S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గర్భిణి ప్రాణం తీసిన పాత నోటు!

పాట్నా, నవంబర్ 25:రద్దయిన 500నోటును చికిత్స కోసం ఆసుపత్రి వర్గాలు స్వీకరించక పోవడం వల్ల గయలో ఓ గర్భిణి మరణించిన సంఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ మేరకు మీడియాలో వచ్చిన కథనాలను స్వీకరించిన బీహార్ మానవ హక్కుల సంఘం జిల్లా మెజిస్ట్రేట్, సంబంధిత ఆసుప్రతి వర్గాలపై నిప్పులు చెరిగింది. పక్షం రోజుల్లో తమకు నివేదిక అందించాలని ఆదేశించింది. గయలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రిలోనే ఈ సంఘటన జరగడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోందని మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. మూత్రం ఆగిపోయిన కారణంగా ఆ గర్భిణికి డయాలిసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

స్పీకర్ సాయంతో జయ మాట్లాడుతున్నారు

చెన్నై, నవంబర్ 25: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని, శరీరంలో అన్ని కీలక అవయవాలు మామూలుగా పనిచేస్తున్నాయని అపోలో ఆసుప్రతి వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. శ్వాస సంబంధిత సమస్యంలో అపోలో ఆసుపత్రిలో చేరిన అన్నాడిఎంకె అధినేత్రి కొద్ది నిముషాలసేపుమాట్లాడడం జరిగిందని తాజా బులెటిన్‌లో పేర్కొన్నారు. జయలిలితను ఐసియు నుంచి ప్రత్యేక వార్డుకు మార్చిన తరువాత ఏలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి ప్రకటించారు. స్పీకర్ సహాయంతో ఆమె మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు.

రాజ్యాంగ స్ఫూర్తిని స్వీకరించాలి

న్యూఢిల్లీ, నవంబర్ 25: ‘రాజ్యాంగం అంటే బాబాసాహెబ్. బాబాసాహెబ్ అంటే రాజ్యాంగం’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజ్యాంగ లక్ష్యాల స్ఫూర్తిని అందిపుచ్చుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. రాజ్యాంగ దినోత్సవం (నవంబర్ 26)ను పురస్కరించుకొని లోక్‌సభ సచివాలయం శుక్రవారం ఇక్కడ నిర్వహించిన ‘అప్‌డేటెడ్ ఎడిషన్ ఆఫ్ కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా’, ‘మేకింగ్ ఆఫ్ ద కాన్‌స్టిట్యూషన్’ అనే రెండు పుస్తకాల విడుదల కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రోజులు గడచిన కొద్దీ అంబేద్కర్ చేసిన రాజ్యాంగ రచన ఎంత గొప్ప పనో మనకు మరింత అవగతం అవుతోందని అన్నారు. ‘కాలం మారింది.

చర్చకు భయపడుతున్న మోదీ

న్యూఢిల్లీ, నవంబర్ 25: పెద్దనోట్ల రద్దుపై పార్లమెంటు హాజరుకావడానికి ప్రధాని మోదీ ఎందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. ఒక్క పక్క పార్లమెంటు ఉభయ సభలూ ఈ అంశంపై అట్టుడికి పోతుంతే మోదీ హాజరుకాకపోవడం అనేక అనుమానాలు తావిస్తోందని అన్నారు. దమ్ముంటే పార్లమెంటుకు హాజరై ప్రతిపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకు మోదీ సమాధానం ఇవ్వాలని ఆయన సవాల్ విసిరారు. నోట్ల రద్దు అనంతరం మోదీ వ్యవహరించిన తీరు విడ్డూరంగా ఉందని ఓ పక్క ప్రజలు ఇబ్బందుల పట్ల ఉదాసీనతను ప్రదర్శించిన ఆయన ఆ మరుక్షణమే భావోద్వేగానికి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అన్నారు.

మోదీ వ్యాఖ్యలతో దద్దరిల్లిన పార్లమెంటు

న్యూఢిల్లీ, నవంబర్ 25: ప్రతిపక్ష పార్టీలు నల్లధనాన్ని ప్రోత్సహిస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు శుక్రవారం పార్లమెంటును కుదిపేశాయి. మోదీ తమకు క్షమాపణ చెప్పాలంటూ ప్రతిపక్ష పార్టీలు గొడవకు దిగడంతో సభాకార్యక్రమాలు స్తంభించాయి. దీంతో సోమవారానికి వాయిదా పడ్డాయి. నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం పార్లమెంటు గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన ఒక పుస్తకావిష్కణ కార్యక్రమంలో మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దుకు ముందు వారికి సమయం ఇవ్వనందుకే తన పట్ల కోపంతో ఉన్నారంటూ ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేశారు.

అమ్మో.. ఫస్ట్!

ప్రభుత్వ, ప్రైవేటు వర్గాల్లో ఆందోళన పెన్షనర్లు, ఉద్యోగుల్లో కంగారు
జీతాలేమో నేరుగా ఖాతాల్లోకి జమ ఎటిఎంల నుంచి వచ్చేది కేవలం 2వేలు
బ్యాంకుల నుంచి వారానికి 24 వేలే సామాన్యుడి బతుకు బండికి కరెన్సీ కుదుపు

దేశానికి నీటి సంక్షోభం

విశాఖపట్నం, నవంబర్ 25: దేశంలో రానున్న రోజుల్లో నీటి కొరత రాబోతోందని, అందువల్ల వర్షపు నీటిని తప్పనిసరిగా నిల్వ చేసుకోవాలని కేంద్ర మంత్రి వెంకయ్యనానాయుడు అన్నారు. సన ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖ పాత నగరం క్వీన్‌మేరీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామంతో ఏర్పాటు చేసిన సుజలధార, హరిత జీవన మరుగుదొడ్లను శుక్రవారం ఉదయం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను సింగ్‌పూర్ వెళ్ళి అక్కడ వాటర్ రీ స్లైకింగ్ ప్లాంట్‌ను సందర్శించానని, మురికినీటిని పరిశుభ్రం చేసి తనకు ఇచ్చారన్నారు.

ప్రధానికి ఘన స్వాగతం

హైదరాబాద్, నవంబర్ 25: చండీగఢ్ నుంచి ప్రత్యేక విమానంలో శుక్రవారం సాయంత్రం శంషాబాద్ చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది.

ఖమ్మం నుంచే కారం దందా

ఖమ్మం, నవంబర్ 25: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తున్న నకిలీ కారం దందా ఖమ్మం జిల్లా నుంచే నడిచినట్లు స్పష్టమవుతోంది. శుక్రవారం ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ఉన్న కోల్ట్ స్టోరేజ్‌లలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేయగా ఈ విషయం స్పష్టమైంది. గురువారంనాడు కృష్ణా జిల్లా గంపలగూడెం వద్ద రెండు లారీల నకిలీ కారాన్ని పట్టుకున్న అధికారులు అప్పుడు దొరికిన వ్యక్తుల వద్ద నుంచి సేకరించిన సమాచారం ప్రకారం మధిర నుంచే ఈ కారం వెళ్తున్నట్లు తెలుసుకొని శుక్రవారం మధిరలో ఉన్న రెండు కోల్డ్‌స్టోరేజ్‌లపై దాడులు నిర్వహించారు.

500 నోటులో ముద్రణా లోపాలు

న్యూఢిల్లీ, నవంబర్ 25: చిల్లర లేక సతమతమైన పౌరులకు కొత్తగా వచ్చిన 500 నోటు మరింత ఇరకాటంలో పడేసింది. కొత్త ఐదొందల నోటులో అనేక తేడాలు కనిపించడంవల్ల ప్రజలు బెంబేలెత్తారు. అయితే ఈ తేడా హడావుడిగా ముద్రించడం వల్ల జరిగిందేనని ఆర్‌బిఐ వివరణ ఇచ్చింది. నోటులో ఓ చోట మహాత్మాగాంధీ ముఖం నీడ ఎక్కువగా ఉందని అలాగే జాతీయ చిహ్నంపైనా, సీరియల్ నెంబర్‌పైనా అలైన్‌మెంట్ సరిగ్గాలేదన్న లోపాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ తేడాల కారణంగా భయపడవద్దని స్వేచ్ఛగా వీటిని వినియోగించుకోవచ్చని లేదా వెనక్కు ఇవ్వొచ్చని ఆర్‌బిఐ స్పష్టం చేసింది.

Pages