S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోటళ్లు, రెస్టారెంట్లపై అధికారుల దాడులు

సిద్దిపేట, నవంబర్ 22 : సిద్దిపేట పట్టణంలో హోటళ్లు, రెస్టారెంట్లలో అక్రమంగా డోమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తున్న వారిపై సివిల్ సప్లయ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేసి 39 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పౌరసరఫరా శాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం పట్టణంలో 27 హోటళ్లు, రెస్టారెంట్లపై లపై దాడులు చేపట్టి డోమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తున్న వారిపై చర్యలు చేపట్టారు. వారిపై నిత్యవసరాల చట్టం 1955 6ఎపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈసందర్భంగా డిసిఎస్‌ఓ వెంకటేశ్వర్లు డోమెస్టిక్ సిలిండర్లను గృహావసారాలకు మాత్రమే వినియోగించాలన్నారు.

చేత రాత బాగు లేదని విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడు

నారాయణఖేడ్ నవంబర్ 22: నారాయణఖేడ్ పట్టణంలోని వివేకానంద ప్రైవేటు పాఠశాలలో ఖేడ్ పట్టణానికి చెందిన హమేర్ అనే విద్యార్థి 5వ తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. సోమవారం సాయంత్రం పాఠశాలలో సైన్స్ సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయుడు మితిన్ భారత్ విద్యార్థి హమేర్‌కి సంబంధించిన హోమ్ వర్క్‌ను పరిశీలించారు. అందులోని చేతి రాత ఎంత చెప్పినా మారడం లేదని కోపోద్రిక్తుడైన ఉపాధ్యాయుడు హమేర్‌ను భజంపై, చేతిపై కట్టెతో కొట్టారు. ఈవిషయంపై హమేర్ ఇంటికి వెళ్లి తండ్రి అబ్ధుల్ హమీద్‌కు తెలిపారు. వెంటనే పాఠశాలకు వచ్చి పాఠశాల యాజమాన్యాన్ని తన కొడుకును కోట్టిన విషయమై అడిగారు.

కదంతొక్కిన ఎర్రదండు

నాగర్‌కర్నూల్, నవంబర్ 22: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సిపిఐ మహాసభలు మంగళవారం నాగర్‌కర్నూల్ పట్టణంలో ఘనంగా ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా సిపిఐ కార్యకర్తలు, సానుభూతిపరులు, కళాకారులతోపాటు వివిధ సంఘాల నాయకులతో కలిపి నిర్వహించిన మహాప్రదర్శన పట్టణ ప్రజలను ఎంతో ఆకట్టుకుంది. ఎర్ర జెండాలను చేతపట్టుకొని ఊరేగింపులో పాల్గొనడంతో పట్టణమంతా కూడా ఎర్రరంగుమయమైంది. ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు, డప్పు శబ్దాలు, బాలికల కోలాటాలు, రంగస్థల కళాకారుల ప్రదర్శన తదితర ప్రదర్శనలు ప్రజలను ఎంతో ఆకట్టుకున్నాయి.

నల్లకుబేరులకు మోదీ వంత

నాగర్‌కర్నూల్, నవంబర్ 22: అధికారంలోకి వస్తే వంద రోజుల్లో నల్లధనాన్ని వెలికితీస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన మోదీ ఆ హామీని గాలికొదిలేసి నల్లకుబేరులకు వంత పాడుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థాయి బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ పెద్దనోట్లను రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామని, కానీ దాని పర్యావసనాలను అంచనా వేయడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.

అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

కొడంగల్, నవంబర్ 22: రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం కొడంగల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి, చేకల్‌కోడ్ గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్దికి ముఖ్యమంత్రి కెసి ఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రధానంగా రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు నడుస్తుందని తెలిపారు. యదావిధిగా 9 గంటల విద్యుత్‌ను ఇచ్చి రైతులను ఆదుకున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కిందన్నారు.

భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డులో 600 కోట్లు

మహాబూబ్‌నగర్, నవంబర్ 22: భవన నిర్మాణ కార్మికులను ఆదుకునేందుకే వెల్ఫేర్‌బోర్డును ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో రూ. 600 కోట్లు నిధులు ఉన్నాయని ఆ నిధులను వాడుకోవడంలో కార్మికులకు అవగాహన లేక నిధులు ఏళ్ల తరబడి మూలుగుతున్నాయని, వాటిని కార్మికులకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర కార్మిక, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాలుగవ మహాసభకు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, లక్ష్మారెడ్డిలు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

మిషన్ భగీరథలో నిర్లక్ష్యం సహించం

వనపర్తి, నవంబర్ 22: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనుల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని వనపర్తి జిల్లా కలెక్టర్ శే్వతా మహంతి అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వాటార్‌గ్రీడ్, ఆర్‌డబ్ల్యూ ఎస్ అధికారులతో జిల్లాలో చేపట్టిన మిషన్ భగీరథ పనులపై ఆమె సమీక్ష నిర్వహించారు. పనులు జరిగే చోట ఒక రోజు ముందుగానే మెటీరియల్ సిద్ధంగా ఉంచుకుంటే త్వరితగతిన పనులు పూర్తవుతాయన్నారు. నిర్ధేశించిన లక్ష్యం ప్రకారం పనులు చేసుకుంటూ వెళ్లితే సకాలంలో పూర్తవుతాయని ఆమె అన్నారు.

కుటుంబ పాలనను కూల్చేందుకు టిడిపి పోరాటం

నల్లగొండ, నవంబర్ 22: తెలంగాణ అమరుల ఆశయాలకు నీళ్లోదిలి ఎన్నికల హామీలను తుంగలో తొక్కి రాష్ట్రాన్ని దోచుకుంటున్న సీఎం కెసిఆర్ కుటుంబ పాలనను కూలద్రోసే వరకు టిడిపి పోరాడుతుందని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని ఎన్‌జి కళాశాల మైదానంలో జరిగిన తెలంగాణ రైతు పోరుయాత్ర సభలో రేవంత్‌రెడ్డి మరోసారి సీఎం కెసిఆర్ పాలనపై నిప్పులు చెరిగారు.

మిషన్ భగీరథ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

పెద్ద అడిశర్లపల్లి, నవంబర్ 22: తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికి కృష్ణా జలాలు అందించేందుకు చేపడుతున్న మిషన్ భగీరథ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. మంగళవారం మండలంలోని జంట నగరాల ప్రజలకు సాగునీరు అందించే కోదండాపురం ప్లాంటులో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా ప్రజల త్రాగునీటి కోసం టేయిల్‌పాండ్, ఉదయసముద్రం, అక్కంపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ల నుండి కృష్ణా జలాలను తీసుకొని అందించడం జరుగుతుందన్నారు.

తహసీల్దార్ సస్పెన్షన్

మిర్యాలగూడ, నవంబర్ 22: అక్రమ ఇసుక రవాణా కేసులో వేములపల్లి తహసీల్దార్ సరస్వతిని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సస్పెండ్ చేశారని స్థానిక ఆర్డీఓ బి.కిషన్‌రావు తెలిపారు. మంగళవారం స్థానిక రెవిన్యూ డివిజన్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 14న వనస్థలిపురంకు చెందిన బి.యాదయ్య ఇసుక డంప్ నుండి 2 లారీల్లో ఇసుక తరలిస్తుండగా తహసీల్దార్ సరస్వతి స్వాధీనం చేసుకున్నారని, వాటికి సుమారు 50,000 రూపాయలు జరిమానా విధించాల్సి ఉండగా, కేవలం 10,000 రూపాయలు మాత్రమే జరిమానా విధించారని తెలిపారు.

Pages