S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

నందిగామ, నవంబర్ 25: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పధకాలు అందించాలన్నదే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుందని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక మార్కెట్ యార్డ్ ఆవరణలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధ్యక్షతన శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయిలో డ్వాక్రా మహిళలకు రెండవ విడత పెట్టుబడి నిధి రూ.14కోట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పల్స్ సర్వే ద్వారా సంక్షేమ పధకాలకు అర్హులను గుర్తించి వారందరికీ న్యాయం జరుగుతుందన్నారు. పల్స్‌సర్వేల్లో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి చంద్రన్న బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు.

శంషాబాద్ టు శివరాంపల్లి ప్రధాని మోదీకి ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం

శంషాబాద్, నవంబర్ 25: ఫ్రధాని నరేంద్రమోదీకి శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. నరేంద్రమోదీ వచ్చిన భారత వాయుసేన విమానం శుక్రవారం సాయంత్రం 6.28 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగింది. ముఖ్యమంత్రి కేసిఆర్, గవర్నర్ నరసింహన్ తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం 6.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి భారీ బందోబస్తు మధ్య ప్రధాని మోదీ కాన్వాయ్ శివరాంపల్లిలోని జాతీయ పోలీసుల అకాడమీకి చేరింది.

పాత పద్ధతిలోనే సొసైటీల రిజిస్ట్రేషన్లు

కాచిగూడ, నవంబర్ 25: తెలంగాణ రాష్ట్రంలోని 11 బిసి కులాల ఫెడరేషన్లలోని సొసైటీలను పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖమంత్రి జోగు రామన్న హామీ ఇచ్చారని తెలంగాణ రజక సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండూరి సత్యనారాయణ చెప్పారు. శుక్రవారం తెలంగాణ సచివాలయంలో బిసి కులాల ఫెడరేషన్ల రాష్ట్ర నాయకుల బృందం మంత్రి జోగురామన్నను కలిసి వినతి పత్రాని అందజేశారు.

మారుమూల గ్రామాలలో సోలార్ ల్యాంప్‌ల పంపిణీ

హైదరాబాద్, నవంబర్ 25: రాష్ట్రంలోని మారుమూల గిరిజన ప్రాంతాలలో ఈనాటికి కనీస సౌకర్యాలు, విద్యుత్ దీపాలు లేక అక్కడి ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆయా ప్రాంతాలు పర్యటించి అక్కడి ప్రజల సాధకబాధలు తెలుసుకొని చేతనైన సహకారం అందించాలనే సంకల్పంతో హైదరాబాద్ యూత్ అసెంబ్లీ, గోల్-4 స్వచ్ఛంద సేవా సంస్థ ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూరు మండలంలోని లండిగూడ గ్రామాన్ని చేరి సేవలు అందించారు. నగరానికి తిరిగివచ్చిన ఆ బృందం శుక్రవారం మీడియాతో అనుభవాలు పంచుకున్నారు.

ఆగిన అభివృద్ధి పనులు

హైదరాబాద్, నవంబర్ 25: జంటనగరాల్లోని సుమారు కోటి మంది జనాభాకు అత్యవసర, అతి ముఖ్యమైన సేవలందించే జిహెచ్‌ఎంసిలో స్తబ్దత నెలకొంది. ముఖ్యంగా జిహెచ్‌ఎంసిని గత కొంతకాలంగా నిధులు, సిబ్బంది కొరత పట్టి పీడిస్తుండటంతో ఇప్పటికే ప్రతిపాదించిన, కొత్తగా రూపకల్పన చేసిన అభివృద్ధి పనుల ఎక్కడికక్కడే ఆగిపోయాయి. కేవలం నిరంతరంగా అందించే పౌరసేవలు, స్వచ్ఛ భారత్ పనులు మినహా పెద్దగా ప్రాజెక్టు పనులు కొనసాగటం లేదు. ఇందులో భాగంగా పౌరసేవల నిర్వహణతో పాటు సమాజసేవలో తనవంతు పాత్ర పోషిస్తూ జిహెచ్‌ఎంసి ప్రతిరోజు మధ్యాహ్నం పంపిణీ చేస్తున్న రూ. 5 సబ్సిడీ ఆహార పథకం కూడా కాలక్రమేనా ఆర్థికంగా భారమవుతోంది.

సిబ్బందిపై సర్వే చేయాలి

హైదరాబాద్, నవంబర్ 25: నగరంలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ సంస్థ పరిధిలోని 83 శాఖ గ్రంధాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పూర్తి వివరాలను తనకు అందజేయాలని, సిబ్బందిపై సర్వే నిర్వహించాలని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్, సిటీ సెంట్రల్ లైబ్రరీ పర్సన్ ఇన్‌ఛార్జి ఎం. ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారం ఆమె కలెక్టరేట్‌లో నగర గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలో శాఖా గ్రంథాలయాల్లో ఏ ఏ క్యాడర్‌లో ఎంత మంది సబ్బంది పనిచేస్తున్నారు? వారిలో రెగ్యులర్ సిబ్బంది ఎవరెవరు? ఔట్‌సోర్సు, పార్ట్‌టైమ్ ప్రాతిపదికన పనిచేస్తున్న వారెంత మంది?

మెరుగులు..సొబగులు నగరాన్ని తీర్చిదిద్దుతాం

హైదరాబాద్, నవంబర్ 25: భాగ్యనగరమంటేనే పర్యాటక పరంగా ప్రపంచ వ్యాప్తంగా ఓ మంచి గుర్తింపు ఉందని, ఇక హుస్సేన్‌సాగర్ వచ్చిన వారు సెల్ఫీలు దిగకుండా ఉండలేరని, మున్ముందు నగరాన్ని మరింత అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ వ్యవహరాలు, ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. జిహెచ్‌ఎంసి, పర్యాటక శాఖలు పలు స్వచ్ఛంద సంస్థలు, పలువురు చిత్రకారులతో కలిసి ట్యాంక్‌బండ్‌పై ఎంతో అందంగా రూపొందించిన ‘లవ్ హైదరాబాద్’ అక్షరాల శిల్పాన్ని మంత్రి శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. అంతకు ముందు మంత్రి పీపుల్స్‌ప్లాజా, నెక్లెస్‌రోడ్డులో పలు భవనాలపై, ప్రహరీగోడలపై చిత్రకారులు వేసిన కళాఖండాలను తిలకించారు.

అర్చకుల జీవితాల్లో సప్తపదులు

విజయవాడ, నవంబర్ 25: అర్చకులు, దేవాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ పర్యవేక్షణలోని ఆలయాల్లో పనిచేసే వార్షిక ఆదాయం రూ.50 లక్షల లోపు ఉన్న దేవాలయాల్లో పనిచేస్తూ, నెలకు రూ.12,500 అంతకంటే తక్కువ వేతనం లభించు అర్చకులు, మరియు సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం అర్చక మరియు ఇతర ఉద్యోగులు సంక్షేమ నిధి బాసటగా నిలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏపీలో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, ఉద్యోగులకు ప్రభుత్వం పెద్దఎత్తున ఆర్థిక సాయాన్ని అందిస్తోంది.

పాక్‌లోకి వృథాగా పోనివ్వం

భటిండా, నవంబర్ 25: సట్లెజ్, బియాస్, రవి నదుల జలాలపై భారత్‌కే హక్కు ఉందని, అందువల్ల ఈ జలాలను వృథాగా పాకిస్తాన్‌లోకి పోనివ్వకుండా నిలిపివేస్తామని, ఇక్కడి రైతులే ఉపయోగించుకునేలా చూస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ‘సింధూ జలాల ఒప్పందం- సట్లెజ్, బియాస్, రవి- ఈ నదులలోని జలాలు భారత్‌కు, మన రైతులకే చెందుతాయి. ఈ నీటిని పాకిస్తాన్ పంట పొలాల్లో ఉపయోగించుకోవడం లేదు. అయితే పాకిస్తాన్ మీదుగా సముద్రంలో కలుస్తున్నాయి. ఇప్పుడు ఈ నీటిలో ప్రతి బొట్టును నిలిపివేసి, పంజాబ్, జమ్మూకాశ్మీర్, భారత రైతాంగానికి సరఫరా చేయడం జరుగుతుంది.

ఆస్తులు, ఉద్యోగులను చర్చించి పంచుకోండి

హైదరాబాద్, నవంబర్ 25: ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నుంచి తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను విడదీయడంతో ఆస్తుల పంపిణీ, ఉద్యోగుల విభజన అంశాన్ని ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కలిసి కూర్చొని పరిష్కరించుకోవాలని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ సమస్యను డిసెంబర్ 7వ తేదీలోగా పరిష్కరించుకోవాలని కూడా హైకోర్టు గడువు విధించింది.

Pages