S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాంజానియాలో ఐఎన్‌ఎస్ దర్శక్ హైడ్రాలిక్ సర్వే

విశాఖపట్నం, నవంబర్ 29: తూర్పు నౌకాదళానికి చెందిన సర్వే నౌక ఐఎన్‌ఎస్ దర్శక్ టాంజానియాకు చెందిన టాంగా పోర్టులో హైడ్రాలిక్ సర్వే విజయవంతంగా పూర్తి చేసింది. ఇరుదేశాల మధ్య కుదిరి ఒప్పందంలో భాగంగా హైడ్రోగ్రాఫిక్ సమాచారాన్ని ఒకరితో ఒకరు పంచుకునే విధంగా సర్వే నిర్వహించారు. సర్వే ద్వారా ఇరుదేశాల్లో అభివృద్ధి, సహకారం పెంపొందించే అవకాశాలు పెరిగాయి. సామర్థ్యం పెంపు, వౌలిక సదుపాయాల బలోపేతంలో భాగంగా చేపట్టిన సర్వే పూర్తి చేశారు. దర్శక్ అధికారులు తమ తొలివిడత సర్వే వివరాల నివేదికను టాంగా హార్బర్‌లో ఇటీవల జరిగిన కార్యక్రమంలో టాంజానియా ప్రభుత్వానికి నివేదించారు.

నేటి నుంచి లారీల సమ్మె

హైదరాబాద్, నవంబర్ 29: రాష్టవ్య్రాప్తంగా సరుకు రవాణా స్తంభించనుంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ నివరధిక సమ్మెకు దిగనుంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు లక్ష లారీలు సహ తెలంగాణ వ్యాప్తంగా 3.5 లక్షల లారీలు ఎక్కడిక్కడే నిలిచిపోనున్నాయి. లారీల సమ్మె వల్ల నిత్యావసర వస్తువుల సరఫరాపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కి కూస్తుంటే సాధారణ ప్రజలు సతమతమవుతున్నారు. సమ్మె వల్ల ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

చిన్న ఆలయాలకు నిత్య పూజా నిధి

హైదరాబాద్, నవంబర్ 29: తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న చిన్న దేవాలయాలు, ఆదాయం అంతగా లేని దేవాలయాలకు ‘నిత్య పూజా నిధి’ ఏర్పాటు చేయాలని ఆలయ పరిరక్షణ ఉద్యమ సమితి కన్వీనర్ డాక్టర్ ఎంవి సౌందరరాజన్ కోరారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి బహిరంగంగా విజ్ఞప్తి చేస్తూ, ధర్మ రక్షణ కోసం ప్రధాని చేస్తున్న కృషిని అభినందించారు. చిన్న ఆలయాలకు పూజా నిధి ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటూ ఇందుకు అనుగుణంగా సుప్రీంకోర్టు చేసిన సిఫారసులను అమలు చేయాలని కోరారు. చిలుకూరు ఆలయంలో నిత్యపూజా నిధిని ఏర్పాటు చేయ గా, భక్తులు స్పం దించి 10 కోట్లరూపాయలను విరాళంగా ఇచ్చారని గుర్తు చేశారు.

తిరుపతిలో మాదకద్రవ్యాలు!

తిరుపతి, నవంబర్ 29: ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతికి నిషేధిత మాదకద్రవ్యాలు సరఫరా అవుతున్నాయా? అన్న అనుమానాలు పొడచూపుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం మంగళవారం హైదరాబాదులో టాస్క్ఫోర్స్, మీర్‌చౌక్ పోలీసులు అరెస్టు చేసిన డ్రగ్స్ ముఠాలో తిరుపతికి చెందిన కేశవ అనే యువకుడు పట్టుబడటంతో అనుమానాలు బలపడ్డాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరుని దర్శించడానికి ప్రతినిత్యం లక్షలాది భక్తులు దేశం నలుమూలల నుంచి తరలివస్తారు. అంతేకాకుండా చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రాలకు నిలయంగా ఉండటంతో ఇతర వాణిజ్య కార్యకలాపాలు కూడా సాగుతున్నాయి.

రంగురంగుల ఆకు మిడత!

కొలిమిగుండ్ల, నవంబర్ 29: కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో మంగళవారం రంగురంగుల ఆకుమిడత ఒకటి కనిపించింది. సాధారణంగా ఆకు మిడతలు ఆకుపచ్చ లేదా బూడిద రంగు లేదంటే రెండు, మూడు రంగుల్లో కనిపిస్తుంటాయి. మంగళవారం కనిపించిన ఈ ఆకు మిడత మాత్రం అన్నిరంగులను తనలో ఇముడ్చుకుంది. నారింజ, ఎరుపు, నలుపు, తెలుపు, ఊదా, నీలం, ఆకుపచ్చ, పసుపు, బూడిద, గులాబి, గోధుమ, బంగారు రంగుతో కనువిందు చేసింది. ఇంద్రధనుస్సును మించిన రంగుల్లో కనిపించిన ఇలాంటి ఆకుమిడతలు పర్వత ప్రాంతాల్లో చాలా అరుదుగా కనిపిస్తుంటాయని వ్యవసాయ శాస్తవ్రేత్తలు స్పష్టం చేశారు.

వాయుగుండంగా మారిన అల్పపీడనం

విశాఖపట్నం, నవంబర్ 29: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మంగళవారం సాయంత్రానికి వాయుగుండంగా మారిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 1.030 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బుధవారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగాను, ఆపై తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీనికి అనుంబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని వెల్లడించారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో రేపటి నుంచి కోస్తాంధ్రలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

పెద్దనోట్ల రద్దుపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్, నవంబర్ 29: పెద్ద నోట్ల రద్దు అంశంపై వచ్చే నెల 8వ తేదీన అఫిడవిట్లు దాఖలు చేయాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్రానికి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. మాజీ ఎంపి డాక్టర్ మైసూరా రెడ్డి, న్యాయవాది కె శ్రీనివాస్, ఎస్ వెంకటేశ్వరరావు అనే మరో వ్యక్తి దాఖలు చేసిన పిల్స్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. పెద్దనోట్ల రద్దుకు దారితీసిన కారణాలతో పాటు జిల్లా సహకార బ్యాంకుల్లో నగదు మార్పిడికి అనుమతి ఇవ్వకపోవడంపై ఆర్‌బిఐ, కేంద్రం అఫిడవిట్లలో స్పష్టమైన సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో పెద్దనోట్ల రద్దుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.

నోట్ల రద్దుపై ఎంపి వినూత్న నిరసన

న్యూఢిల్లీ, నవంబర్ 29: పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను టిడిపి ఎంపీ శివప్రసాద్ కేంద్రం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మంగళవారం పార్లమెంటు ఆవరణలో ఆయన వినూత్న నిరసన తెలిపారు. నలుపుతెలుపుదుస్తులు ధరించిన ఆయన పార్లమెంటుకు హాజరయ్యారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల నల్లకుభేరులు వికటాట్టహాసం చేస్తూ ఉంటే, పేద ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు.

చిత్రం.. నలుపు తెలుపుదుస్తులు ధరించి వినూత్న ప్రదర్శన చేస్తున్న ఎంపి శివ ప్రసాద్

ఘోర విమాన ప్రమాదం

బొగోటా, నవంబర్ 29: బ్రెజిలియన్ ఫుట్‌బాల్ జట్టు ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం ఒకటి మంగళవారం కొలంబియాలోని పర్వత ప్రాంతాల్లో కూలిపోవడంతో కనీసం 75 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై స్పందించిన బ్రెజిల్ అధ్యక్షుడు మైకేల్ టెమెర్ మూడు రోజులు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించారు. ‘ఎలక్ట్రికల్ వైఫల్యం’ కారణంగా లామియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన చార్టర్డ్ విమానం మంగళవారం ఉదయం మెడిలియన్ సిటీ సమీపంలో కూలిపోయినట్లు అధికారులు తెలిపారు.

ఇసుమంతైనా పోనివ్వొద్దు

హైదరాబాద్, నవంబర్ 29: ఇసుక అక్రమార్కులపై సర్జికల్ స్ట్రయిక్ చేయాలని గనుల మంత్రి కె తారకరామారావు అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసు, రెవెన్యూ శాఖలతో సంయుక్త బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టాలని సూచించారు. స్థానిక అవసరాల పేరుతో ఇసుక డంప్‌ల్లోని అక్రమ నిల్వలను సీజ్ చేయాలన్నారు. స్థానిక అవసరాలకు కాకుండా అక్రమంగా ఇసుక తరలించే వారిని, వారి వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు.

Pages