S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

చెప్పకు చేసిన మేలు నొ
కప్పుడయినగాని దాని హర్షింపరు గా
గొప్పలు చెప్పిన నదియును
తప్పేయని చిత్తమందు దలపు కుమారీ!

భావము:ఓ కుమారీ! నీవు ఒకరికి చేసిన ఉపకారమును ఏ సమయమునందైనను ఒకరితో చెప్పవద్దు. ఆ విధంగా చెప్పడాన్ని మంచిది అని జనులు మెచ్చరు కదా! తన గొప్పదనములను చెప్పినట్లయిన అట్లు చెప్పుకొనుటయును దోషమే అని మనస్సునందు తలంచుము. ఒకరికి తాను చేసిన మేలును గురించి, తన గొప్పదనం గురించి ఇతరులతో చెప్పకూడదు. అలా చెప్పడాన్ని ఎవరూ పొగడరు. ఈ విషయాన్ని మనస్సులో మరువక ఉంచుకో కుమారీ! అని భావము.

బక్కి వెంకట నరసింహ కవి రచించిన కుమారీ శతకములోనిది. - కె. లక్ష్మీఅన్నపూర్ణ

బక్కి వెంకట నరసింహ కవి రచించిన కుమారీ శతకములోనిది. - కె. లక్ష్మీఅన్నపూర్ణ

జిల్లావాసుల గుండెల్లో వార్ధా తుపాన్

నెల్లూరు, డిసెంబర్ 10: రోజురోజుకి తీరాన్ని సమీపిస్తున్న వార్ధా తుఫాన్ భయంతో జిల్లావాసులకు కంటి మీద కునుకు లేని పరిస్థితి నెలకొంది. ఈనెల 8న అండమాన్ దీవుల సమీపంలో ఏర్పడిన అల్పపీడనం క్రమేణా బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం వార్ధాగా నామకరణం చేసుకున్న ఈ తుఫాన్ నెల్లూరుకు ఆగ్నేయంగా సుమారు 780 కిమీ దూరంలో కేంద్రీకృతమై, దక్షిణ దిశగా పయనిస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం రాత్రి గంటకు 22 కిమీ వేగంతో కదులుతూ తీరం వైపు వస్తున్న ఈ తుఫాన్ ఆదివారం తెల్లవారుజాముకు వేగం పెంచుకునే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

గజగజ..!

కర్నూలు, డిసెంబర్ 10 : జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా చలి విజృంభించింది. గత నాలుగు రోజులుగా చలి వాతావరణం ఎక్కువగా కనిపిస్తున్నా శనివారం తెల్లవారుజామున ఏకంగా 13 డిగ్రీల స్థాయికి పడిపోయింది. గత 10రోజులుగా 14, 15 డిగ్రీల స్థాయిలో నమోదవుతూ సాధారణ స్థితి ఉన్నప్పటికీ అది కాస్త మరింత పడిపోవడంతో ప్రజలు చలికి వణికిపోయారు. తెల్లవారుజాము నుంచి ఉదయం 7గంటల వరకూ మంచు కురిసింది. ఈ సమయంలో ఎదుటి వ్యక్తి కూడా కనిపించనంత స్థాయిలో మంచు కురవడంతో వాహనదారులు లైట్ల వెలుతురులో నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి కనిపించింది.

సంక్రాంతికి 100 గదుల సత్రం నిర్మాణం ప్రారంభం

భద్రాచలం, డిసెంబర్ 10: రూ.4.65కోట్ల వ్యయంతో తానీషా కల్యాణ మం డపం వెనుకభాగంలో నిర్మించనున్న 100 గదుల సత్రాన్ని సంక్రాంతి నాటికి పనులు ప్రారంభిస్తామని టిటిడి సభ్యుడు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. భద్రాచలంలో శనివారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూరె్తైందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల అభివృద్ధికి టిటిడి కట్టుబడి ఉందని వెల్లడించారు. భద్రాచలం దేవస్థానం ఇంకా ఏమైనా ప్రతిపాదిస్తే నిధులు ఇవ్వడానికి టిటిడి సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఆలయాల జీర్ణోద్ధరణ కార్యక్రమం వేగవంతంగా జరుగుతుందన్నారు.

రాజకీయాల్లో దిగజారిన విలువలు

తెనాలి, డిసెంబర్ 10: ప్రస్తుత రాజకీయలకు విలువలు లేవని, అన్న నందమూరి తారకరామారావుతోనే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని కళ్యాణ మండపంలో నన్నపనేని వెంకట్రావు శతజయంతి పురస్కార గ్రహీతగా ఆయన శనివారం జరిగిన కార్యక్రమానికి హాజరైయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి గజపతిరాజు మాట్లాడుతూ ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి ప్రవేశించిన పరిస్థితులకు, నేటి పరిస్థితులకు ఎంతోతేడా ఉందన్నారు. ఆయన స్పూర్తితోనే ఇప్పటికీ రాజకీయాలలో పదవులు అనుభవిస్తున్నట్లు చెప్పారు.

చితికిపోతున్న చిన్న దుకాణాలు!

కాకినాడ, డిసెంబర్ 10: పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలతో చిన్న దుకాణాలు చితికిపోతున్నాయి. సగటు మనిషికి నిత్యజీవితంలో నిరంతరం ఆందుబాటులో ఉండే చిన్నా, చితకా దుకాణాలు నేడు మూతపడే దుస్థితి ఏర్పడింది. చిన్న నోట్లతో ఆయా సరుకులను కొనుగోలు చేయాలనుకునే సామాన్యులకు సాధారణ దుకాణాలు అందుబాటులో ఉంటాయి. ఇటీవలి కాలంలో పెద్ద నోట్ల రద్దు అనంతరం ఏర్పడిన ఆర్ధిక సంక్షోభం చిన్న దుకాణాలను చిదిపేసింది. పెద్దనోట్ల రద్దు అనంతరం కార్పొరేట్ సంస్థలకు బాగా లాభిస్తోంది. ఆయా కార్పొరేట్ సంస్థలు నిర్వహిస్తున్న భారీ దుకాణాలకు సాధారణ వినియోగదారులు సైతం క్యూకడుతున్నారు.

చిత్తూరు మేయర్ పదవి కోసం పోటా పోటీ..!

చిత్తూరు, డిసెంబర్ 10: చిత్తూరు మేయర్‌గా ప్రస్తుతం బిసి మహిళ కార్పొరేటర్ల నుంచి ఒకరిని ఎన్నుకోవాలని హైకోర్టు ఆదేశించడంతో ఈ పదవికోసం పలువురు కార్పొరేటర్లు తమప్రయత్నం ముమ్మరం చేసారు. దీంతో చిత్తూరులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. చిత్తూరు మున్సిపాల్టీ నుంచి కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయిన తరుణంలో తొలిసారిగా కార్పొరేషన్‌కు 2014లో ఎన్నికలు జరిగాయి. అప్పట్లో మేయర్ పదవిని బిసి మహిళకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. దీంట్లో ఆ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ అత్యధిక కార్పొరేట్ స్థానం కైవసం చేసుకొని 31వడివిజన్ నుంచి ఎన్నికైన కఠారి అనూరాధ తొలి మేయర్‌గా నియమించబడ్డారు.

బంగారం వ్యాపారులకు ఐటి నోటీసులు.!

కడప,డిసెంబర్ 10: పెద్దనోట్ల రద్దు పుణ్యమా అని జిల్లాలోని పలువురు బంగారం నగల వ్యాపారస్తులకు ఐటిశాఖ శనివారం నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. దీంతో కొందరు పసిడి వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తొంది. ముఖ్యంగా గతనెల 8 పెద్దనోట్ల రద్దుతో గతనెల 9,10వ తేదీల్లో పెద్దనోట్ల ద్వారా వందలాది కిలోల బంగారు బిస్కెట్లు, నగలు వ్యాపారం జిల్లాలో వందలాది కోట్లరూపాయాల్లో జరిగినట్లు తెలుస్తోంది. రెండవ ముంబాయిగా పేరొందిన ప్రొద్దుటూరు నుంచి గుట్టుచప్పుడు కాకుండా గల్ఫ్, చెన్నై నుంచి తెప్పేంచే బంగారు, బిస్కెట్లు రాయలసీమ జిల్లాల్లో రద్దయిన పాత నోట్లతోనే వందల కోట్లరూపాయాల్లో వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది.

శ్రీనెట్టికంటి సన్నిధిలో గోపూజ

గుంతకల్లు, డిసెంబర్ 10: ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం గీతా జయంతిని పురస్కరించుకుని ఘనంగా గో పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయంలోని శ్రీ మూల విరాట్ ఆంజనేయస్వామికి తెల్లవారుజామున సుప్రభాత సేవ, మహాభిషేకం, విశేష పుష్ప, వజ్ర కవచాలంకరణ, బంగారు కిరీట ధారణ కార్యక్రమాలను ఆలయ అర్చకులు నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. మహా నివేదన, మహామంగళహారతి కార్యక్రమాలను నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ సమీపంలో గల గోశాలలో గోపూజ కార్యక్రమాన్ని ఆలయ వేదపండితులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు.

‘చలి’పంజా

హైదరాబాద్, డిసెంబర్ 10: మహానగరంలో చలి పులి పంజా విసురుతోంది. పగటితో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవటంతో సాయంత్రం నాలుగు గంటల నుంచే చల్లటి గాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా బైక్‌పై ప్రయాణించే వారు మాస్కులు, స్వెట్టర్లు ధరించక తప్పటం లేదు. నిత్యం రద్దీగా ఉండే పలు రహదార్లు, వినియోగదారుల క్రయవిక్రయాలతో కిటకిటలాడే పలు మార్కెట్లు ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతో కుదేలు కాగా, చలి కారణంగా రాత్రి ఏడు గంటలకే మూతపడే పరిస్థితులు తలెత్తాయి. ఇక శివార్లలో చలి ప్రభావం వర్ణణాతీతం. పలు ప్రాంతాల్లో సాయంత్రం ఏడు గంటల నుంచే చలిమంటలు కాచుకోవటం కన్పిస్తోంది.

Pages