S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెటిఆర్..్భష మార్చుకో!

హైదరాబాద్/వనస్థలిపురం, డిసెంబర్ 3: ప్రపంచంలోనే అబద్ధాల పుస్తకమంటూ ఏదైనా ఉందంటే అది కేసిఆర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టిన ఎన్నికల మేనిఫెస్టో మాత్రమేనని రాష్ట్ర టిడిపి కార్యనిర్వహణ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా శనివారం తెలంగాణ వికలాంగుల విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఎల్బీనగర్, చింతల్‌కుంటలోని పల్లవి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రజాస్వామిక తెలంగాణను సాధిస్తాం

హైదరాబాద్, డిసెంబర్ 3: ‘ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి..తెలంగాణను సాధించాం..మన తెలంగాణను మనమే పాలిస్తాం..మనమే ప్రజాస్వామిక తెలంగాణను సాధిస్తాం’ అని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం స్పష్టం చేశారు. సెర్చ్ వారెంట్ లేకుండా ప్రజాగాయని విమలక్క అరుణోదయ సాంస్కృతిక మండలి కార్యాలయంలో సోదాలు నిర్వహించటమే కాకుండా సాధారణ పుస్తకాలను స్వాధీనం చేసుకుని సీజ్ జేయటం దుర్మార్గమన్నారు. తక్షణమే అరుణోదయ కార్యాలయాన్ని తెరవాలని డిమాండ్ చేశారు.

ఓడరేవు మనుగడ కోసమే పారిశ్రామికవాడ

మచిలీపట్నం, డిసెంబర్ 3: బందరు ఓడరేవు మనుగడ కోసమే పారిశ్రామికవాడ ఏర్పాటుకు భూ సమీకరణ చేపడుతున్నామని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఓడరేవుతోపాటు పారిశ్రామిక వాడ ఏర్పాటుకు 33వేల ఎకరాల భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించడం జరుగుతుందన్నారు. ఇందులో 14వేల ఎకరాలు మాత్రమే పట్టా భూములు ఉన్నాయని, మిగిలినవన్నీ అసైన్డ్ భూములేనన్నారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

నగదు మార్పిడిపై పోస్ట్ఫాసుల్లో సిబిఐ సోదాలు

హైదరాబాద్, డిసెంబర్ 3: హైదరాబాద్ పోస్ట్ఫాసుల్లో నగదు మార్పిడి, అవకతవకలపై సిబిఐ దృష్టి సారించింది. నగరంలోని ఏడు పోస్ట్ఫాసుల్లో అక్రమంగా నగదు మార్పిడి జరిగినట్టు శనివారం సిబిఐ గుర్తించింది. గోల్కొండ, సనత్‌నగర్, ఆబిడ్స్ జనరల్ పోస్ట్ఫాస్, పంజగుట్ట, హిమాయత్‌నగర్, నారాయణగూడ పోస్ట్ఫాసుల్లో దాదాపు పది కోట్ల మేరకు నగదు మార్పిడి జరిగినట్టు సమాచారం. కాగా సిబిఐ అధికారుల తనిఖీల సమాచారం అందుకున్న పోస్ట్ఫాస్ చీఫ్ సూపరింటెండెంట్ సుధీర్‌కుమార్ పరారయ్యారు. దీంతో ఉద్యోగులు రవితేజ, గోవిందరావు ఇళ్ళల్లో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. వీరి వద్ద నుంచి రూ. 3లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

అధికారుల పని తీరుపై ‘మండలి’ ఆగ్రహం

మోపిదేవి, డిసెంబర్ 3: మోపిదేవి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని అధికారుల పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయం నివేదికల ప్రకారం మోపిదేవి మండలం ఉపాధి హామీ పనుల నిర్వహణలో నాల్గవ స్థానంలో ఉందని, మరుగుదొడ్ల నిర్మాణంలో 3వ స్థానంలో ఉందని, ఏ ఒక్క పని సరిగా లేదని ఎంపిడిఓ బిఎం లక్ష్మీకుమారిని మందలించారు. ఉపాధి హామీ పథకం ఏపిఓ రవికుమార్‌ను మోపిదేవి మండలం 6వ స్థానంలో ఉందని, పని తీరును అభివృద్ధి పరిచి ప్రథమ స్థానంలోకి తీసుకురావాలన్నారు. అధికారులు కష్టపడి పని చేయాలని ఉద్బోధించారు.

ఫిబ్రవరి మొదటి వారానికి ఫ్లైఓవర్ పనులు పూర్తవ్వాలి

విజయవాడ, డిసెంబర్ 3: కనకదుర్గ ఫ్లైఓవర్ మేజర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఫిబ్రవరి మొదటి వారం నాటికి పూర్తిచేయాలని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోమా కంపెనీ ఇంజనీర్లను ఆదేశించారు. భవానీపురం వద్ద కాస్టింగ్ యాడ్‌లో నిర్వహిస్తున్న కనకదుర్గ ఫ్లైఓవర్‌కు సంబంధించిన పనులను శనివారం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జిల్లా కలెక్టర్ బాబు.ఎతో కలిసి పరిశీలించారు. పనులు పరిశీలించిన అనంతరం మంత్రి ఇంజనీరింగ్ అధికారులు, సోమా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడుతూ ఫిబ్రవరి 10 నుండి 3రోజులపాటు ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సును నిర్వహించడం జరుగుతుందన్నారు.

తక్కువ ధరకు బంగారం ఇస్తామంటూ మోసం!

హైదరాబాద్, డిసెంబర్ 3: తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ మోసం చేసే వారిని వెంటాడి, వేటాడి పట్టుకోవాల్సిన పోలీసులే ఓ రాజకీయ నేతతో కుమ్మక్కై తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ వ్యాపారులను మోసగించిన సంఘటన హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బంజారాహిల్స్ పరిధిలోని కాంగ్రెస్ నేత ఒకరు తక్కువ ధరకే బంగారం ఇస్తానని వ్యాపారులకు ఆశ చూపాడు. కొత్త నోట్లు తీసుకుని ఫిలింనగర్ గెస్ట్‌హౌస్‌కు రావాలని కొందరికి సూచించాడు. దీంతో వ్యాపారులు భారీ నగదుతో రాగానే సదరు కాంగ్రెస్ నేత తనకు అనుకూలమైన ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు సమాచారం అందించాడు.

త్వరలో రెండవ రైతు బజార్‌ను ఏర్పాటు చేస్తాం

మచిలీపట్నం (కోనేరుసెంటర్), డిసెంబర్ 3: పట్టణంలో మరో రైతుబజారు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాజుపేట మీ-సేవా కేంద్రం సమీపంలో రైతుబజారును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జన చైతన్య యాత్రల్లో భాగంగా శనివారం సాయంత్రం స్థానిక 31, 32, 33, 34 వార్డుల్లో ఆయన పర్యటించారు. ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ పట్టణంలో ఒకే ఒక్క రైతుబజారు ఉండటంతో ప్రజలు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్నారు. త్వరలోనే రైతుబజారు నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

నోట్ల మార్పిడి కేసులో పోలీస్ అధికారి అరెస్టు?

హైదరాబాద్/ఖైరతాబాద్, డిసెంబర్ 3: నోట్ల మార్పిడి కేసులో ఓ పోలీస్ అధికారి సహా ముగ్గురు కానిస్టేబుళ్లను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే... బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి అనుచరుడు తిరుమలేష్ నాయుడు పాత నోట్లకు బదులు కొత్త నోట్లు ఇస్తే 20 శాతం కమీషన్ ఇస్తామని ఆశ చూపాడు. అదేవిధంగా కొత్త నోట్లకు తక్కువ ధరకే బంగారం సైతం ఇప్పిస్తామని నమ్మబలికాడు. ఇతని మాటలు నమ్మిన ఇరు రాష్ట్రాలకు చెందిన వారు నగదుతో నగరానికి చేరుకున్నారు. అతను పథకంప్రకారం ఫిలింనగర్‌లోని ఓ గెస్ట్‌హౌస్‌కు రప్పించి వారిని మాటల్లోకి దించుతాడు.

ప్రజా సంక్షేమానికే అహర్నిశలు పనిచేస్తా

కైకలూరు, డిసెంబర్ 3: నియోజకవర్గ ప్రజలంతా తనను ఆశీర్వదించి నాడు గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయనని, ప్రజాభీష్టాన్ని గౌరవించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు వైద్య, ఆరోగ్య, వైద్య విద్య శాఖ మంత్రి పదవిని ఇచ్చారని, వైద్య ఆరోగ్య శాఖలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి సర్కారు దవాఖానాలో పేదలందరికీ మెరుగైన వైద్యమందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే, వైద్య ఆరోగ్య, వైద్య విద్య శాఖ మంత్రి డా.కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా మంత్రి పలు ఆలయాల్లో శనివారం పూజలు నిర్వహించి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Pages