S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరస సెలవులతో బ్యాంకర్లకు ఊరట

పరకాల, డిసెంబర్ 10: వరుసగా మరో రెండు రోజులు బ్యాంకులకు సెల వు రావటంతో రెండు రోజులు గడిచేదేలా అంటూ ప్రజలు అందోళన చెందుతున్నారు. పెద్ద నోట్ల రద్దు చేసి 30 రోజులు గడిచిన ప్రజలు నగదు కోసం వ్యయ ప్రయాసలకు గురవుతూనే ఉన్నారు. అదివారం సెలవు, సోమవారం మిలాద్‌ల్‌నబి సందర్భంగా వరుసగా బ్యాంకులకు రెండు రోజులు సెలవులు రావడంతో బ్యాంకు ఉద్యోగులకు కొంత ఊరట కలిగించే విషయం. వరుస పని దినాలతో నిత్యం నగదు లేక ఇబ్బంది పడుతున్న ఉద్యోగులకు కొంత విశ్రాంతి లభించనుంది. అయితే ప్రజలకు మాత్రం వరుసగా రెండు రోజులు సెలవులు రావటంతో నగదు చేతికచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

గీతా పఠనం జీవితానే్న మార్చేస్తుంది

రాయపర్తి, డిసెంబర్ 10 : భగవద్ఘీత పఠనం మనిషి జీవితానే్న మారుస్తూందని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం మండలంలోని పెర్కవేడు శివసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో గీతా జయంతి ఉత్సవాల సందర్భంగా విద్యార్ధులకు గీతా శ్లోక పఠనంపై పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రముఖ యోగా గురువు బ్రహ్మశ్రీ శ్రీజ్ఞాన చైతన్య నంద స్వామిజీలు హజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగవద్ఘీత సారాంశం భావి తరాలకు అందించవలసిన బాద్యతా మనపై ఉందన్నారు. గీతా పఠనం ప్రతి ఒక్కరు అలవర్చుకొని పాటించాలని సూచించారు.

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చర్యలు

వరంగల్, డిసెంబర్ 10: నగరం లో మహిళల పట్ట అసభ్యంగా ప్రవర్తించే ఈవ్‌టీజర్లపై కఠినచర్యలు తీసుకుంటామని సెంట్రల్ జోన్ డిసిపి వేణుగోపాల్‌రావు హెచ్చరించారు. నగరంలోని కెఎల్‌ఎన్ రెడ్డి కాలనీ, నయింనగర్ తదితర ప్రాం తాలలో కళాశాలలకు వెళ్లే విద్యార్థినులను, మహిళలను కొంతమంది ఆకతాయిలు వేధిస్తున్నట్లు సమాచారం అందటంతో కమీషనర్ ఆదేశాల మేరకు షీ-టీం ఏసిపి ఈశ్వర్‌రావు, ఎస్సై రాజేంద్రప్రసాద్ షీ-టీం సభ్యుల సహాయంతో 14మంది ఈవ్‌టీజర్లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ఈవ్‌టీజర్లను వారి తల్లిదండ్రుల సమక్షంలో సెంట్రల్ జోన్ డిసిపి వేణుగోపాలరావు కౌన్సిలింగ్ నిర్వహించారు.

నియోజకవర్గ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

మానకొండూర్, డిసెంబర్ 10: ని యోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా ప్ర భుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మన్, మానకొండూర్ ఎ మ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. శనివారం మానకొండూర్ కేంద్రంలో రెండుచోట్ల రూ. 15 లక్షలతో సిసి రో డ్డు నిర్మాణం పనులను, అలాగే మం డల పరిధిలోని గంగిపల్లి గ్రామంలో గ్రామపంచాయితీ కార్యాలయంలో అ దనపు నూతన భవనం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిదిగా హాజరై శంకుస్థాపనలు చేపట్టారు. అనంతరం గంగిపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ శీతాలమ్మమడేలేశ్వరస్వామి దేవాల యం ప్రతిష్టామహోత్సవంలో రసమ యి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు.

సమస్యలపై చర్చలేనా.. పరిష్కారాలు చూపేనా..?

కరీంనగర్, డిసెంబర్ 10: సీమాంధ్రుల పాలనతో మసకబారిన తెలంగా ణ బతుకులు మార్చుకునేందుకు స్వ యంపాలన వైపు అడుగులేసిన తెలంగాణీయులకు, మరింత తేజోవంతంగా అభివృద్ధి ఫలాలు అందించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వీభజన కు శ్రీకారం చుట్టి, విజయవంతంగా పూర్తిచేసింది. జిల్లాల విభజన జరిగి నేటికి సరిగ్గా రెండు మాసాలు.

జాతీయ క్రీడల కేంద్రంగా కరీంనగర్

కరీంనగర్, డిసెంబర్ 10: తెలంగా ణ రాష్ట్ర సాధనలో ప్రత్యేకతను సంతరించుకున్న కరీంనగర్ ఇక జాతీయ క్రీడలకు కేంద్రంగా నిలిచేలా పలు చ ర్యలు తీసుకోనున్నట్లు కరీంనగర్ ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. స్థానిక మానేర్ హైస్కూల్‌లో శ నివారం జరిగిన 62వ జాతీయ పాఠశాలల జూడో పోటీల తొలిరోజు విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు వినోద్‌కుమార్ పతకాలను ప్రధానం చేసి ప్రసంగించారు. సుదీర్ఘ పోరాటం తరువాత సాధించిన తెలంగాణ స్వరాష్ట్రంలో క్రీడల అభివృద్ధే ద్యేయంగా పలు పథకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసే స్మార్ట్ సిటి పథకానికి ఎంపికయ్యేలా ఈ జాతీయ స్థాయి పోటీలు దోహదపడతాయ న్నారు.

అగ్నికి ఆహుతైన కట్టె కోత మిషన్

సుల్తానాబాద్, డిసెంబర్ 10: సుల్తానాబాద్ మండల కేంద్రంలోని పూసా ల రోడ్డు వద్ద రాజీవ్ రహదారి పక్కనే దామోదర్ సామిల్ (కట్టె కోత మిషన్) శుక్రవారం తెల్లవారుజామున అగ్నికి ఆహుతైంది. అగ్నిమాపక అధికారి కె. సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి పనులు ముగించుకొ ని వర్కర్లు వెళ్లిపోయారు. రాత్రి 11 గం టల సమయంలో సామిల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగగా, సామిల్‌లో ఉన్న గుంజలు, మొద్దులు పూర్తిగా కా లి బూడిదయ్యాయి. కోసిన వివిధ రకాల కర్రలు సైతం మంటల్లో కాలిపోయాయి. పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో పక్కనేఉన్న ఇళ్లలోకి పెద్దఎత్తు న పొగ చేరడంతో జనాలు బయటకు వచ్చి చూసేసరికి కట్టె కోత మిషన్ తగలబడిపోతోంది.

మట్కా బుకీల అరెస్ట్

కరీంనగర్, డిసెంబర్ 10: గత కొంతకాలంగా కరీంనగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా మట్కాను నిర్వహిస్తున్న ఇద్దరు బూకీలను కమీషనరేట్ ప్రత్యేక విభాగం పోలీసులు శనివారం పట్టుకున్నారు. కరీంనగర్ నగరంలోని ఖార్కానగడ్డకు చెందిన నహీమొద్దిన్ అలియాస్ జావిద్ (42), కరీంనగర్ మ ండలం చింతకుంటకు చెందిన పొలంపల్లి రాజు (46) అనే ఇద్దరు బూకీలను అరెస్ట్‌చేసి, వీరినుంచి 2సెల్‌ఫోన్లు, 29,940 నగదు, మట్కా చిట్టీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కమీషనరేట్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కమీషనర్ కమలాసన్‌రెడ్డి బూకీల వివరాల ను వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంతోనే భీంకు గుర్తింపు

కెరమెరి, డిసెంబర్ 10: గిరిజన ఆరాధ్యదైవమైన కుమ్రం భీంకు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు లభించిందని ఎమ్మెల్సీ పురాణం సతీష్ పేర్కొన్నారు. శనివారం హట్టి బేస్‌క్యాంపునుండి జోడేఘాట్ వరకు రూ.15.70 కోట్లతో నిర్మించతలపెట్టిన రోడ్డు పనులకు ఎమ్మెల్సీ పురాణం, ఎమ్మెల్యే కోవలక్ష్మి, కలెక్టర్ చంపాలాల్ తదితరులు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మె ల్సీ మాట్లాడుతూ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత నైజాం నవాబులను ఎదురించి పోరాడినభీంకు ప్రత్యేక గుర్తింపు లభించిందని, ఈక్రమంలోనే పోరుగడ్డను పర్యాటకకేంద్రంగా తీర్చిదిద్దేందు కు రాష్ట్ర ప్రభుత్వం రూ.25కోట్లను విడుదల చేయడం జరిగిందన్నారు.

పెరిగిన కరెన్సీ కష్టాలు

ఆదిలాబాద్, డిసెంబర్ 10: నల్లధనం వెలికితీత కోసం ప్రధాని నరేంద్ర మోదీ పెద్దనోట్లను రద్దుచేసిన నేపథ్యంలో నెలరోజులు గడిచినా కరెన్సీ కష్టాలు వీడడంలేదు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురంభీం జిల్లాలకు సరిపడ కొత్త కరెన్సీ బ్యాంకులకు చేరకపోవడంతో ప్రజలు తమ కనీస అవసరాలు తీర్చుకునేందుకు ప్రతినిత్యం అవస్థలు పడుతూనే ఉన్నారు. వీటికితోడు శని,ఆది,సోమ బ్యాంకులకు సెలవుదినంగా ప్రకటించడంతో సామాన్య మధ్యతరగతి జనం పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఇటు ఉద్యోగులు, చిరువ్యాపులు, దినసరి కూలీలు, నిత్యావసర సరకులు, కూరగాయలు ఇతర వస్తువులు విక్రయించే సామాన్యులు సైతం డబ్బుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు.

Pages