S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆట పాటలతో ఉర్రూతలూగించిన దేవిశ్రీ ప్రసాద్

రామచంద్రపురం, డిసెంబర్ 2: డోనార్స్‌క్లబ్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన సినీ సంగీత దర్శకులు, గాయకుడు దేవిశ్రీ ప్రసాద్ తన మాట-ఆట-పాటలతో విద్యార్థులను ఉర్రూతలూగించారు. మాట్లాడటానికి లేవగానే విద్యార్థులు, ప్రజాసమూహం నుండి పాట కావాలంటూ నినాదాలు చేయగా..ఏ పాట పాడమంటారని దేవిశ్రీ ప్రసాద్ అడిగారు. పలు పాటలు పాడాలంటూ వచ్చిన అభ్యర్థనల మేరకు మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్‌దాదా ఎంబిబిఎస్ చిత్రంలోని పాటను నృత్యం చేస్తూ పాడారు. అనంతరం రెండు మూడు పాటలు ఆలపించి, తరువాత మాట్లాడారు. తన తండ్రి, దివంగత సత్యమూర్తి డోనార్స్‌క్లబ్ ఏర్పాటుకు నామకరణం చేసిన విషయం తెలిసినవెంటనే..

ఏడాదిలో ఎన్నికలు ఏవిధంగా వస్తాయో జగన్ చెప్పాలి

కడప,డిసెంబర్ 2: ఏడాదిలోపు రాష్ట్రంలో ఎన్నికలు ఏ విధంగా వస్తాయో వైకాపా అధినేత వైఎస్ జగన్ చెప్పాలని టిడిపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతిపక్షనేత, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని లక్షల కోట్లరూపాయలు సంపాదించి సిబిఐ కోర్టులో గొంతుల్లోతు పేరుకుపోయి సిబిఐ కోర్టుకు నుంచి ఇడి కేసుల నుంచి విముక్తిపొంది ఆయన ఏవిధంగా ఏడాదిలోపు దైవానుగ్రహంతో ఎన్నికలు తీసుకొస్తారో ప్రజలకు జవాబు చెప్పాలని తెలుగుదేశంపార్టీ జిల్లా అధినేత ఆర్.శ్రీనివాసులురెడ్డి (వాసు) జగన్‌కు సవాల్ విసిరారు.

రైతాంగం కుదేలు..!

కడప,డిసెంబర్ 2: జిల్లాలో రైతులు సాగు చేసిన పంటు సరైన దిగుబడి రాక, సకాలంలో వర్షాలు కురవక రైతాంగం కుదేలవుతుంది. దీంతో రైతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఖరీఫ్‌లో పంటలు దక్కక రబీలోనైనా పంటలు దక్కించుకోవచ్చునని కోటి ఆశలు పెట్టుకున్న జిల్లా రైతాంగానికి రబీ సీజన్‌లో కురవాల్సిన వర్షం కురవకపోవడంతో ఈ ఏడాది మెట్టసాగుకు విత్తనం వేసే పరిస్థితికి కూడా నోచుకునే అవకాశం కన్పించడం లేదు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో వర్షపాతం లేనికారణంగా ఖరీఫ్ పంటల దిగుబడి పూర్తిగా తగ్గింది. అడపా దడపా జూలై, ఆగస్టు మాసాల్లో అంతో ఇంతో వర్షంపడ్డా విత్తన సాగుకు నోచుకోలేదు.

క్యాంపు రాజకీయాలకు రంగం సిద్ధం

కడప,డిసెంబర్ 2: మూడు ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో కడపలో అధికార, ప్రతిపక్ష పార్టీల అధిష్ఠానాలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో ఆపార్టీని బలహీన పరిచేందుకు అధికారపార్టీ నేతలు ప్రత్యేకవ్యూహాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో వైకాపా తరపున జగన్ బాబాయ్, రాష్టమ్రాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి రంగంలో దిగడం, అధికార టిడిపి అభ్యర్థిగా జగన్ సొంత మండలమైన సింహాద్రిపురం నుంచి యువనేత బిటెక్ రవి (రవీంద్రనాథరెడ్డి) బరిలో దిగారు.

సంక్షేమ పథకాల మంజూరుకు నిబంధనలు పాటించాలి : కలెక్టర్

కడప,(కల్చరల్)డిసెంబర్ 2: జిల్లాలో వివిధ పథకాలు అమలుచేసే మంజూరుకు ఎంపికకు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని కలెక్టర్ కెవి సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. మండల అధికారులతో, ఆర్డీవోలు, పల్స్‌సర్వే, ఓడిఎఫ్, నగదు రహిత లావాదేవీలు, పెన్షన్స్, గృహనిర్మాణం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల్లో అర్హుల ఎంపికకు సంబంధించిన నియమ నిబంధనలు తప్పకపాటించాలని, వచ్చిన దరఖాస్తులు ఎంపికచేసి ఆన్‌లైన్‌లో ఉంచాలని అధికారులు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఖచ్చితంగా అర్హతను బట్టి ఎంపికచేసే పారదర్శకతను పాటించాలని కోరారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎల్‌కేజి, యుకెజి ప్రారంభం

కమలాపురం, డిసెంబర్ 2: కమలాపురం ఐసిడియస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో శుక్రవారం ఎల్‌కెజి, యుకెజి, నర్సరీలను ఎమీవో జాఫర్‌సాధిక్ లాంఛనంగా ప్రారంబించారు. పట్టణంలోని 9వ వార్డులో యల్‌కెజి, 7వ వార్డులో యుకెజి, 8వ వార్డులో నర్సరీ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ఎమీవో మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆంగ్లమాధ్యమంలో వీటిని ప్రారంభించడం స్వాగతించ విషయమన్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారులను కానె్వంట్లకేకాక అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా పంపించి ఆంగ్లబోధనలో చదువుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అన్నమయ్య రహదారి కోసం అలుపెరుగని పోరాటం..!

రాజంపేట, డిసెంబర్ 2: వేంకటేశ్వరునిపై 32వేల సంకీర్తనార్చన చేసిన తొలి వాగ్గేయదారుడు, ద్రావిడాగమ సార్వభౌముడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలకు నడిచి వెళ్ళిన మార్గం అభివృద్ధి కోసం జిల్లా వైకాపా అధ్యక్షులు ఆకేపాటి అమర్‌నాధరెడ్డి అలుపెరుగని పోరాటం చేస్తూనే వస్తున్నారు. తాజాగా ఈ ఏడాది 14వ మారు అన్నమయ్య తిరుమలకు నడిచి వెళ్ళిన మార్గంలో వేలాదిమంది గోవిందమాలలు ధరించిన భక్తులతో మహాపాదయాత్ర ఈనెల 10వ తేదీ నిర్వహించేందుకు అమర్‌నాధరెడ్డి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రేణిగుంట-రైల్వేకోడూరు మార్గమధ్యంలో కుక్కలదొడ్డి నుండి తిరుమలకు అన్నమాచార్యులు నడిచివెళ్ళేవారు.

వచ్చే ఏడాది నుంచి ఎన్ని నీళ్లయినా తెస్తాం

అనంతపురం, డిసెంబర్ 2 : జిల్లా పురోభివృద్ధి, దుర్భిక్ష నివారణకు వచ్చే ఏడాది నుంచి ఎన్ని నీళ్లైనా ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. శుక్రవారం పెనుకొండ నియోజకవర్గంలోని గొల్లపల్లి రిజర్వాయర్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. తొలుత రిజర్వాయర్ వద్ద గంగపూజ, సర్వమత ప్రార్థనలు చేసి నీటిని విడుదల చేశారు. అనంతరం పెనుకొండ నియోజకవర్గంలో రూ.31.80 కోట్లతో అభివృద్ధి పనులకు సంబంధించి పైలాన్‌ను ప్రారంభించి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలన్నదే తన జీవితాశయమన్నారు. ఇందుకోసం 15 అంశాలు ఇచ్చామన్నారు.

రాయల ఆశయాలను నీరుగార్చం

హిందూపురం, డిసెంబర్ 2 : జిల్లా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆనాడే శ్రీకృష్ణదేవరాయలు జిల్లావ్యాప్తంగా ఎన్నో చెరువులు, కుంటలను నిర్మించారని.. ఆయన ఆశయాలను నీరుగార్చకుండా చెరువులన్నింటిలో నీరు నింపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం సాయంత్రం మడకశిరలో జరిగిన చంద్రన్న పసుపు, కుంకుమ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 20 ఏళ్లలో 16 సంవత్సరాలుగా కరవు పీడిస్తోందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాకు ఓ వరంగా ఉన్న హంద్రీనీవా సుజల స్రవంతి పథకాన్ని అప్పట్లోనే ఎన్టీ రామారావు శ్రీకారం చుట్టారన్నారు.

గొల్లపల్లి రిజర్వాయర్‌కు ఎన్టీఆర్ సాగర్‌గా నామకరణం

పెనుకొండ, నవంబర్ 2 : మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో నిర్మించిన గొల్లపల్లి రిజర్వాయర్‌కు ఎన్టీఆర్ సాగర్‌గా నామకరణం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఎన్టీఆర్ పేరును రిజర్వాయర్‌కు నామకరణం చేస్తున్నట్లు సిఎం ప్రకటించగానే సభలో పెద్ద ఎత్తున చప్పట్లు, కేరింతలు, ఈలలు మోగాయి. శుక్రవారం మండల పరిధిలోని గొల్లపల్లి వద్ద నిర్మించిన రిజర్వాయర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. పుట్టపర్తి నుంచి సిఎం నేరుగా జలాశయానికి చేరుకుని హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ వద్ద గంగపూజ చేసి నీటిని రిజర్వాయర్‌లోకి విడుదల చేశారు.

Pages