S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళాసాహిత్య రంగాలలో పులులు, పిల్లులూ..

తెలంగాణ సాహిత్య చరిత్ర ఎందుకు నిర్మించాలి? ఆ అవసరం రాష్ట్రం ఏర్పడినందువల్ల వచ్చిందా? లేదా? లోకానికి తెలియజేయాల్సిన ప్రత్యేకత, విలక్షణతలు ఉన్నాయనా? ఇప్పటివరకు రా యబడిన చరిత్రలో అసంపూర్ణ, అలిఖిత అంశాలను పూరించడానికా? సమగ్రతని కోరుకునే దృష్ట్యానా? ఆమధ్య నిజాం కళాశాలలో జరిగిన ఒక సదస్సులో కలిగిన ఆలోచనలు ఇవి. రోజురోజుకీ ఇవి బలపడుతున్నాయి. అందుకే వీటిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నిజానికి ‘చరిత్ర’ రచన సమగ్రం కాకుండా సాహిత్య చరిత్రలో సమగ్రాలు సాధ్యం కాదు. రాజకీయ చరిత్ర రాయడం సులభం. చారిత్రక ఆధారాలు, సాక్ష్యాలు, గ్రంథాలు, చరిత్ర రచనలు, వ్యాసాలు చాలా లభిస్తాయి.

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242

‘చంద్ర’ప్రభ మసకబారుతోందా..?

‘రాజు కఠినాత్ముడిగానే కాదు, గొప్ప మానవతావాదిగానూ ఉండాలి. మొహమాటం ఉంటే రాజు చులకన అవుతాడు. అది ఏలిక బలహీనతను ప్రజలకు ప్రదర్శించడమే! రాజ్యసౌభాగ్యం కోసమే కాదు, సొంత మనుగడకు అవసరమైతే అయినవారిని దూరం ఉంచాలి. ఫలానా వారికి మాత్రమే ప్రీతిపాత్రుడిగా ఉంటే ఆ రాజ్యంలో అసంతృప్తి మొదలై , అది అసమ్మతిగా రూపుదిద్దుకుంటుంది. ఆ కొలువులో కొందరికే న్యాయం జరుగుతుందన్న ప్రచారం ప్రత్యర్థి దేశాలకు చేరితే, రా జ్యంలో అంతర్గత కలహాలు రేగడం సులభమవుతుంది. రాజు పరిపాలన, పర్యవేక్షణ మాత్రమే చేయాలి. సహచరులకు, మంత్రులకు తమ తెలివిని ప్రదర్శించే అవకాశం ఇవ్వాలి. యుద్ధంలో చివరి సేనానిగా మాత్రమే రావాలి.

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144

శేఖర్‌రెడ్డి పన్ను ఎగవేత కేసు.. మరో రూ.24 కోట్లు స్వాధీనం

చెన్నై, డిసెంబర్ 10: పెద్ద నోట్ల రద్దు అనంతరం చెన్నైలో గత కొద్ది రోజుల నుంచి వరుసగా దాడులు నిర్వహిస్తూ పెద్ద మొత్తంలో బంగారాన్ని, లెక్కలో లేని రూ.142 కోట్ల నగదును పట్టుకున్న ఆదాయ పన్ను (ఐటి) విభాగం అధికారులు శనివారం తాజాగా మరో 24 కోట్ల రూపాయల కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా పట్టుబడిన సొమ్మంతా కొత్త 2000 రూపాయల నోట్ల రూపంలోనే ఉందని, ప్రస్తుతం ఇంటరాగేషన్‌లో ఉన్న ఒక వ్యక్తి వెల్లడించిన సమాచారం మేరకు ఆదాయ పన్ను అధికారులు వెల్లూరులో ఒక కారు నుంచి ఈ నగదును స్వాధీనం చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. దీంతో ఈ ఒక్క కేసులోనే ఇప్పటివరకూ పట్టుబడిన నగదు 166 కోట్ల రూపాయలకు పెరిగింది.

25 నుంచి మెరుగైన యుఎస్‌ఎస్‌డి

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: పెద్ద నోట్ల రద్దు వలన దేశ వ్యాప్తంగా నగదు కొరత తీవ్రస్థాయిలో కొనసాగుతున్నందున నగదు రహిత చెల్లింపుల కోసం ఈ నెల 25వ తేదీ నుంచి వినియోగదారులకు మరింత అనుకూలమైన యుఎస్‌ఎస్‌డి (అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా) వెర్షన్‌ను లేదా ఫీచర్ మొబైల్ ఫోన్లతో చెల్లింపులకు జరిపేందుకు ఉపయోగించే *99అ సేవను అందుబాటులోకి తీసుకురావాలని డిజిటల్ చెల్లింపులపై ముఖ్యమంత్రులతో ఏర్పాటైన కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రజలకు మరింత విస్తృతంగా డిజిటల్ చెల్లింపులను అందుబాటులోకి తీసుకురావడం ఎలా?

టిటిడి బోర్డునుంచి శేఖర్‌రెడ్డి తొలగింపు

విజయవాడ, డిసెంబర్ 10: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు, అన్నాడిఎంకె నేత శేఖర్‌రెడ్డి, అతని బంధువుల ఇళ్లల్లో ఆదాయం పన్ను శాఖ అధికారులు నిర్వహించిన సోదాల్లో భారీ మొత్తంలో నగదు, బంగారం పట్టుబడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. టిటిడి పాలక మండలి నుంచి శేఖర్‌రెడ్డిని తొలగించాలని అధికారులను ఏపి సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

తలసానిపై క్రిమినల్ కేసు పెట్టాలి: మర్రి

బాలికావిద్యపై కొత్త విధానం!

హైదరాబాద్, డిసెంబర్ 10: జాతీయ స్థాయిలో బాలికా విద్య ప్రోత్సాహానికి కేబ్ నియమించిన సబ్ కమిటీ చైర్మన్ హోదాలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కేంద్రప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి చేసిన సిఫార్సులకు కేంద్రప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రధానంగా కెజిబివిల్లో విద్య బోధనకు సహాయం చేయాలని కేంద్రానికి సూచించారు. ప్రస్తుతం కేంద్రం కెజిబివిలకు 6వ తరగతి నుండి 8వ తరగతి వరకూ మాత్రమే సాయం అందిస్తోంది. దానిని 12వ తరగతి వరకూ పొడిగించడం వల్ల బాలికా విద్యకు ప్రోత్సాహాన్ని అందించినట్టవుతుందని కడియం శ్రీహరి పేర్కొన్నారు.

వికీపీడియాతో విజ్ఞాన విప్లవం

హైదరాబాద్, డిసెంబర్ 10: అన్ని భారతీయ భాషల్లో వికీపీడియాను అభివృద్ధి చేసేందుకు అవసరమైన శిక్షణ అందిస్తున్నామని వికీ ట్రైనర్, ఆంగ్ల వికీపీడియన్ టిటో దత్తా పేర్కొన్నారు. వికీపీడియాను అభివృద్ధి చేసేందుకు వివిధ కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన నాయకత్వ శిక్షణ, వికీపీడియాలో పనికొచ్చే ఉపకరణాల గురించి రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. తెలుగు వికీపీడియాను అభివృద్ధి చేయడం ద్వారా తెలుగు భాషాభివృద్ధితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి తెలుగు విశేషాలు అందించిన వారమవుతామని, దీంతో సరికొత్త విజ్ఞాన విప్లవం వస్తుందని ఆయన పేర్కొన్నారు.

కళంకిత సొమ్ము రూ.100 కోట్లుపైనే

హైదరాబాద్, డిసెంబర్ 10: తెలుగు రాష్ట్రాల్లో లంచగొండులు, అక్రమార్జనకు పాల్పడిన అధికారుల నుంచి అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) స్వాధీనం చేసుకున్న పెద్ద నోట్లు రూ.100 కోట్లకుపైగా ఉన్నాయి. ఈ సొమ్మునంతా ఈ నెల 30వ తేదీలోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉండటంతో సాధ్యమైనంత త్వరగా ఆ పని పూర్తి చేసేందుకు ఎసిబి అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం వీరు హైకోర్టు అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. కోర్టు అనుమతించిన వెంటనే ఈ సొమ్మును బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామని ఏసిబి వర్గాలు తెలిపాయి.

పోలీసుల తనిఖీల్లో రూ.82 లక్షల కొత్త కరెన్సీ పట్టివేత

కొత్తూరు, డిసెంబర్ 10: పోలీసుల తనిఖీల్లో 82.21 లక్షల కొత్త, పాత కరెన్సీ పట్టుబడినట్లు రంగారెడ్డి జిల్లా కొత్తూరు రూరల్ సిఐ మధుసూదన్ తెలిపారు. శనివారం ఇక్కడి పోలీస్ స్టేషన్‌లో విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ శుక్రవారం రాత్రి కొత్తూరు బైపాస్ 44వ జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తుండగా 82 లక్షల 21 వేల రూపాయలు కొత్త, పాత కరెన్సీని తరలిస్తున్న ఒక కారు, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. రెండు వేల రూపాయల నోట్లు 71 లక్షల 10 వేలు, 100, 50, 20, 10 రూపాయల పాత నోట్లు 11 లక్షల 11 వేల రూపాయలు పట్టుబడినట్లు వివరించారు.

Pages