తాజాగా టాటా పవర్ బోర్డు నుంచి పంపేయాలన్న టాటాల ప్రతిపాదనలతో ఆ సంస్థ భాగస్వాముల మద్దతును కోరుతున్నారు మిస్ర్తి. ఈ నెల 26న టాటా పవర్ ఇజిఎమ్ జరగనుంది. సంస్థ డైరెక్టర్‌గా మిస్ర్తిని తొలగించాలన్న టాటా సన్స్ ప్రతిపాదనను ఇందులో పరిశీలించనున్నారు. ఈ క్రమంలో బోర్డు సభ్యుల మద్దతు కోసం మిస్ర్తి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భాగస్వాములకు ఓ లేఖ కూడా రాశారు.

ఉరకలెత్తిన ఉత్సాహం (వారాంతపు సమీక్ష )

ముంబయి, డిసెంబర్ 10: దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం లాభాలను అందుకున్నాయి. గత నాలుగు నెలల్లో ఎన్నడూ లేనంతగా గడచిన వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 517 పాయింట్లు పుంజుకుంది. 26,747 పాయింట్లకు చేరి ఒక నెల గరిష్ఠ స్థాయినీ తాకింది. నవంబర్ 11 తర్వాత సెనె్సక్స్ ఈ స్థాయికి చేరుకోవడం ఇదే ప్రథమం. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ కూడా గడచిన వారం ట్రేడింగ్‌లో 8,200 స్థాయిని అధిగమించింది. 175 పాయింట్లు పెరిగి 8,261.75 వద్ద నిలిచింది.

కోహ్లీ, విజయ్ శతకాలు

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో
కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ. కెరీర్‌లో 15వ టెస్టు సెంచరీని సాధించిన అతను 147 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు
ఎనిమిదో టెస్టు శతకాన్ని నమోదు చేసిన మురళీ విజయ్

లండన్ క్లాసిక్‌లో ఆనంద్ తొలి గేమ్ డ్రా

లండన్, డిసెంబర్ 10: ఇక్కడ ప్రారంభమైన లండన్ చెస్ క్లాసిక్ టోర్నమెంట్ మొదటి రౌండ్ గేమ్‌ను భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ డ్రా చేసుకున్నాడు. ఐదు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన అతను తొలి రౌండ్‌లో ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు ఫాబియానో కరువానాతో తలపడి, డ్రాగా ముగించాడు. మరో గేమ్‌లో మైఖేల్ ఆడమ్స్‌ను లెవోన్ ఆరోనియన్ ఓడించగా, వెస్లే సో తన ప్రత్యర్థి హికారూ నాకమూరపై గెలుపొందాడు. వెసెలిన్ తపలొల్‌పై వ్లాదిమిర్ క్రామ్నిక్ విజయభేరి మోగించాడు. మాకిమ్ వాచియెర్-లాగ్రేవ్, ఆనీష్ గిరి మధ్య జరిగిన గేమ్ డ్రా అయింది.

జాతీయ బాక్సింగ్ క్వార్టర్స్‌కు మనోజ్

త్రిపుర, డిసెంబర్ 10: జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్ 69 కిలోల వెల్టర్‌వెయిట్ విభాగంలో ఒలింపియన్ మనోజ్ కుమార్ క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. తన సాధారణ విభాగం కంటే మెరుగైన వెయట్‌లో పోటీపడుతున్న అత ను తమ ప్రత్యర్థిని ఎలాంటి ఇబ్బంది లేకుండా మట్టి కరి పించి, టైటిల్ దిశగా మరో అడుగు ముందుకేశాడు.

మేఘాలయకు చెందిన తిలోక్ బుద్ధాను ఓడించి, క్వార్టర్ ఫైనల్స్ చేరిన మనోజ్ కుమార్ (ఎడమ)

జూ. హాకీలో భారత్ మరో విజయం

లక్నో, డిసెంబర్ 10: జూనియర్ హాకీ వరల్డ్ కప్‌లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ని 5-3 తేడాతో గెల్చుకుంది. మ్యాచ్ ఆరంభంలో దూకుడుగా ఆడిన ఇంగ్లాండ్, మధ్యలో విఫలమైంది. చివరి క్షణాల్లో మరోసారి చెలరేగినప్పటికీ ఫలితం లేకపోయింది. మ్యాచ్ 10వ నిమిషంలోనే జాక్ క్లీ ద్వారా ఆ జట్టుకు తొలి గోల్ లభించింది. అయితే, భారత ఆటగాడు పర్వీందర్ సింగ్ 24వ నిమిషంలో ఈక్వెలైజర్‌ను సాధించాడు.

కొరియా మాస్టర్స్ బాడ్మింటన్ క్వార్టర్స్‌లో కశ్యప్ ఓటమి

సియోగ్‌విపో, డిసెంబర్ 10: కొరియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల క్వార్టర్ ఫైనల్స్‌లో భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్ పరాజయాన్ని చవిచూశాడు. గాయాల కారణంగా చాలాకాలం వివిధ టోర్నీలకు దూరమైన అతను ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో రాణించడం లేదన్న విషయం తెలిసిందే. ఆరంభ రౌండ్స్‌తోనే అతని పోరాటం ముగుస్తున్నది. అయితే, కొరియా మాస్టర్స్‌లో అతను మెరుగైన ఆటతో రాణించాడు. క్వార్టర్ ఫైనల్స్ వరకూ చేరాడు. అక్కడ నంబర్ వన్ సీడ్ సొన్ వాన్ హూ ఎదురుకావడంతో అతనికి ఓటమి తప్పలేదు. వాన్ హూ 23-21, 21-16 తేడాతో కశ్యప్‌ను ఓడించి, సెమీస్‌లో డారెన్ లియూతో పోరును ఖాయం చేసుకున్నాడు.

ఇంకా అర్థం కాలేదా?

కాంగ్రెస్‌లో జాతీయ నాయకుల నుంచి రాష్ట్ర స్థాయ నాయకుల వరకూ తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ వల్లనే ఏర్పడలేదని గత రెండున్నర ఏళ్లుగా మొత్తుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, తెచ్చింది తామేనని చె బుతున్నప్పటికీ- మరి ప్ర జలు ఎందుకు తమకు అధి కారం కట్టబెట్టలేదో వారు చెప్పలేకపోతున్నారు. వారు చెప్పేది నిజమే అయితే- టి ఆర్‌ఎస్‌తో పొత్తు కోసం కాం గ్రెస్ ఎందుకు తాపత్రయ పడినట్టు..? అంటే ప్రజలకే కాదు, కాంగ్రెస్ వారికి కూడా కెసిఆర్ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్న భావన ఉండటం వల్లనే కదా?

పెద్దనోట్ల రద్దుతో ఆర్థిక సుస్థిరత

దేశంలో అవినీతి, నల్లధనం నియంత్రించడానికే మోదీ ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసింది. అనేక రంగాల్లో అవినీతి పెచ్చుమీరడంతో నల్లధనం గుట్టలకొద్దీ పేరుకుపోయింది. మరోవైపు నకిలీ కరెన్సీని నివారించేందుకు మోదీ నిర్ణయం దోహద పడుతుంది. పెద్దనోట్లను రద్దు చేయడం మంచిదే అయినా తగిన ముందస్తు ప్రణాళికలు లేనందున దేశవ్యాప్తంగా ప్రజలు ఇపుడు నగదు కొరతను ఎదుర్కొంటున్నారు. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం రెండువేల రూపాయల నోటును విడుదల చేయడం విమర్శల పాలైంది. రెండువేల రూపాయల నోట్లతో బడాబాబులు మరింతగా నగదు పోగుచేసుకునే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో నల్లధనం దాచుకోవడం మరింత సులభం కాదా?

- మనె్న సత్యనారాయణ

Pages