S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రామీణ విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

మాకవరపాలెం, డిసెంబర్ 10: గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులు క్రీడల్లో ఆసక్తి కనబరిచి రాణించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆన్నారు. శనివారం మండల కేంద్రమైన మాకవరపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో నియోజకవర్గ స్థాయి ఖేలో ఇండియా ఆటల పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా జ్యోతిప్రజ్వలన చేసి ఆటల పోటీలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అయ్యన్న మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో విద్యార్థులు రాణించాలన్నారు. రాష్ట్రంలో క్రీడల్లో రాణించే విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు.

గిరిజన ప్రాంతాల్లో కలెక్టర్ విస్తృత పర్యటన

అరకులోయ, డిసెంబర్ 10: ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత తీసుకున్న అరకులోయ మండలంలోని పెదలబుడు మేజర్ పంచాయతీలో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ శనివారం విస్తృతంగా పర్యటించారు. పంచాయతీలోని పలు గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పథకాలను పర్యవేక్షించారు. నిర్మాణ దశలో ఉన్న తాగునీటి పథకాలను పరిశీలించి పలు సూచనలు చేసారు. తాంగులగుడ గ్రామంలో నిర్మిస్తున్న సి.సి.రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. గ్రామంలో మురుగు కాలువలు లేకపోవడంతో అధికారులను నిలదీసి వెంటనే డ్రైనేజి నిర్మాణాన్ని చేపట్టాలని ఆదేశించారు. మంచినీటి పథకాన్ని పరిశీలించి నెల రోజుల్లో గా నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.

అభివృద్ధి పేరుతో పంట భూములు లాక్కుంటారా?

మచిలీపట్నం: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కెసిఆర్ అభివృద్ధి పేరుతో రైతుల భూములు లాక్కోవడం అనవాయితీగా మార్చుకుంటున్నారని తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు విమర్శించారు. శనివారం మచిలీపట్నం వచ్చిన ఆయన స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అమరావతిలో రాజధాని పేరుతో మూడు పంటలు పండే 33 వేల ఎకరాల భూమిని లాక్కున్న ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బందరు పోర్టు పేరుతో మరో 33 వేల ఎకరాల భూమిని లాక్కునేందుకు సిద్ధపడటం గర్హనీయమన్నారు.

మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట

మచిలీపట్నం: మత్స్యకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక 18వ వార్డు గిలకలదిండిలో రూ.3.18కోట్లతో నిర్మించనున్న రక్షిత మంచినీటి రిజర్వాయర్ నిర్మాణంతో పాటు పంపింగ్ మెయిన్ ఏర్పాటు, డిస్ట్రిబ్యూషన్ పైప్‌లైన్‌ల నిర్మాణ పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ మత్స్యకారుల కోసం రాష్ట్రంలో నాలుగు పాఠశాలలు పని చేస్తున్నాయన్నారు. వీటికి అదనంగా మరో ఆరు పాఠశాలలను త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు.

పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు

నందిగామ: సరైన ప్రణాళిక, ప్రజల ఇబ్బందులను అంచనా వేయకుండా 86 శాతం చలామణిలో ఉన్న 500, 1000 నోట్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడి రద్దు చేయడంతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దేశ ఆర్థిక వ్యవస్థే కూదేలైందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్ల ధనం నిర్మూలనకు తమ పార్టీ కానీ, నాయకులు గానీ వ్యతిరేకం కాదన్నారు. అయితే నల్లధనం నిర్మూలన పేరుతో పెద్ద నోట్లను రద్దు చేసి ప్రజలను ఇబ్బందుల పాల్జేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

మానవాళికి మార్గదర్శకం ‘్భగవద్గీత’

మచిలీపట్నం (కల్చరల్): భగవద్గీత సర్వమానవాళికి మార్గదర్శకమని పెదముత్తేవి ముముక్షుజన మహా పీఠాధిపతులు శ్రీ ముత్తీవి సీతారాం గురుదేవులు అన్నారు. శనివారం స్థానిక జవహర్ పబ్లిక్ స్కూల్‌లో నిర్వహించిన త్రయోదశ గీతా జయంతి వార్షిక మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురుదేవులు అనుగ్రహభాషణ చేస్తూ ప్రతి సమస్యకు భగవద్గీత పరిష్కారం చూపుతుందన్నారు. గీతా పఠనం విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంచుతుందన్నారు. కుటుంబ సభ్యులు, సమాజంలో మెలగాల్సిన తీరును తెలియజేస్తూ నైతిక విలువలను పెంపొందిస్తూ ఉత్తమ పౌరులుగా గీతాపఠనం తీర్చిదిద్దుతుందన్నారు.

పెళ్ళి బృందంతో ట్రాక్టర్ బోల్తా

కూచిపూడి, డిసెంబర్ 10: పెళ్లి బృందంతో వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన మండల పరిధిలోని నిడుమోలు శివారు యలకుర్రు-కోరిమెర్ల రహదారిలో శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 24 మంది గాయాల పాలయ్యారు. క్షతగాత్రుల జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ ఆంధ్రా హాస్పిటల్‌కు తరలించారు. ఘంటసాల మండలం మల్లంపల్లికి చెందిన యువతి వివాహం శుక్రవారం రాత్రి గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలోని శ్రీ కొండలమ్మ ఆలయం వద్ద జరిగింది.

వార్ధా తుఫాన్‌పై జిల్లాలో ముందస్తు జాగ్రత్తలు

విజయవాడ, డిసెంబర్ 10: వార్ధా తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో జిల్లా యంత్రాంగం ద్వారా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో తుఫాన్ పరిస్థితిపై కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ నుంచి శనివారం ముఖ్యమంత్రి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

బెజవాడ అడ్డాగా గంజాయి రవాణా

విజయవాడ (క్రైం), డిసెంబర్ 10: విజయవాడ కేంద్రంగా గంజాయి పెద్దఎత్తున అక్రమ రవాణా జరుగుతోంది. విశాఖ జిల్లా నుంచి తరలుతున్న సరుకు పెద్ద ఎత్తున విజయవాడ మీదుగా ఇతర రాష్ట్రాలకు చేరుతోంది. నగరాన్ని అడ్డాగా మార్చుకున్న ‘గంజాయి మాఫియా’ కోట్ల రూపాయల అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు టన్నుల కొద్ది గంజాయి నగరంలో పట్టుబడగా.. తాజాగా టాస్క్ఫోర్స్ పోలీసులు దాడిలో శనివారం దాదాపు 300 కిలోలకు పైగా గంజాయి దొరికిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి.

Pages