S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డివిలియర్స్ కెప్టెన్సీ పదిలం

జొహానె్నస్‌బర్గ్, నవంబర్ 23: గాయానికి శస్త్ర చికిత్స చేయించుకొని, విశ్రాంతి తీసుకుంటున్న ఎబి డివిలియర్స్‌పై దక్షిణాఫ్రికా సెలక్టర్ల నమ్మకం ఏమాత్రం సడల్లేదు. అతని స్థానంలో ఫఫ్ డు ప్లెసిస్ నాయకత్వం వహించి, ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ విజయాలను సాధించిపెట్టినప్పటికీ, జట్టు కెప్టెన్‌గా డివిలియర్స్‌నే కొనసాగించాలని సెలక్టర్లు నిర్ణయించారు. డు ప్లెసిస్‌కు పూర్తి స్థాయిలో పగ్గాలు అప్పగించడానికి ఎవరూ సుముఖత వ్యక్తం చేయలేదని, అందరూ డివిలియర్స్‌ను కొనసాగించాలని తీర్మానించారని చీఫ్ సెలక్టర్ లిండా జోన్డీ తెలిపాడు.

పాయింట్ల కోతపై బిసిసిఐ నిరసన

న్యూఢిల్లీ, నవంబర్ 23: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) మధ్య అగాథం రోజురోజుకూ పెరుగుతున్నది. బిసిసిఐ మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఇప్పుడు ఐసిసి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నందువల్ల నిర్ణయాలన్నీ భారత్‌కు అనుకూలంగానే ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ, ఐసిసి అందుకు భిన్నమైన నిర్ణయాలతో సవాళ్లు విసురుతున్నది. ఈ ఏడాది ఆగస్టు ఒకటి నుంచి అక్టోబర్ 31 మధ్య కాలంలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడేందుకు నిరాకరించిన భారత మహిళా క్రికెట్ జట్టుపై ఆరు పాయింట్ల కోత వేసింది. ఐసిసి మహిళల చాంపియన్‌షిప్ ఆరో రౌండ్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు మూడు మ్యాచ్‌ల్లో ఢీకొనాల్సి ఉండింది.

నేను ఏ తప్పూ చేయలేదు!

అడెలైడ్, నవంబర్ 23: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఒక మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించడంతో తాను ఏకీభవించడం లేదని, నిజానికి తాను ఏ తప్పూ చేయలేదని దక్షిణాఫ్రికా జట్టుకు నాయకత్వం వహిస్తున్న ఫఫ్ డు ప్లెసిస్ స్పష్టం చేశాడు. బుధవారం అతను విలేఖరులతో మాట్లాడుతూ తాను బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడలేదని అన్నాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టు జరుగుతున్నప్పుడు, మింట్‌ను నములుతూ అతను దానినే వేలితో తడి చేసుకొని బంతికి రుద్దాడు. ఈ విషయం టీవీ క్లిప్పింగ్స్‌లో స్పష్టంగా కనిపించింది. దీనితో డు ప్లెసిస్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్టు నిర్ధారించిన ఐసిసి అతనికి ఆ మ్యాచ్‌లో అందాల్సిన ఫీజును జరిమానాగా విధించింది.

సింధు, సైనా శుభారంభం

కౌలూన్, నవంబర్ 23: ఇటీవలే చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను కైవసం చేసుకున్న తెలుగు తేజం పివి సింధు, గాయం నుంచి కోలుకొని మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగిస్తున్న హైదరాబాదీ సైనా నెహ్వాల్ ఇక్కడ జరుగుతున్న హాంకాంగ్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేశారు. సింధు తన తొలి రౌండ్ మ్యాచ్‌లో సుశాంతో యులియాను 21-13, 21-16 తేడాతో సునాయాసంగా ఓ డించింది. సింధు దూకుడుకు కళ్లెం వేయడా నికి యులియా రెండో సెట్‌లో కొంతసేపు పో రాడినప్పటికీ ఫలితం దక్కలేదు.

పాత పెద్ద నోట్ల రద్దు .. డెబిట్ కార్డు చార్జీల ఎత్తివేత

న్యూఢిల్లీ, నవంబర్ 23: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న నేపథ్యంలో.. కొన్ని వెసులుబాట్లను కల్పిస్తున్నాయి ప్రభుత్వ, బ్యాంకింగ్ వర్గాలు. ఈ క్రమంలోనే డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేలా డెబిట్ కార్డు లావాదేవీల చార్జీలను రద్దు చేయాలని బుధవారం బ్యాంకులకు కేంద్రం సూచించింది. అలాగే ప్రస్తుత రబీ సీజన్‌లో రైతుల నగదు అవసరాల దృష్ట్యా మరిన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే రైతులకు సహకార బ్యాంకుల ద్వారా 21,000 కోట్ల రూపాయలను అందించేలా నాబార్డును సిద్ధం చేసింది. ఈ మేరకు ఇక్కడ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ చెప్పారు.

మిస్ర్తివన్నీ అబద్ధాలే

ముంబయి, నవంబర్ 23: టిసిఎస్‌ను రతన్ టాటా అమ్మేద్దామనుకున్నారంటూ సైరస్ మిస్ర్తి చేసిన వ్యాఖ్యలను టిసిఎస్ తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎఫ్‌సి కోహ్లీ ఖండించారు. గతంలో ఐబిఎమ్‌కు టిసిఎస్‌ను అమ్మేయాలని రతన్ టాటా ప్రతిపాదించినట్లు టాటా సన్స్ చైర్మన్‌గా ఉద్వాసనకు గురైన మిస్ర్తి మంగళవారం ఆరోపించినది తెలిసిందే. అయితే ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదని భారతీయ ఐటి పరిశ్రమ పితామహుడిగా భావించే కోహ్లీ బుధవారం చెప్పారు. ఐబిఎమ్‌కు టిసిఎస్‌ను అమ్మేయాలని టాటా గ్రూప్ ఎప్పుడూ ఆలోచించలేదని ఓ ప్రకటనలో ఆయన స్పష్టం చేశారు.

9 నెలల కనిష్టానికి రూపాయి

ముంబయి, నవంబర్ 23: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనమవుతూనే ఉంది. వరుసగా నాలుగో రోజు నష్టపోతూ 9 నెలల కనిష్టాన్ని తాకింది. బుధవారం ఫారెక్స్ ట్రేడింగ్‌లో 31 పైసలు క్షీణించి 68.56 రూపాయల వద్ద నిలిచింది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో విదేశీ మదుపరులు భారత్‌లో పెట్టుబడులను ఉపసంహరించుకుంటుండటం, అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడ్ రిజర్వ్.. వడ్డీరేట్లను పెంచే వీలుందన్న సంకేతాల మధ్య డాలర్ కొనుగోళ్లు పెరిగాయి. దీంతో రూపాయికి డిమాండ్ పడిపోయింది.

జక్కంపూడిలో 28 వేల ఇళ్ల నిర్మాణం

విజయవాడ, నవంబర్ 23: విజయవాడ సమీపంలోని జక్కంపూడిలో పేద, బలహీన వర్గాలు, అల్పాదాయ వర్గాల కోసం అధునాతన సదుపాయాలతో టౌన్‌షిప్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

విదేశీ యాత్రికులు, ఎన్నారైలకు ప్రత్యేక దర్శనం

విజయవాడ, నవంబర్ 23: విదేశీ పర్యాటకులకు, విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పర్యాటక సంస్థను ఆదేశించారు. బుధవారం సాయంత్రం సీఎంఓలో పర్యాటక శాఖాధికారులు భేటి అయినప్పుడు ఆయనపై విధంగా సూచించారు. వారు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు శ్రీవారి దర్శనం ద్వారా మనోభీష్టం నెరవేర్చుకుని వెళ్లే విధంగా సహకరించాలన్నారు. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుతో మాట్లాడాలని ఆయన ఆదేశించారు.

అమరావతి నిర్మాణానికి రూ. 58 వేల కోట్లు

గుంటూరు, నవంబర్ 23: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రస్తుత అంచనాల ప్రకారం 58 వేల కోట్ల రూపాయలు ఖర్చు కాగలదని భావిస్తున్నారు. ఇందులో 2017, 18, 19 సంవత్సరాలలో వౌలిక సదుపాయాల కల్పనకే 32 వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని సీఆర్డీయే అంచనాలు రూపొందించింది. ఈ నిధులను హడ్కో, ప్రపంచ బ్యాంక్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతోపాటు ఇతర మార్గాల ద్వారా సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానిలో ఆవాస సముదాయాల నిర్మాణాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ఇప్పటికే హడ్కో ముందుకొచ్చింది.

Pages