S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లంచం కొట్టు.. ఎన్ని అంతస్తులైనా కట్టు

హైదరాబాద్, డిసెంబర్ 10: ‘మహా’నగర ప్రజలకు పౌర సేవలు, ఇతరాత్ర సేవలను అందించాల్సిన గ్రేటర్ బల్దియా అధికారులు డబ్బున్న బడాబాబుల కొమ్ముకాస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండురోజుల క్రితం నానక్‌రాంగూడలో కొందరు బడానేతలతో సత్సంబంధాలున్న ఓ వ్యక్తి అక్రమంగా నిర్మిస్తున్న ఏడు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనతో మరో సారి బల్దియా నిర్లక్ష్యం బట్టబయలైంది. ఈ అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోకపోవటం వెనకా ఎవరైనా బడా నేతల సిఫార్సులున్నాయా? లేక యజమాని సంబంధిత టౌన్‌ప్లానింగ్ అధికారులు చేతులు తడిపారా? అన్న అనుమానాలున్నాయి.

యాచక రహిత నగరంగా హైదరాబాద్

హైదరాబాద్, ఎల్‌బినగర్, డిసెంబర్ 10: మహానగరాన్ని యాచక రహిత సిటీగా తీర్చిదిద్దేందుకు మరో ప్రయత్నం ప్రారంభమైంది. ఇదివరకు జిహెచ్‌ఎంసితో పాటు పలు ప్రభుత్వ శాఖలు ఈ ప్రయత్నం చేసినా, క్షేత్ర స్థాయిలో అనేక అడ్డంకులేర్పడటంతో అవి ఫలించలేదు. కానీ నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రత్యేక చొరవ తీసుకుని యాచక వృత్తి అనేది ఓ మాఫియాగా మారిందని, నిజంగా కూడా యాచక వృత్తినే నమ్ముకుని జీవించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని ఇటీవలి సర్వేల్లో తేలటంతో ఉన్న కాస్త కొద్ది మందికి అమ్మానాన్న ఆనంద ఆశ్రమం ద్వారా పునరావాసం కల్పించి నగరాన్ని యాచకుల్లేకుండా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం ప్రారంభించారు.

వచ్చే ఏడాదికి క్రిస్టియన్ భవన్ నిర్మాణం: కేటిఆర్

సికిందరాబాద్, డిసెంబర్ 10: తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు. శనివారం పరేడ్ మైదానంలో క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం మహేంద్రాహిల్స్ ప్రాంతంలో క్రిస్టియన్ మైనార్టీల భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. కాని కోర్టు గొడవల కారణంగా ఆలస్యమైందని, కోర్టు వివాదాలు పరిష్కారం అయితే అక్కడే నిర్మిస్తామని, లేనిపక్షంలో మరోచోట రాబోయే క్రిస్మస్ నాటికి నిర్మించి ఇస్తామని సిఎం కేసిఆర్ చెప్పారని ఆయన వివరించారు.

షాపూర్‌నగర్‌లో రూ.50 లక్షల సొత్తు అపహరణ

జీడిమెట్ల, డిసెంబర్ 10: షాపూర్‌నగర్‌లో భారీ చోరీ జరిగింది. అనంతపురానికి చెందిన రత్న శేఖర్‌రెడ్డి కొంతకాలం క్రితం నగరానికి వచ్చి షాపూర్‌నగర్‌లోని హెచ్‌ఎంటి సొసైటీలో స్థిరపడ్డాడు. బడావ్యాపారస్థుడైన రత్న శేఖర్‌రెడ్డి అనంతపురంలో వ్యాపార నిమిత్తం వారానికి రెండు, మూడుసార్లు వెళ్లి వస్తుంటాడు. రెండు రోజుల క్రితం అనంతపురం, రాయగిరిలో సమీప బంధువు శుభకార్యానికి రత్న శేఖర్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి వెళ్లారు. శనివారం తెల్లవారుజామున రత్నశేఖర్ రెడ్డి ఇంటి తాళాలు పగులగొట్టి దుండగులు చొరబడ్డారు.

వాట్సాప్‌లతో సైబర్ నేరాలకు అడ్డుకట్ట?

హైదరాబాద్, డిసెంబర్ 10: దేశంలో వ్యక్తిగత కంప్యూటర్లు మొదలుకొని భారీ వ్యవస్థ (సంస్థలు)లపై జరిగే సైబర్ దాడులను పసిగట్టే పనిని ప్రముఖ ‘టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం’ ప్రారంభించింది. ఒకని ఖాతాలోని డబ్బులు మరొకరి ఖాతాలోకి మారడం, పిన్ కోడ్ నెంబర్లు తెలుసుకుని ఏటిఎంల నుంచి డబ్బులు అపహరించడం వంటి వాటిని వాట్సాప్‌ల ద్వారా క్షణాల్లో కనిపెట్టి దొంగలను పట్టుకునే వీలుగా ఐబీఎం సంస్థ నూతన టెక్నాలజీతో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయనుంది.

ముగిసిన ఆపరేషన్ నానక్‌రాంగూడ

హైదరాబాద్, డిసెంబర్ 10: నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య పదకొండుకు పెరిగింది. శుక్రవారం అర్థరాత్రి వరకు తొమ్మిది మృతదేహాలను బయటకు తీసిన ఎన్‌డిఆర్‌ఎఫ్, పోలీసు బృందాలు ఆ తర్వాత తెల్లవారుఝము నాలుగు గంటల వరకు మరో రెండు మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, ఉస్మానియా ఆసుపత్రి నుంచి అయిదు అంబులెన్స్‌లలో వారి స్వస్థలాలకు తరలించారు. దీంతో 30 గంటల పాటు కొనసాగిన ఆపరేషన్ నానక్‌రాంగూడ తెల్లవారుఝమున ముగిసింది. మృతులు సంఖ్య పదకొండుకు పెరగ్గా, చత్తీస్‌ఘడ్‌కు చెందిన శివ మృతి చెందగా, ఆయన భార్య రేఖ, కుమారుడు దీపక్‌లు మృత్యుంజయలుగా బయటపడ్డారు.

రిజర్వేషన్ల కోసం కెసిఆర్‌ను నిలదీయరేం?

హైదరాబాద్, డిసెంబర్ 10: ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకోని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఎందుకు నిలదీయడం లేదని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీ నాయకుడు జివిజి.నాయుడు శనివారం తన అనుచరులతో కలసి టిడిపిలో చేరారు. టిడిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ, హైదరాబాద్ పాత నగరాన్ని ఒవైసీ, కొత్త నగరాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ పంచుకుని పాలిస్తున్నారని విమర్శించారు.

తరగతి ఏదీ..?

మహబూబాబాద్ టౌన్, డిసెంబర్ 10: ఈ విద్యాసంవత్సరం పూర్తి కావొస్తున్నా ఇంతవరకు బిఈడి తరగతులు ప్రారంభం కాలేదు. అసలు క్లాసులు జరుగుతాయా, జరుగవో ఏమి తెలియని దిక్కుతోచని స్థితిలో విద్యార్థు లు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బిఈడి విద్యార్థిని విద్యార్థులను పట్టించుకునే పాపాన పొలేదు. గతంలో బిఈడి కోర్సు ఒక సంవత్స రం ఉండగా ఈ యేడాది నుండి దాని ని రెండు సంవత్సరాలకు పెం చారు. 2016-18సంవత్సరానికి జూన్, జులై లో మొదటి దఫా కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం రెండు, మూడు కౌన్సిలింగ్‌లు జరుగాల్సి ఉం డగా ప్రభుత్వం ఇంత వరకు ఆ దిశగా ఆలోచన చెయకపోవడంతో విద్యార్థులు ఆయోమయంలో పడ్డారు.

స్వచ్ఛ ప్రచారం జరపాలి

వరంగల్, డిసెంబర్ 10: స్వచ్ఛ్భారత్ కార్యక్రమంపై విస్తృత ప్రచారం, అవగాహన కల్పించటం ద్వారా ప్రజ లు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ మహానగరపాలక సంస్థ కమీషనర్ శృతి ఓఝా అధికారులను ఆదేశించారు. నగరంలోని ప్రతి కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మిచుకోవటం ద్వారా బహిరంగ మలవిసర్జన రహిత ప్రాం తాలుగా అభివృద్ధి చెందేలా చూడాలని చెప్పారు. శనివారం అదనపు కమీషనర్ షాహిద్ మసూద్, కార్పొరేషన్‌కు చెందిన వివిధ విభాగాల అధికారులతో ఆమె పారిశుధ్య కార్యక్రమం, మరుగుదొడ్ల నిర్మాణ ప్రగతిపై సమీక్ష జరిపారు.

కష్టాలను అధిగమించి లక్ష్యాన్ని చేరుకోవాలి

జనగామ టౌన్, డిసెంబర్ 10: వ్యక్తి వికాసంతో పాటు సమాజం అభివృద్ధి చెందాలంటే కేవలం విద్య ద్వారానే సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర సాం ఘీక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్(ఐపిఎస్) అన్నారు. ఇన్సిట్యూట్ ఆఫ్ హ్యుమెన్ స్టడీస్, శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకొని జనగామ చంపక్‌హిల్స్ మాతృదర్శన్ ట్రస్టు ఆవరణలో శనివారం జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు.

Pages