S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పద్ధతి మార్చుకోండి

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి బుధవారం సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. లోధా కమిటీ సిఫార్సుల అమలును వాయిదా వేసుకుంటూ వస్తున్న బోర్డు వైఖరిపై సుప్రీం కోర్టు తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. బోర్డు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, సమస్యను పరిష్కరించాలంటే పాలక మండలి మొత్తాన్ని రద్దు చేయాల్సిందేనని కోరుతూ లోధా కమిటీ సమర్పించిన స్టేటస్ రిపోర్ట్‌ను పరిశీలించిన సిజె టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. పద్ధతి మార్చుకోవాలని ఆదేశించింది. చట్టానికి అతీతులమని అనుకుంటే అది ముమ్మాటికే తప్పేనని స్పష్టం చేసింది.

చొరబాట్లపై ఉక్కుపాదం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28:సరిహద్దు చొరబాట్లను పూర్తి శక్తితో తిప్పికొట్టాలని సైనిక దళాలను రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ ఆదేశించారు. ఉరీ సైనిక శిబిరంపై ఉగ్రవాద దాడి నేపథ్యంలో నెలకొన్న భద్రతా పరిస్థితిపై త్రివిధ దళాల అధిపతులతో బుధవారం ఆయన సమీక్ష జరిపారు.

సమన్వయంతోనే ఫలితాలు

విజయవాడ, సెప్టెంబర్ 28: అభివృద్ధి సాధించడంతో పాటు ఆ ఫలాలు ప్రజలకు అందేలా చేయడలోనే పాలనా యంత్రాంగం పటుత్వం ఆధారపడి ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అభివృద్ధి ప్రజల వాస్తవ జీవితాల్లో కనిపించే విధంగా ప్రభుత్వంలో భాగంగా ఉన్న ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. రెండు రోజుల పాటు జరిగే జిల్లా కలెక్టర్ల సమావేశాన్ని బుధవారం ప్రారంభించిన చంద్రబాబు పరిపాలన సంస్కరణలను ఏ విధంగా తీసుకురావాలో దిశా నిర్దేశం చేశారు. తాను నవ్వుతూ, నవ్విస్తూ ఈ సమావేశాన్ని ఎంతో ఉత్సాహభరితంగా నడిపారు.

రైళ్ల కోలాహలం

విజయవాడ, సెప్టెంబర్ 28: కొన్నిరోజులుగా ప్రయాణికులు అనునిత్యం విజయవాడ రైల్వేస్టేషన్ ఔటర్‌ల వద్ద గంటల తరబడి నిరీక్షించే పరిస్థితి ఎట్టకేలకు తప్పింది. దాదాపు రూ. 150 కోట్లతో రూట్ ఇంటర్ లాకింగ్ సిస్టం ఏర్పాటు కోసం ఈ నెల 21 నుంచి 28వరకు రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచినప్పటికీ ప్రయాణికులు ఎంతగానో సహకరించారు. అలాగే రైల్వే అధికారులు కూడా దాదాపు మూడు వేలమంది కార్మికులతో రాత్రి, పగలు పనులు చేయించి పనులను శరవేగంగా పూర్తి చేయించారు. బుధవారం తెల్లవారుజాము నుంచి నూతన ఆర్‌ఆర్‌ఐ సిస్టం ద్వారా రైళ్లు క్రమేణా ఆయా ప్లాట్‌ఫారాలపైకి రావటం ప్రారంభమైంది.

మళ్లీ ఆగిన కావేరి!

న్యూఢిల్లీ/బెంగళూరు, సెప్టెంబర్ 28: తమిళనాడుకు బుధవారం నుంచి రోజుకు ఆరు వేల క్యూసెక్కుల చొప్పున శుక్రవారం వరకూ కావేరీ జలాలను అందించాలంటూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశం అమలును కర్నాటక గురువారం వరకూ వాయిదా వేసింది. రేపు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ముఖ్యమంత్రుల సమావేశం ఫలితాన్ని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని కర్నాటక సిఎం సిద్ధరామయ్య వెల్లడించారు. సుప్రీం కోర్టు తాజా తీర్పు నేపథ్యంలో మొదట అఖిల పక్ష సమావేశం, అనంతరం సుదీర్ఘ కేబినెట్ భేటీ జరిగింది. వీటి వివరాలను మీడియాకు వెల్లడించిన ముఖ్యమంత్రి ఢిల్లీలో జరిగే ఇరు రాష్ట్రాల సిఎంల సమావేశంలో వాస్తవ పరిస్థితులను వివరిస్తామన్నారు.

మహాగణపతి నిమజ్జనం

విశాఖపట్నం (గాజువాక), సెప్టెంబర్ 28: మూడు వారాలుగా భక్తుల పూజలందుకున్న 78 అడుగుల భారీ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చోటే నిర్వాహకులు బుధవారం రాత్రి నిమజ్జనం చేశారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలో విశ్వా అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి పురస్కరించుకుని 78 అడుగుల భారీ గణపతిని ప్రతిష్ఠించిన విషయం విదితమే. గాజువాక లంకావారి మైదానంలో ప్రతిష్ఠించిన గణపతి విగ్రహం 21 రోజులు పాటు భక్తులకు దర్శనమిచ్చారు. బుధవారం వేలాది మంది భక్తుల సమక్షంలో అగ్నిమాపక శకటాల సహాయంతో వేదిక వద్దే నీరు చిమ్ముతూ నిమజ్ఞనం చేశారు. నిమజ్ఞనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు.

29-09-2016

దివ్యత్వం

ఎవరు ఏ పనులు చేయక జడ పదార్థాలలా ఉన్న చోటునే అంటిపెట్టుకొని ఉంటారు. ఎవరికి హృదయం ఉండదు అని యక్షుడు ప్రశ్నిస్తే రాతికి హృదయం ఉండదు అని యుధిష్ఠిరుని సమాధానం. రాయివంటి జడ పదార్థానికి హృదయము చైతన్యము ఉండవు. మనం జడ పదార్థాలం కాము కనుకనే ఈ ఉరకలు పరుగులు.

-గుమ్మా ప్రసాదరావు

కాశీఖండం 24

‘‘ఆ మచ్చిక, ఆ చనవు, ఆ అనురాగతిశయమున్ను వివరించి చెప్పవశము కాదు. భూవలయ తిలకుడు అయిన ఓ కాశీక్షేత్రమా! నిన్ను విడిచి పరభూమికి ఏ విధంగా పోగల్గుతాను? ఊర్థ్వ బాహుడిని అయి ముమ్మాటికీ నిక్కమే వక్కాణిస్తాను. నా సత్యవాక్కుకి వేదవాణి, జాహ్నవీనది, పరమశివుడు, డుంఠి విఘ్నేశ్వరుడు, పరమ సాక్షులు. ఓ పరమ శివుడి కూర్మి పట్టణమూ, ఓ వారణాసీ! ఓ కల్యాణీ! నీ వంటి నగరాలు కానీ తీర్థ రాజాలు కానీ ఈ బ్రహ్మాండంలో ఎందునా కానరావు. వినరావు.

శ్రీపాద కృష్ణమూర్తి

Pages