S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాని చర్చకు రావలసిందే

న్యూఢిల్లీ, నవంబర్ 24: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్దనోట్లపై చర్చకు రాకుండా తప్పించుకుంటున్నారంటూ ప్రతిపక్షం గురువారం రాజ్యసభను స్తంభింపజేసింది. నరేంద్ర మోదీ గురువారం మధ్యాహ్నం రాజ్యసభ ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే భోజన విరామం తరువాత ఆయన సభకు రాకపోవడంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. పెద్దనోట్ల రద్దుపై చర్చ జరిగినంత సేపూ మోదీ రాజ్యసభలో ఉండాల్సిందేనని వారు పట్టుపడుతున్నారు. ప్రధాని ఉంటేనే కరెన్సీ రద్దుపై ప్రారంభించిన చర్చను ముందుకు సాగనిస్తామని ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతి, సిపిఎం పక్షం నాయకుడు సీతారాం ఏచూరి స్పష్టం చేశారు.

ఎస్టీ విద్యార్థులకూ మెస్ చార్జీలు

హైదరాబాద్, నవంబర్ 24: ఎస్సీ, బిసిలకు మాదిరిగానే ఇకపై ఎస్టీ విద్యార్థులకు కూడా పోస్టు మెట్రిక్ హాస్టళ్ల నెలవారిగా నిర్వహణ ఖర్చులను చెల్లించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై గురువారం ముఖ్యమంత్రి సంతకం చేశారు. క్యాంపు కార్యాలయం కొత్త భవనంలోకి గృహ ప్రవేశం చేశాక ముఖ్యమంత్రి చేసిన తొలి సంతకం ఈ ఫైలుపైనే కావడం విశేషం. రాష్ట్రంలో 101 ఎస్టీ హాస్టళ్లలో 14,685 మంది విద్యార్థులు చదువుతున్నారని, వీరికి నెలనెలా కాకుండా ఆరు నెలలు, ఏడాదికి ఒకసారి బిల్లులు చెల్లించేవారన్నారు.

ఘనంగా దత్తాత్రేయ కుమార్తె వివాహం

హైదరాబాద్, నవంబర్ 24: కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి, డాక్టర్ జిగ్నేష్‌రెడ్డిల వివాహం గురువారం ఉదయం గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, పలువురు మంత్రులు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, బిజెపి నేతలు పెద్ద ఎత్తున హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ట్రైసిటీగా తిరుపతి - కృష్ణపట్నం - శ్రీసిటీ

విజయవాడ, నవంబర్ 24: తిరుపతి, కృష్ణపట్నం, శ్రీ సిటీలను ట్రైసిటీగా అభివృద్ధి చేసి మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గురువారం రాత్రి సిఎంఓలో తనను కలిసిన ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పంకజ్ మొహింద్రూ బృందంతో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి యూనిట్లను తెరిచే సెల్యులర్ కంపెనీలకు తగిన ప్రోత్సాహకాలిస్తామని అన్నారు. తనను విశ్వసించి పెట్టుబడులు పెట్టాలని, ఇక్కడ ఉత్పాదక యూనిట్లు తెరవాలని వారికి అన్ని రాయితీలతో సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.

ఐదువేల కోట్లు అడిగాం

హైదరాబాద్, నవంబర్ 24: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కరెన్సీ నోట్ల సమస్య పరిష్కారానికి తక్షణమే ఐదువేల కోట్ల రూపాయల చిన్ననోట్లను పంపించాలని కేంద్రాన్ని కోరామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఇక్కడి ఎస్‌బిహెచ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన 13వ రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతూ, 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడం మంచిదేనని అన్నారు. దేశంలో 80 శాతం కరెన్సీ 500, 1000 రూపాయల నోట్ల రూపంలోనే ఉందన్నారు. కొద్దిమంది వద్ద కోట్లాది రూపాయలు బ్లాక్‌మనీ గుట్టలుగా పడిఉన్నాయన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావలసి ఉందన్నారు. నోట్లరద్దుపై కేంద్రం నిర్ణయం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయన్నారు.

సిమెంట్ బస్తా రూ.230

హైదరాబాద్, నవంబర్ 24: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం సిమెంట్ బస్తా 230 రూపాలయలకు ఇచ్చే విధంగా హౌజింగ్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగింది. 32 సిమెంట్ కంపెనీలు, హౌసింగ్ కార్పొరేషన్ మధ్య ఒప్పందం జరిగింది. మూడు సంవత్సరాల వరకు బస్తా సిమెంట్‌ను 230కి అమ్మేందుకు కంపెనీలు సమ్మతించాయి. గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎన్ ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పథకం చేపట్టిందని, దీనిని సామాజిక బాధ్యతగా భావించి సహకారాన్ని అందించేందుకు సిమెంట్ కంపెనీలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.

ఆర్టీసీలో స్వైపింగ్ మిషన్లు

విజయవాడ, నవంబర్ 24: పెద్దనోట్ల రద్దుతో ఈ వారం పది రోజుల్లోనే రూ.17కోట్ల నష్టం వచ్చిన నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం, చిల్లర సమస్యను అధిగమించేందుకు దశల వారీగా అన్ని బస్ స్టేషన్‌లలో స్వైపింగ్ మిషన్లను ప్రవేశపెట్టనున్నామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు చెప్పారు. స్థానిక పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో గురువారం ఆయన లాంఛనంగా ఈ స్వైపింగ్ మిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రాఘవరావు మాట్లాడుతూ ప్రస్తుతం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ మిషన్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ మెషిన్‌లలో క్రెడిట్, డెబిట్ రూపే కార్డులను స్వైప్ చేసి నగదుకు ప్రత్యామ్నాయంగా కావాల్సిన సేవలను పొందవచ్చన్నారు.

మొబైల్ బ్యాంకింగ్‌లో మహిళాశక్తిని చాటిచెప్పాలి

విజయవాడ, నవంబర్ 24: సంక్షోభాన్ని సవాల్‌గా తీసుకోవాలని, లేకపోతే అది పెరుగుతుందే తప్ప తగ్గదని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకుంటే పరిష్కారం సులువు అవుతుందని స్పష్టం చేశారు. ‘‘మన రాష్ట్ర మహిళా శక్తిని రుజువు చేసే సమయం, అవకాశం వచ్చాయి... మొబైల్ బ్యాంకింగ్‌లో మన రాష్ట్ర డ్వాక్రా మహిళలు దేశానికే రోల్ మోడల్‌గా నిలవాలి, నగదు రహిత లావాదేవీలవైపు ప్రజలను ప్రోత్సహిస్తే దేశంలో అదొక చరిత్రగా మిగిలి పోతుంది’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గురువారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఇకనుంచి ప్రజలతో ముఖాముఖి

హైదరాబాద్, నవంబర్ 24: ముఖ్యమంత్రి కొత్త క్యాంపు కార్యాలయం ‘ప్రగతి భవన్’ రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకం చేసే వేదికగా నిలుస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. ‘ప్రగతి భవన్’లో భాగంగా నిర్మించిన ‘జనహిత’ సమావేశ మందిరం ప్రభుత్వ ప్రథకాలు, విధానాల రూపకల్పనకు, కార్యక్రమాల అమలుకు కార్యాచరణ సిద్ధం చేయడానికి, ప్రజలతో ముఖాముఖి నిర్వహించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. కలెక్టర్లతో సమావేశం నిర్వహించాలంటే గతంలో అందుకు అనువైన వసతి లేక హోటళ్ల చుట్టూ తిరిగేవారమన్నారు.

నల్లధనంపై ఉక్కుపాదం

న్యూఢిల్లీ, నవంబర్ 24: పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల నల్లధనాన్ని పూర్తిగా అరికట్టడం సాధ్యమవుతుందని, అలాగే, దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ పన్నులు ఎగవేత ద్వారా పేరుకు పోయిన నిధులనూ రూపుమాపవచ్చునని కేంద్రం గురువారం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ రకమైన అక్రమ నిధుల వల్ల సమాంతర ఆర్థిక వ్యవస్థ కొనసాగిందని, ఫలితంగా పేదలు, మధ్యతరగతి ప్రజలకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లిందని తెలిపింది. 500, 1000 నోట్ల రద్దుకు సంబంధించి సమస్త వివరాలతో సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. నోట్ల రద్దుకు సంబంధించి చివరి క్షణం వరకూ గోప్యత పాటించామని తెలిపింది.

Pages