S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోటల్‌పైకి దూసుకెళ్లిన బస్సు..!

సుల్తానాబాద్, సెప్టెంబర్ 27: సుల్తానాబాద్ ఆర్టీసి బస్టాండ్ వద్ద మంగళవారం ఘోరప్రమాదం తప్పింది. కరీంనగర్ నుండి పెద్దపల్లి వైపుకు లారీ వెళ్తుంది. పెద్దపల్లి నుండి సుల్తానాబాద్‌కు బస్సు వస్తుంది. బస్సు బస్టాండ్‌లోకి వెళ్లేందుకు వస్తుండగా భారీ వాహనంగల లారీ అతను గమనించి ఒక్కసారిగా బస్టాండ్‌లోకి లారీని పో నిచ్చాడు. దీంతో ఆర్టీసి బస్సు పక్కనే ఉన్న సాయిశ్రీ హోటల్‌పైకి దూసుకెళ్లింది. హోటల్ ముందు వేసిన రేకులు బస్సులోకి పోవడంతో అద్దాలు ధ్వసంమయ్యాయి. లారీ-బస్సు ఢీకొంటే పె ద్దఎత్తున ప్రాణనష్టంతోపాటు ఎంతో మంది క్షతగాత్రులైఉండేవారు.

అలా అనడం సర్కార్‌కు అలవాటైపోయింది

కరీంనగర్, సెప్టెంబర్ 27: మంచి జ రిగితే ప్రభుత్వ గొప్పతనం, నష్టం జరిగితే గత పాలకుల అసర్ధత వల్లే అనడం టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి అలవాటై పోయిందని మాజీ ఎంపి, టిపిసిసి ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక ము ఖ్యమంత్రి హోదాలో ఉన్నవ్యక్తికి ఉ ండే విచక్షణ అధికారాలను వినియోగించి ఇచ్చిన హామీలను నెరవేర్చేందు కు ప్రయత్నాలు చేయాలేతప్ప ఇలా బహిరంగంగా క్షమాపణలు చెప్పడం సిగ్గుచేటన్నారు. వేములవాడ రాజన్న సాక్షిగా మిడ్‌మానేర్ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తానని చెప్పి ఏడాది తర్వాత చేతులెత్తయడం సరికాదన్నారు.

పర్యాటక రంగ అభివృద్ధికి .. విస్తృత అవకాశాలు

కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 27: జి ల్లాలో పర్యాటకరంగం అభివృద్ధికి వి స్తృతమైన అవకాశాలున్నాయని జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. మంగళవారం సాయంత్రం కళాభారతిలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లాకు ఆధ్యాత్మిక, చారిత్రి క ప్రాధాన్యత ఉన్నదన్నారు. జిల్లాలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు. కొత్త జిల్లాలు ఏర్పడుతున్నప్పటికీ ప్రాంతీయ అభివృద్ధికి కళలు, పర్యాటక రంగం రెండు కళ్లలాంటివని, వీటి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జిల్లా కళలకు కాణాచీ అని తెలిపారు.

బడుగుల ఆశాజ్యోతి కొండా లక్ష్మణ్ బాపూజీ

ఆదిలాబాద్, సెప్టెంబర్ 27: బడుగు వర్గాల అభ్యున్నతి కోసం, తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం రాజీలేకుండా పోరాడిన మహానీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 101వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రభుత్వ పండగగా మంగళవారం కలెక్టర్ సమావేశ మందిరంలో జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సంధర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు ఘనంగా నివాళులర్పించారు.

స్వర్ణ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి అల్లోల

దివ్యనగర్, సెప్టెంబర్ 27: సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టును రాష్ట్ర దేవాదాయ, న్యాయ, గృహనిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మంగళవారం జిల్లా ప్రత్యేక అధికారి వికాస్‌రాజ్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులో నీటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో రైతులకు రెండు పంటలకు సాగునీరు విడుదలచేసే అవకాశం కలిగిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపట్టిన మిషన్ కాకతీయ పథకం సత్ఫలితాలిచ్చిందన్నారు.

గోదావరిలోకి ఎల్లంపల్లి ప్రాజెక్టు నీరు

మంచిర్యాల, సెప్టెంబర్ 27: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోని నీటిని గోదావరిలోకి ఇరిగేషన్ శాఖ అధికారులు వదలుతున్నారు. మంగళవారం సాయంత్రం వరకు 36 గేట్ల ద్వారా 4,94,526 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20 టీ ఎంసీల నీటిని నిల్వ చేయాల్సి ఉండగా, 148మీటర్ల నీటి మట్టంకు 146.5మీటర్ల నీటి మట్టం ప్రాజెక్టులో నిల్వ ఉండటంతో గోదావరిలోకి నీటిని వదులుతున్నారు.

మధ్యంతర ఉత్తర్వులతో నిర్వాసితుల్లో ఆనందం

కాసిపేట, సెప్టెంబర్ 27: సింగరేణి యాజమాన్యం చేపట్టే కళ్యాణిఖని మెగా ఓపెన్‌కాస్టు పనులను నిలిపి వేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఇవ్వడంతో నిర్వాసితులలో ఆనందం వెల్లి విరిసింది. మంగళవారం మందమర్రి నుండి కాసిపేట వరకు ర్యాలీని నిర్వహించారు. సోమగూడెం, కాసిపేటలలో నిర్వాసితులతో కలిసి ప్రజా సంఘాల నాయకులు పాల్గొని సంబరాల్లో మునిగి తేలారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు కేసిఆర్ ఓపెన్‌కాస్టులను రానీయమని వాగ్దానాలు చేసి అధికారం చేపట్టగానే ఓసిలకు తెరలేపారిని విమర్శించారు.

చెక్‌పోస్టు సమీపంలో బొగ్గు లభ్యం

తాండూర్, సెప్టెంబర్ 27: మండల కేంద్రం సమీపంలోని సింగరేణి సిఐఎస్‌ఎఫ్ చెక్‌పోస్టు కూతవేటు దూరంలో మంగళవారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు టిప్పర్‌తో బొగ్గును డంప్ చేశారు. స్థానికులు బొగ్గు డంప్ కుప్పను చూసి సింగరేణి అధికారులు, ఎస్‌అండ్‌పిసి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంబంధిత అధికారులు సంఘటన స్థలాన్ని చేరుకుని విచారణ చేపట్టారు. దాదాపు 3టన్నుల బొగ్గును స్వాధీనం చేసుకుని గోలేటి-1ఎ గని తరలించారు. బెల్లంపల్లి ఏరియాలోని ఓపెన్‌కాస్టు నుండి తరలిస్తున్న బొగ్గు టిప్పర్ డ్రైవరే చెక్‌పోస్టు దాటిన తర్వాత బొగ్గును డంప్ చేసినట్లు తెలుస్తోంది.

రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

ఆదిలాబాద్, సెప్టెంబర్ 27: జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటనష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకొని పరిహారం అందించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్ జాదవ్ అన్నారు. మంగళవారం వరద ప్రభావిత పంటక్షేత్రాలను నరేష్ జాదవ్ పరిశీలించారు. ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, ఇచ్చోడ, తలమడుగు, బోథ్ మండలాల్లో సోయాబీన్ పంట పూర్తిగా దెబ్బతిందని, సోయాబీన్ గింజలకు మొలకలు వచ్చి పూర్తిగా నష్టాన్ని మిగిల్చిందన్నారు.

నీట మునిగిన శనేశ్వరాలయం

దండేపల్లి, సెప్టెంబర్ 27: దండేపల్లి మండలం గూడెం గోదావరి నది వద్ద గల శనేశ్వరాలయం మంగళవారం పూర్తిగా నీట మునిగింది. శ్రీరాంసాగర్ కడెం ప్రాజెక్టుల నుంచి వరద గేట్లు ఎత్తడంతో గోదావరిలో వరద ఉదృతి పెరిగింది. దీంతో గోదావరి ఒడ్డున గల శనేశ్వరాలయం పూర్తిగా నీట మునిగింది.

Pages