S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాబు ముఖ్యమంత్రి కావడమే రాష్ట్రానికి ప్రత్యేక హోదా

తిరుపతి, అక్టోబరు 25: చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కావడమే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ కార్యక్రమంలో చంద్రన్న దళితబాట కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులు, గిరిజనుల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని దళితులకు, గిరిజనులకు చేరాలనే లక్ష్యంతోనే వారిలో అవగాహన పెంచేందుకు 13 జిల్లాల్లో చంద్రన్న దళితబాట కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా నుంచి చేపట్టామన్నారు.

భూముల సేకరణలో వివక్షకు తావు లేదు

తిరుపతి, అక్టోబరు 25 : రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడం కోసం దళితుల భూములే కాదు, అందరి భూములూ సేకరిస్తున్నారని, అభివృద్ధిని అడ్డుకోకూడదని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అన్నారు. మంగళవారం నాడు స్థానిక పద్మావతి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు దళిత గిరిజనుల పక్షపాతి అన్నారు. అందుకే వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. అందుకే నవంబర్ 14న రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో దళిత గిరిజన ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఘనంగా సన్మానించనున్నామన్నారు.

రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టుకు చంద్రగిరి విద్యార్థి ఎంపిక

చంద్రగిరి, అక్టోబర్ 25: రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టు తరుపున జాతీయ స్థాయిలో నిర్వహించే ఫుట్‌బాల్ పోటీలలో చంద్రగిరి విద్యార్థి మోహన్‌కృష్ణ పాల్గొంటున్నట్లు ఎం ఇ ఓ ప్రభాకర్‌రాజు మంగళవారం తెలిపారు. చంద్రగిరి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఆయన మాట్లాడుతూ ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు గుంటూరుజిల్లా నరసారావుపేటలో జరిగిన 62వ రాష్టస్థ్రాయి ఫుట్‌బాల్ పోటీలలో చంద్రగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థి మోహన్ కృష్ణ జిల్లా జట్టుతరపున పాల్గొన్నారు.

లగేజి కౌంటర్లను తనిఖీ చేసిన టిటిడి ఇ ఓ

తిరుమల, అక్టోబర్ 25: తిరుమలలోని పిఎసి-4, కల్యాణకట్ట ప్రాంతాల్లో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన లగేజి కౌంటర్లను టిటిడి ఇ ఓ డాక్టర్ డి.సాంబశివరావు మంగళవారం తనిఖీ చేశారు. సుపథం వద్ద లగేజి కౌంటర్‌లో భక్తులతో ముచ్చటించి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులనుంచి లగేజి తీసుకోవడం, డిపాజిట్ చేయడం, తిరిగి అప్పగించడాన్ని పరిశీలించారు. భక్తులకు లగేజి అప్పగించే విధానం మరింత సౌకర్యవంతంగా ఉండాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. అనంతరం సమాచార కేంద్రాలను ఇ ఓ పరిశీలించారు.

సిటిఓ సస్పెన్షన్‌కు తెలుగుదేశం పార్టీ నేతలే అడ్డు

మదనపల్లె, అక్టోబర్ 25: వ్యాపారుల హక్కులను హరిస్తున్న సిటిఓ శ్రీనివాసులునాయుడుని సస్పెండ్ చేయకుండా అధికార తెలుగుదేశం పార్టీ నాయకులే అడ్డుతగులుతున్నారని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, కాపుసంఘాల జెఎసి నేతలు తీవ్రంగా విమర్శించారు. సిటిఓ చేస్తున్న అక్రమదాడులకు నిరసనగా స్థానిక బెంగళూరు బస్టాండ్ సర్కిల్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం ఏడవరోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో వ్యాపారులకు మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌బాష, జెఎసి నాయకులు షరీఫ్, జింకాచలపతి, పిటిఎం శివప్రసాద్, బందెల గౌతమ్‌కుమార్, శేఖర్, దివాకర్ తదితరులు మద్దతు ప్రకటిస్తూ పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధితో దేశపురోభివృద్ధి

తిరుపతి, అక్టోబర్ 25: గ్రామాల అభివృద్ధితో దేశ పురోభివృద్ధి సాధిస్తూందన్న అంబేద్కర్ ఆశయాన్ని విస్మరించవద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కారెం శివాజి పేర్కొన్నారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో మంగళవారం బి.అంబేద్కర్ ఆలోచనలు- యువత సాధికాతర అనే అంశంపై ఒక్కరోజు సదస్సు ఉపకులపతి ఆచార్య ఆవుల దామోదరం అధ్యక్షతన జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కారెం శివాజి మాట్లాడుతూ భరతజాతి ఆత్మగౌరవం చాటి చెప్పిన ఘనత అంబేద్కర్‌కు దక్కుతుందన్నారు. యువత అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమాజం కోసం పాటు పడాలని పిలుపునిచ్చారు.

పట్ట్భద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ల నమోదు పెరిగేందుకు అధికారులు కృషి చేయాలి

తిరుపతి, అక్టోబర్ 25: పట్ట్భద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ల నమోదు పెరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయపు సమావేశ మందిరంలో వారు రెవెన్యూ అధికారులతో ఈ విషయమై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ల నమోదు బాగా తక్కువగా ఉందన్నారు. కావున టీచర్లు అందరూ తప్పకుండా ఓటర్లుగా నమోదు చేయించుకోవాలన్నారు. నవంబర్ 5న ఓటర్లుగా నమోదుకు ఆఖరు తేదీ అన్నారు.

సూర్యలంక తీరంలో పెనువిషాదం

బాపట్ల, అక్టోబర్ 25: విహారయాత్రకు వచ్చిన స్నేహితులకు సూర్యలంక తీరం పెనువిషాదాన్ని నింపింది. మంగళవారం గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంక తీరానికి వచ్చిన 9 మంది ఇంజినీరింగ్ విద్యార్ధుల బృందంలో ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనతో ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉండే తీరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వివరాల్లోకి వెళితే కోనేరు లక్ష్మయ్య యూనివర్శిటీ మరియు విజ్ఞాన్ యూనివర్శిటీలలో బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమ బాల్యస్నేహాన్ని పురస్కరించుకొని కలసి సరదాగా విహారయాత్రకు సూర్యలంక సముద్రతీరానికి చేరుకున్నారు.

ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలపై విజిలెన్స్ దాడులు

గుంటూరు, అక్టోబర్ 25: కల్తీ బయోఉత్పత్తుల విక్రయాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం అందిన సమాచారం మేరకు విజిలెన్స్ అధికారులు గుంటూరులోని వివిధ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. దాడుల్లో సుమారు 60 లక్షల రూపాయల విలువ చేసే బయో ఉత్పత్తులను సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి 100 రకాల బయో ఉత్పత్తుల క్రయ విక్రయాలను నిలుపుదల చేస్తూ అధికారులు ఆదేశాలు జారీచేశారు. విజిలెన్స్ ఎస్‌పి సి శోభామంజరి నేతృత్వంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో గల క్రాంతి, రవి, గ్రంథి, లక్ష్మీ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలపై దాడులు నిర్వహించారు.

జగన్ మకాం ఇక్కడే

గుంటూరు, అక్టోబర్ 25: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులోనే నివాసం ఏర్పాటుచేసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. కొద్దినెలల క్రితం వరకు రాజధాని ప్రాంతంలో విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో పార్టీ కార్యాలయంతో పాటు పార్టీ అధినేత నివాసానికి అనువైన ఇళ్లు, స్థలాలను పార్టీ నేతలు పరిశీలించారు. రాజకీయ పార్టీల కార్యాలయాలకు స్థల కేటాయింపులు జరుపుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జాబితాలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య స్థల వ్యత్యాసాల నేపథ్యంలో వైసిపి వ్యతిరేకించింది. పార్టీ పరంగా సొంత భవనాలను నిర్మించుకోవాలనే యోచనతో ఉన్నట్లు తెలిసింది.

Pages